Spice Seeds: రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. సుగంధ పంటలు పండించే రైతుల కోసం నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ప్రత్యేక సదుపాయాన్ని ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కొత్తిమీర, జీలకర్ర, మెంతులు, అజ్వైన్, కలోంజి మరియు ఇతర విత్తనాలను తమ ఇళ్ల నుండి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఇందుకోసం రీసెర్చ్ సెంటర్ ఇటీవల ప్రారంభించిన ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రైతులు ఈ విత్తనాల కోసం ఆర్డర్ చేసుకోవచ్చు.
సుగంధ ద్రవ్యాల పంటలను సాగు చేసే రైతుల ముందున్న అతిపెద్ద సవాలు ఏమిటంటే, ఈ విత్తనాలు మార్కెట్లో సులభంగా లభిస్తున్నప్పటికీ, క్యూలో గంటల తరబడి వేచి ఉండవలసి ఉంటుంది. విత్తనాలను సేకరించేందుకు రైతులు శ్రమించాల్సి ఉన్నా చివరికి నాసిరకం విత్తనాలే అందుతున్నాయి.
Also Read: చిన్నదోస ఎగుమతిలో భారత్ అగ్రస్థానం
కాగా.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉన్న నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ సీడ్ స్పైసెస్ మసాలా దినుసుల విత్తనాల కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. అలాగే ఈ పోర్టల్ ఎస్బిఐ సంబంధిత యోనో కృషి యాప్ కి కూడా అనుసంధానించబడింది, అక్కడ నుండి రైతులు విత్తనాలను కూడా ఆర్డర్ చేయవచ్చు.
చాలా మంది రైతులకు SBIలో బ్యాంకు ఖాతా ఉండటంతో వారు సులభంగా ఆర్డర్ చేయవచ్చు. నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సీడ్ స్పైసెస్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాల రైతులకు నాణ్యమైన మసాలా విత్తనాలు కొనుగోలు చేయడం సులువుగా మారింది. ఇది కాకుండా NRCSS పోర్టల్‌ను హిందీ మరియు ఇంగ్లీషుతో పాటు మరో 10 భాషలలో కేంద్రం అందుబాటులో ఉంచుతోంది.
Also Read: పిజెటీఎస్ఏ అగ్రిబయోటెక్ ఫౌండేషన్ ల మధ్య ఒప్పందం