Turmeric Cultivation: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే పంటలలో పసుపు పంట కూడా ఒకటి. పైగా భారతీయ మార్కెట్లో పసుపుకు భారీగా డిమాండ్ ఉంది. వ్యవసాయంలో ఉద్యాన మరియు వాణిజ్య పంటల సాగులో పసుపు పంట ముఖ్యమైనది. మన రాష్ట్రంలో పండించే పసుపు అంతర్జాతీయంగా అధిక నాణ్యత మరియు అనువైన పంట గా చెప్పుకోవచ్చు. శుభకార్యాలలో ఏమి ఉన్న లేకున్నా పసుపు మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే. ఇక ఆహార విషయానికి వస్తే, పసుపు వేసి చేసే వంటకాలే ఎక్కువ. ఇంత డిమాండ్ ఉన్న పసుపులో అధిక దిగుబడి సాధిస్తే, ఆదాయం లక్షల్లో ఉంటుంది.
రైతులు వాణిజ్య పంటగా పిలవబడే పసుపులో అధిక దిగుబడులతో పాటు మార్కెట్లో మంచి ధర పొందడానికి, నాణ్యమైన పసుపును పండించడానికి మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రైతులు పసుపు పంటను మే చివరి వారం నుండి జూన్ మాసం వరకు విత్తుకుంటారు. వివిధ ప్రాంతాలను గమనించినట్లయితే పసుపు పంట శాఖీయ దశలో ఉంది
స్వల్పకాలిక రకాలు: సుగుణ, సుదర్శన, ప్రగతి, ప్రతిభ, రాజేంద్ర సోనియా, రాజేంద్ర సోనాలి ఈరకాలు సుమారు 7 నెలల్లో తవ్వకానికి వస్తాయి ఇవి కొంత వరకు దుంప కుళ్ళు అలాగే ఆకుమచ్చ తెగుళ్ళను తట్టుకుంటాయి
మధ్యకాలిక రకాలు: బి.ఎస్.ఆర్. 2 రోమా. సురోమా ఈరకాలు సుమారు 8 నెలల్లో తవ్వకానికి వస్తాయి
దీర్ఘకాలిక రకాలు : దుగ్గిరాల ఎరుపు, ఆర్మూర్, సేలం ఈరకాలు తొమ్మిది నెలల్లో పూతకు వచ్చి అధిక దిగుబడిని ఇస్తాయి. ముఖ్యంగా అధిక విస్తీర్ణంలో ఈరకాలను ఎక్కువగా సాగు చేయబడతాయి
Also Read: Green Manure Cultivation: పచ్చి రొట్టె పైర్లుతో రైతులకు లాభాలు
రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు పంట ముప్పు గురికావడం గమనిస్తున్నాం. నీరు నిలిచి ఉన్నట్లుయితే పంట ఏమాత్రం తట్టుకోలేదు. అలాగే దుంప కుళ్ళు, దుంప పుచ్చు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. పసుపులో రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా విరివిగా వాడాలి. రసాయన ఎరువులను మొక్కకి నాలుగు నుంచి ఐదు దఫాలుగా వేసుకున్నట్లయితే మొక్క గ్రహించి మంచి ఎదుగుదలను సాధిస్తోంది. అధిక వర్షాల కారణంగా పొలాల్లో నీళ్లు నిలబడి ఉంటే కాలువలు ద్వారా వర్షపు నీటిని తీసివేయాలి. పసుపులో పోషక లోపాలు ఉన్నట్లయితే ఆకుల అంచులు మాడిపోతాయి ముదురు ఆకులు పైకి లేదా కిందకు తిరిగి ఉంటాయి. దుంపలు ఎదుగుదల తగ్గిపోతుంది. పండిన కొమ్మలపైన ముడతలు ఏర్పడతాయి.13- 0 – 45 10 గ్రాముల లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఆకులపై పిచికారి చేయాలి. మురుగునీరు పోయేలాగా కాలువలు తీసుకోవాలి.
పసుపు ఇది దుంపజాతి మొక్క. పచ్చ బంగారంగా పిలువబడే పసుపు పంటను కొద్ది మంది రైతులే సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈపంట ఎక్కువగా సాగవుతుంది. పసుపు పండించే రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులతో పాటు, అధిక లాభాలను గడించవచ్చు. పంట వేసే ముందు రైతులు దీని సాగుపై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి.
Also Read: Grow bag Cultivation: సాగులో సరికొత్త విప్లవం బ్యాగ్ సేద్యం.!