Ajwain Cultivation: సుగంద ద్రవ్య పంటలలో వాము ఒక్కటి, ఇరు తెలుగు రాష్ట్రాలలో వాము సాగుచేయడానికి నేలలు అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుజిల్లాలో ఈపంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు. వాము పంట ఆక్టోబర్ లో సాగుచేయడానికి వీలు ఉంటుది..వాములో రకాల ఎంపిక మొదలు యాజమాన్యంలో మేళకువలు పాటించినట్లయితే ఆధిక దిగుబడులు పొందే ఆవకాశం ఉంటుది.. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన పంట వాము. వాము సాగులో సమస్యలు తక్కువగా ఉండటం వల్ల రైతులు దీనిసాగు వైపు దృష్టిసారిస్తున్నారు.
ఇరు తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాల్లో రైతులు వాము సాగు చేపడుతూ లాభాలు ఆర్జిస్తున్నారు. చల్లని వాతావరణం, మంచు ఈపంట పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. వర్షాధారం క్రింద సాగు చేయదలిస్తే నల్లరేగడి నేలలు అనుకూలం. నీటిపారుదల కింద సాగు చేయదలిస్తే తేలికపాటి నేలలు కూడా అనుకూలం. అధిక ఆమ్ల, క్షార నేలలు, నీరు నిలువ ఉండే నేలలు అనుకూలం కావు. వాము సాగు విధానాలు గురించి మనం ఈరోజు ఏరువాకలో తెలుసుకుందాం…

Ajwain Seeds
వాము పువ్వుల ద్వారా గింజలు
వాము భారతదేశ వంటకాలలో ఉపయోగించే ఒక విధమైన గింజలు. వాము మొక్క మొత్తం సువాసనతో ఉంటుంది. జీర్ణక్రీయకు కూడా వాము బాగా పనిచేస్తుంది.. వాముమొక్క పువ్వుల నుంచి విత్తనాలు సేకరించబడుతాయి. అంధ్ర, తెలంగాణాలలో కూడా ఈపంటను ఎక్కువగా పండిస్తారు. అంతేకాకుండా మధ్యప్రదేశ్, గుజరాత్ , మహారాష్ర్ట, ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో కూడా సాగుచేస్తారు. రబీ సీజన్ లో పండిస్తారు . కొన్ని ప్రాంతాలలో దీనిని ఖరీఫ్ పంటగా కూడా పండిస్తారు. మధ్యస్తంగా చల్లని మరియు పొడి వాతావరణం వల్లన మొక్కల పెరుగుదల మరియు పుష్పించడానికి అనుకూలంగా ఉంటుంది. వాము విస్తృత శ్రేణి నేలలకు బాగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఎండిపోయిన నేలల్లో బాగా పెరుగుతుంది, ఇసుక గంభీర నేలల్లో ఈపంట సాగు చేయడానికి అంతగా అనుకూలం ఉండదు.
Also Read: Neem Cake Powder: పంట భూమిలో వేపపిండి వేసుకోవటం వల్ల కలిగే లాభాలు.!

Ajwain Cultivation
వంటగదిలోనే వాముతో ఆరోగ్యం
వామును వంటకాలలో కాకుండా ఔషదంగా కూడా వాడతారు. ఆయుర్వేదంలో ఇది అనేక వ్యాధులను తగ్గించడానికి ఉపయోగిస్తారు.
–వాము చూర్ణాన్ని ఉప్పుని కలిపి గ్లాసు మజ్జిగతో కలిపి తీసుకుంటే ఆకలి మరియు అరుగుదల పెరుగుతుంది.
–వాము చూర్ణం, చిత్రమూలం వేరు చూర్ణం ఒక్కొక్కటి రెండేసి గ్రాముల చొప్పున ఒక గ్లాసు మజ్జిగతో కలిపి తీసుకుంటే ఆర్శ మొలలు తగ్గుతాయి.
–వామును, వస కొమ్మును సమానంగా తీసుకొని పొడిగా చేసి చిటికెడు రాత్రిపూట నోటిలో ఉంచుకుంటే దంత సమస్యలు తగ్గుతాయి.
–ఒక గుప్పెడు వామున్ని పొడిగా చేసి ఒక నూలు వస్త్రంలో ఉంచి పిల్లలు పడుకునే దిండు పక్కన పెడితే ఆవస్త్రం నుంచి వచ్చే ఘాటు వాసనికి పిల్లలలో ముక్కు దిబ్బడ ఉంటే త్వరగా తగ్గుతుంది.
–దగ్గు, కఫం, ఉబ్బసం, తలనొప్పి, కొండనాలుక వాపు కడుపునొప్పి వంటి వ్యాధులకు ఔషదంగా వాము ఉపయోగపడుతుంది.

Ajwain Benefits
వాముని మనము వివిధ వంటకాలలో వాడుతాము, చక్రాలు, బిస్కట్స్ మరియు మనము రోజు తినే బజ్జిల తయారీలో కూడా వాముని ఉపయోగిస్తారు. వాము అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. కాబట్టి వాము సాగుతో మనకు అనేక లాభాలున్నాయి. సరైన యాజమాన్య పద్దతులు పాటించటం ద్వారా వాము సాగులో అధిక దిగుబడితోపాటు అదాయం పొందవచ్చు.
Also Read: Tomato Farmer Murder: రైతుల ప్రాణాలకి ముప్పుగా మారిన టమాట ధర.!