Oilseeds And Legumes: 2021-22 రబీ సీజన్‌లో నూనెగింజలు మరియు పప్పుధాన్యాల పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నూనెగింజల పంటల సాగు ఈ ఏడాది 23.78 లక్షల హెక్టార్లు పెరగగా, పప్పు దినుసుల సాగు విస్తీర్ణం 18.21 లక్షల హెక్టార్లు పెరిగింది. ఇది శుభసూచకమని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. దీంతో ఎడిబుల్ ఆయిల్స్, పప్పుల దిగుమతుల ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం సాధారణంగా రబీ సీజన్‌లో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం 146.14 లక్షల హెక్టార్లు. ప్రస్తుత రబీ సీజన్‌లో (2021-22) జనవరి 21 వరకు దీని విస్తీర్ణం 164.35 లక్షల హెక్టార్లకు పెరిగింది. అదేవిధంగా నూనెగింజల పంటల సాగు విస్తీర్ణం సాధారణంగా 77.38 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పుడు రికార్డు స్థాయిలో 101.16 లక్షల హెక్టార్లకు పెరిగింది.
Also Read: పప్పుధాన్యాల సాగు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు
నూనెగింజల పంటల్లో ఆవాల విస్తీర్ణం ఎక్కువగా పెరిగిందని వ్యవసాయ నిపుణుడు బినోద్ ఆనంద్ చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం మంచి ధర. 2021 సంవత్సరంలో కనీస మద్దతు ధరతో పోల్చితే మార్కెట్‌లో ఆవాల ధర దాదాపు రెట్టింపు అయింది. అందుకే గతేడాదితో పోలిస్తే ఈసారి ఆవాల సాగు విస్తీర్ణం 73 లక్షల హెక్టార్ల నుంచి 91 లక్షల హెక్టార్లకు పెరిగింది. రాజస్థాన్, ఎంపీ, యూపీ మరియు హర్యానాలో దీని విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
పంటకు మంచి ధర లభిస్తే రైతులు ఆటోమేటిక్‌గా ఆ పంటవైపు ఆకర్షితులవుతారు అనేది ఒక్కటి మాత్రం స్పష్టం. కానీ గిట్టుబాటు ధర లేకుంటే ప్రభుత్వం ఏం చేసినా ఎలాంటి ప్రచారం చేసినా రైతులకు మేలు జరగదని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎడిబుల్ ఆయిల్స్ వినియోగ డిమాండ్ దాదాపు 250 లక్షల టన్నులు కాగా, ఉత్పత్తి 111.6 లక్షల టన్నులు మాత్రమే. అంటే వంటనూనెల డిమాండ్ సరఫరాలో దాదాపు 56 శాతం తేడా ఉంది.
గత ఐదారేళ్లలో భారత్ పప్పుధాన్యాల ఉత్పత్తిని 140 లక్షల టన్నుల నుంచి 240 లక్షల టన్నులకు పెంచిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2019-20 సంవత్సరంలో భారతదేశం 23.15 మిలియన్ టన్నుల పప్పులను ఉత్పత్తి చేసింది. ఇది ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో 23.62 శాతం. ఇదిలావుండగా భారత్ విదేశాల నుంచి పప్పులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. 2050 నాటికి దాదాపు 320 లక్షల టన్నుల పప్పుధాన్యాలు అవసరమవుతాయని అంచనా. 2020-21 సంవత్సరంలో కూడా నవంబర్ వరకు రూ.7148.4 కోట్ల విలువైన పప్పులను దిగుమతి చేసుకున్నాం. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం పప్పుధాన్యాల తలసరి లభ్యత 1951లో రోజుకు 60.7 గ్రాములుగా ఉంది. ఇది 2020 నాటికి కేవలం 47.9 గ్రాములకు తగ్గింది.
Also Read: అపరాల సాగు