Paper with Mango: మామిడి కాగితం అనేది చేతితో తయారు చేయబడింది. ఈ కాగితాలను థాయిలాండ్ మరియు భారతదేశంలో అధికంగా ఉత్పత్తి చేస్తారు. దీనికి చిరి పేపర్‌కు కొద్ది పాటు తేడా మాత్రమే ఉంది. చిరి పేపర్ అనేది పొడవుగా ఉన్న కోజో ఫైబర్స్ ఇంకా మల్బరీ యొక్క బెరడులతో తయారు చేస్తారు.ఇవే పదార్థాలను మామిడి కాగితాన్ని తయారు చేయడానికి కూడా వాడుతారు, కానీ మల్బరీ బెరడుల బదులు, కోజో ఫైబర్స్ను 60:40 సమతౌల్యంలో ఉపయేగిస్తారు.
ఈ పేపర్ చాలా తక్కువ బరువుతో , సున్నితంగా మరియు సెమీ పారదర్శక వంటి లక్షణాలు ఉంటాయి .ఇవి అనేక రంగులలో లభ్యమవుతాయి , కానీ మాములుగా పసుపు మరియు ఆకుపచ్చ రంగులలో ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఈ కాగితం రంగు అనేది దీని తయారీకి ఉపయేగించే మామిడి రకంపై ఆధారపడుతుంది. ఈ మామిడి ఆకులను చిన్న ముక్కలుగాతయారీలో వాడుతారు.వెలుగులో ఉన్నపుడూ ఈ ఆకులు కాగితంలో మొత్త మెరుస్తాయి. ఈ కాగితాలకు pH 6 ఉండటం వలన ఇది ఆమ్ల గుణం కలిగి ఉంటుంది. ఈ పేపర్ను ఆహ్వానాలను ముద్రించడానికి , గిఫ్ట్ ర్యాప్‌లు, లాంప్‌షేడ్‌లు, స్క్రీన్‌లు, టేబుల్ క్లాత్‌ల తయారీకి వాడుతారు. మరియు క్రాఫ్ట్‌లు, కోల్లెజ్‌లు, లెటర్‌ప్రెస్, బుక్ ఆర్ట్స్ను అలంకరించంలో ఉపయోగిస్తారు. మామిడి యొక్క తీయనైన సువాసన మరియు రుచి ఇంకా ఉండటం వలన ఒక విశిష్టతను కలిగిస్తుంది.
ఉత్పత్తిలో వివిధ దశలు:
ఒక విండో ఫ్రేమ్‌లు, రెండు ఫోటో ఫ్రేమ్‌లు, నీరు, పేపర్ ముక్కలు లేదా కోజో ఫైబర్‌లు, జెలటిన్ మరియు మామిడి సారం ఉంటే ఈ మ్యాంగో పేపర్ ను ఎవరైనా సులభంగా తయారీ చేసుకోవచ్చు.
ముందుగా విండో ఫ్రేమ్‌తో మొదటి పిక్చర్ ఫ్రేమ్‌ను అనీ వైపులా అనగా నాలుగు వైపులా డక్ట్ టేప్ లేదా స్టేపుల్ గన్ ను ఉపయోగించి అతికించాకా, ఆ స్క్రీన్‌ను తలకిందులుగా చేయాలి. ఇప్పుడు రెండవ పిక్చర్ ఫ్రేమ్‌న మొదటి ఫ్రేమ్‌పై పెట్టాలి.ఇప్పుడు కాగితం, రెండవ ఫ్రేమ్ ఒకే పరిమాణంలో ఉంటాయి.
Also Read: కలుషిత మామిడి పండ్ల పట్ల జాగ్రత్త
ఇప్పుడు, కాగితాన్ని చిన్న ముక్కలుగా చింపి జెలటిన్ మరియు వేడినీటిని వేసి బ్లెండర్లో పట్టాలి . ఈ మిశ్రమాన్ని అరగంట వరకూ నానబెట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి మామిడికాయ గుజ్జును వేసి మెత్తని పేస్ట్ అయే వరకు బ్లెండర్ లో మళ్ళీ పట్టాలి. ఇప్పుడు ఈ మెత్తని పల్ప్‌ను రెండవ ఫ్రేమ్‌లో రంధ్రాలు లేకుండా సమిసమానంగా పొయాలి. స్క్రీన్లో అదనంగా ఉన్న నీటిని ఫ్రేమ్‌లను ఎత్తి బయటకు పంపాలి . ఇప్పుడు పై ఫ్రేమ్‌ను తొలగించి , ఈ గుజ్జును కాగితపు టవల్ పై సమినంగా వేసి , ఆరబెట్టాలి. అది ఆరిన తర్వాత, ఒక మంచి తీపి సువాసన మరియు రుచితో కూడిన మామిడి కాగితం తయారవుతుంది.
Also Read: బెండి ప్లక్కర్, టీ ప్లక్కర్ (కత్తెర రకం)