Cow Dung: ఆవుపేడని రైతులు ఎరువుగా వాడుతారు. గ్రామాల్లో ఆవుపేడ ఎక్కువ దొరుకుతుంది. ఈ ఆవుపేడ ఎరువుగానే కాకుండా పిడకలు చేసి వాటిని వంటకి లేదా వేరే పనులకి ఇంధనంగా వాడుతారు. వ్యాపారులు ఈ ఆవు పిడకలని అమెజాన్, ఫ్లిప్ కార్డు అమ్ముకొని మంచి లాభాలని చేసుకుంటున్నారు. ఆవుపేడతో అనేక రకాల వస్తువులను తయారు చేసి వ్యాపారాలు ఆదాయం పొందవచ్చు.ఆవుపేడతో తయారు చేసే వస్తువులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో వ్యాపారాలు ఆవుపేడతో తయారు చేసే పేపర్ ప్లాంట్ మొదలు పెట్టారు.
ఈ పేపర్ ప్లాంట్ ముడి సరుకుగా ఆవుపేడని గ్రామాల్లో నుంచి ఉత్పత్తి చేసుకుంటున్నారు. ఆవుపేడతో కాగితం, పెయింట్స్, రంగులు
తయారు చేస్తున్నారు. ఆవుపేడతో తయారు చేసే పెయింట్స్, రంగులు సహజసి ద్ధగా తయారు చేయడంతో మార్కెట్లో ఈ వస్తువులకి మంచి డిమాండ్ ఉంది. ఆవుపేడతో కాగితం తయారీని పద్ధతిని నేషనల్ హ్యాండ్‌మేడ్ పేపర్ ఇన్‌స్టిట్యూట్ మొదలు పెట్టారు. ఆవుపేడతో చేసే కాగితం నాణ్యతగా ఉంటుంది. ఈ కాగితంతో క్యారీ బ్యాగులు తయారీ మొదలైంది. ప్లాస్టిక్ బ్యాగ్‌లపై నిషేధం ఉండటంతో పేపర్ క్యారీ బ్యాగ్‌లకు డిమాండ్ పెరిగింది.
Also Read: Double Wheel Marker: మహిళ రైతులు సులువుగా ఉపయోగించడానికి డబల్ వీల్ మార్కర్ పరికరం

Cow Dung
ప్రభుత్వం నుంచి సబ్సిడీతో ఆవుపేడతో పేపర్ ప్లాంట్ మొదలు పెట్టవచ్చు.పేపర్ ప్లాంట్ మొదలు పెట్టడానికి 5-25 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. ఆవుపేడతో పేపర్ ప్లాంట్ పెట్టడానికి 15 లక్షల రూపాయలు ఖర్చవుతుంది, ఒక నెలలో ఒక లక్ష పేపర్ బాగ్స్ ఉత్పత్తి చేసుకోవచ్చు.
వ్యాపారులు పేపర్, డై బిజినెస్‌ను నిర్వహిస్తున్నారు. కాగితం తయారీలో 7 శాతం ఆవుపేడను ఉపయోగిస్తారు, మిగితా 93 శాతం రంగులు తయారు చేయడానికి వాడుతారు. ఒక ఆవుపేడ ముడిసరుకుగా వాడుకొని ఎన్నో వస్తువులని తయారు చేసి వ్యాపారాలు మంచి లాభాలను పొందుతున్నారు.
Also Read: Kubota A211N Tractor: వ్యవసాయంలో బుల్లి ట్రాక్టర్ చేసే వింతలు.!