మన వ్యవసాయంవ్యవసాయ వాణిజ్యం

Mahogany Farming: మహోగని చెట్ల పెంపకం ద్వారా కోట్లలో ఆదాయం

1
Mahogany Farming

సతత హరిత చెట్టుగా మహోగని
ఇది 200 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది.
కలప ధర ఎల్లప్పుడూ మార్కెట్లో డిమాండ్
హోగని చెట్లను పెంచడం ద్వారా కోటీశ్వరులు

Mahogany Farming: సాంప్రదాయ పంటల సాగులో నిరంతర నష్టాల కారణంగా ఇప్పుడు రైతులు కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు ఇందులో భాగంగా గత కొన్నేళ్లుగా రైతుల్లో చెట్ల పెంపకం ప్రక్రియ పెరిగింది.ప్రస్తుతం రైతులు టేకు, గంధం, మహోగని వంటి చెట్లను సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. మహోగని సతత హరిత చెట్టుగా పరిగణించబడుతుంది. ఇది 200 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కలప ఎరుపు మరియు గోధుమ రంగులో ఉంటుంది మరియు ఇది నీటి వలన పాడైపోదు. బలమైన గాలుల ప్రమాదం తక్కువగా ఉన్న ప్రదేశంలో దీన్ని నాటుకోవాలి.

Mahogany Farming

మహోగని చెట్ల ఉపయోగం:
మహోగని చెట్టు యొక్క చెక్క ధర ఎల్లప్పుడూ మార్కెట్‌లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే నీటి ద్వారా కూడా పాటుకావు. మన్నికైనందున, ఇది ఓడలు, నగలు, ఫర్నిచర్, ప్లైవుడ్, అలంకరణలు మరియు శిల్పాల తయారీలో ఉపయోగించబడుతుంది. ఈ చెట్టులోని ఔషధ గుణాల వల్ల దోమలు, కీటకాలు దగ్గరకు రావు. దీని ఆకులు మరియు గింజల నుండి నూనెను దోమల నివారణ మరియు క్రిమిసంహారకాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు దానితో పాటు సబ్బు, పెయింట్, వార్నిష్ మరియు అనేక రకాల మందుల తయారీలో ఉపయోగిస్తారు. దీని ఆకులు క్యాన్సర్, రక్తపోటు, ఉబ్బసం, జలుబు మరియు మధుమేహం వంటి అనేక వ్యాధులకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ చెట్టు యొక్క చెక్కను కాకుండా దాని ఆకులు మరియు విత్తనాలను ఉపయోగించడం ద్వారా రైతులు రెట్టింపు లాభాలు పొందవచ్చు.

Mahogany Farming

మహోగని వ్యవసాయం నుండి సంపాదిస్తున్నారు:
మహోగని చెట్లు 12 సంవత్సరాలలో కలప పంటలుగా పెరుగుతాయి. దీని తరువాత రైతు ఈ చెట్టును కోయవచ్చు. ఇతర చెట్ల కంటే దాని అధిక లక్షణాల కారణంగా నిపుణులు ఈ మొక్కను సాగు చేయాలని కూడా సిఫార్సు చేస్తున్నారు. ఇలాంటి చెట్టును పెంచడం ద్వారా రైతు కొన్నేళ్లలోనే కోటీశ్వరుడు అవుతాడు.

Leave Your Comments

Goat Farming: మేకల పెంపకం రైతులకు అందుబాటులో మొబైల్ యాప్స్

Previous article

May Crops: మే నెలలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే పంటలు

Next article

You may also like