Bee Keeping: ఈ మధ్య ఉద్యోగాలు చేస్తూ వ్యాపారం చేయాలి అన్ని అందరూ అనుకుంటున్నారు. రైతులు కూడా ఎక్కువగా వ్యవసాయం చేస్తూ వ్యాపారం చేయాలి అన్ని అనుకుంటున్నారు. వ్యవసాయం చేస్తూ, వ్యవసాయ పంటలకి మేలు కలిగిస్తూ , తక్కువ ఖర్చుతో లాభాలు తెచ్చేది తేనెటీగల పెంపకం. తేనెటీగల పెంపకంతో నెలకి 70 వేల నుంచి లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు. మన పొలం దగ్గరే బిజినెస్ చేయవచ్చు.
తేనె ఔషధాలు , ఆహార ఉత్పత్తులు ఇలా చాలా వాటిలో వాడుతారు. మార్కెట్లో నాణ్యమైన తేనె దొరకడం చాలా కష్టం. నాణ్యమైన తేనెకి మంచి డిమాండ్ ఉంది. తేనెటీగలను పెంచడం వల్ల వ్యవసాయం, పులా తోటలకి ఉత్పత్తి పెరుగుతుంది. తేనెటీగలు పుప్పొడి తీసుకొని వెళ్లడం ద్వారా పరపరాగ జరుగుతుంది. పరపరాగ జరగడం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది. దీని కారణంగా రైతులు వ్యవసాయంతో పాటు తేనెటీగల పెంపకం చేస్తున్నారు. తేనెటీగల పెంపకం ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తుంది.
Also Read: Ridge Gourd Cultivation: బీరకాయ పంటతో రైతులకి ఒక నెలలో లక్ష రూపాయల ఆదాయం.!
తేనెటీగల పెంపకాన్ని ‘బీ కీపింగ్’ అన్ని కూడా అంటారు. తేనెటీగల పెంపకం చేసే వాళ్ళకి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. రైతు సంక్షేమశాఖ పథకాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఈ పథక ద్వారా తేనెటీగల పెంపకం అభివృద్ధి చేసి పంట ఉత్పాదకతను పెంచడం, తేనెటీగలని ఎలా పెంచాలి అన్ని శిక్షణ ఇస్తున్నారు. నాబార్డ్‌తో కలిసి నేషనల్ బీ బోర్డ్ భారతదేశంలో తేనెటీగల పెంపకానికి పథకలు, ఆర్థికంగా రైతులకి తోడు ఉంటుంది. ప్రభుత్వం తేనెటీగల వ్యాపారులకి 80-85 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.
తేనెటీగలని పెట్టెలో పెంచుతారు. ఒక పెట్టెలో 40 కిలోల తేనె వస్తుంది. ఒక కిలోకి 350 రూపాయలుగా మార్కెట్లో అమ్ముతున్నారు. ఒక పెట్టె 3500 రూపాయలు. 10 పెట్టెలతో ఈ వ్యాపారం మొదలు పెడితే అన్ని ఖర్చులు తీసివేసాక కనీసం లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది. తేనెటీగల నుంచి తేనె తీసాక మిగిలిన వ్యర్థంతో మైనం, బీస్వాక్స్, రాయల్ జెల్లీ, పుప్పొడి, బీ గమ్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ పదార్థాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తేనెను, తేనె ఉత్పతులతో నెలకి 70వేల నుంచి లక్షల వారికి ఆదాయం చేసుకోవచ్చు. ఈ మధ్య వ్యాపారాలు తేనెను ఆన్లైన్ ద్వారా అమ్ముతూ మంచి లాభాలు తీసుకుంటున్నారు.
Also Read: Safflower Cultivation: సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకి బై బై.. వ్వవసాయానికి వెల్కమ్.!