మన వ్యవసాయంవ్యవసాయ వాణిజ్యం

Nutrient Management in Tobacco: పొగాకు పంటలో ఎరువుల యాజమాన్యం.!

1
Nutrient Management in Tobacco
Nutrient Management in Tobacco

Nutrient Management in Tobacco: ఆరు నుండి ఎనిమిది వారాల వయసుగల నారును పొలములో నాతవలెను. ఆగష్టు, సెప్టెంబరు మాసము బీడీ పొగాకు, సెప్టెంబరు, అక్టోబరు మాసములు నాటు పొగాకు నాట్లు వేయుటకు అనువైనవి. బీడీ పొగాకు మొక్కలకు 75×75 సెం.మీ దూరము, నాటు పొగాకుకు 70×70 సెం.మీ దూరము ఇవ్వవలెను.అరోగ్యవంతమైన నారు మొక్కలు పొగాకు పంట అధిక దిగుబడికి, నాణ్యతకు ప్రధమ సోపానము. కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ గత 6 దశాబ్దాలుగా ఆరోగ్యవంతమైన నారు మడులను పెంచడానికి, నాణ్యత గల పొగాకును పండించడానికి కృషి చేస్తూ, మేలైన యాజమాన్య పద్ధతులను కనుగొని, వ్యవసాయంలో ఖర్చుతగ్గించడానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది.

Nutrient Management in Tobacco

Nutrient Management in Tobacco

Also Read: Tobacco Harvesting Techniques: పొగాకు కోత మరియు పదును చేయడంలో మెళుకువలు.!

ప్రధాన పొలంలో మొక్కల స్థానాన్ని నిలువుగా, అడ్డంగా నడిపి గుర్తిస్తారు. పరస్పరం ఖండించుకునే బిందువుల వద్ద నారు మొక్కలు జాగ్రత్తగా నాటుతారు. నాటి సమయంలో తగినంత తేమ ఉండేట్లు చూస్తే వారు మొక్కలు స్థిరపడతాయి. వానలు లేకపోతే నాటి స్థలాలకు నారు మొక్కలు నాటే ముందు కుండతో నీరు పోస్తారు.

ఎరువుల యాజమాన్యం:

ఒక హెక్టారు బీడీ పొగాకుకు 110 కిలోల నత్రజని, 70 కిలోల పాస్పరసు 50 కిలోల పొటాష్ నిచ్చు ఎరువులను, నాటు పొగాకుకు 40 కిలోల నత్రజని, 50 కిలోల పాస్పరము, 50 కిలోల భాస్వరాన్నిచ్చే రసాయనక ఎరువులు వాడాలి. నత్రజని ఎరువును రెండు సమభాగాలుగా చేసి నాటడానికి ముందు, నాటిన 25-30 రోజుల లోపల వేసుకోవాలి. భాస్వరము, పొటాష్ ఎరువులను ఒక మోతాదులో వేయాలి. పొటాష్ ఎరువును సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇవ్వాలి. ఎరువులను మొక్కలను నాటుటకు ఒక వారము రోజులు ముందుగా మొక్కలు నాటు దాళ్ళలో, నాగటి చాళ్ళు తీసి వేయాలి.

సేద్యం మూడు పళ్ళ గొర్రుతో గాని, గుంటకతో గాని చేయవలెను. నేలలో వున్న తేమను బట్టి పైరు పెరుగుదలను బట్టి చేనులో వున్న కలుపును బట్టి ఎడసేద్యము చేసుకొనవలెను.

మొగ్గ ప్రారంభమయ్యే దశలో బీడి పొగాకులో 14 నుండి 16 ఆకులు, నాటు పొగాకులో 16 నుండి 18 ఆకులు వుంచి కొమ్మ త్రుంచవలెన్. కొమ్మ తుంచిన నాలుగైదు రోజులలో పిలకలు వచ్చుట ఆరంభమగును. అందువలన ప్రతి ఐదు, ఆరు రోజులకు ఒకసారి చేతితోగాని లేక రసాయనిక మందులతో గాని పిలకలను తీసివేయవలెను. పెండిమిథాలిన్ 1.5% లేదా డెకెనాల్ 7% లేదా రాయల్డన్ 4% లేదా నీమ్ ఆయిల్ ఎమల్షన్ 35% వాడి పిలకలు రాకుండా నివారించుకోవచ్చును.

నత్రజని అమ్మోనియం ఫాస్పేట్ రూపములోను భాస్వరమును, సింగిల్ సూపర్ ఫాస్పేట్, డై అమ్మోనియం ఫాస్పేటు రూపములోను మరియు పొటాషియంను సల్ఫేటు ఆఫ్ పొటాష్ రూపములో వేయాలి.

Also Read: Flue Curing in Tobacco: పొగాకులో ఫ్లూక్యూరింగ్ ఎలా చేస్తారు.!

Leave Your Comments

Insect Pests of Stored Grain: బియ్యం ముక్కు మరియు గింజ తొలుచు పురుగు లక్షణాలను ఇలా గుర్తించండి.!

Previous article

Identification of Animals: ఆవులను, గేదెలను గుర్తించు వివిధ పద్దతులు.!

Next article

You may also like