How to Start a Dairy Farm – ప్రాజెక్ట్ రిపోర్ట్: డెయిరీ ఫారం ఖర్చుతో కూడుకున్నది. ఇది ఒక వ్యాపారం లాంటిదే. అందుకే అన్ని విషయాలు పరిశీలించి అడుగుపెట్టాలి. తగు సమయంలో తీసుకోవాలి. అవసరమైన ప్రణాళికలను తయారు చేసుకోవాలి. రుణసదుపాయం కోసం ప్రాజెక్ట్ రిపోర్ట్ అవసరం.దీనిని నాబార్డు , బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థల గైడ్ లైన్స్ ప్రకారం తయారు చేయాలి.
స్థలం ఎంపిక: డెయిరీ ఫారం నేలకొల్పే స్థలం ఎధైన నగరానికో, పట్టణానికో దగ్గరలో ఉంటే అవసర సదుపాయలు లభిస్తాయి. పాల అమ్మకానికి కూడా వీలవుతుంది. ఫారానికి దగ్గరలో రోడ్డు సదుపాయం ఉండాలి. ఇది రవాణాకు పనికొస్తుంది. అలాగే కరెంటు, తాగు నీటి లభ్యత ఉండాలి. దగ్గరలో పశువైద్యశాల ఉంటే మంచిది. పెద్ద ఫారమైతే పశువైద్యనికి నియమించవచ్చు. లేదా వారానికికొకసారి వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. పశువుల మేతకు సరిపడా గడ్డి పండించడానికి పొలముండాలి. ఇది స్వంతంగా గాని, లీజు ధైన కావచ్చు.
పశువుల కొనుగోలు: పడి పశువుల్ని కొని తెచ్చేటప్పుడు సంతల్లో కంటే నేరుగా రైతుల వద్ద కొనుగోలు చేయడం మేలు.రెండోవ లేదా మూడోవా ఈతలో ఈనినా వెంటనే కొనడం మంచిది. జాతి, శారీరక లక్షణాలు, వ్యాధులు మొదలగునవి పశువైద్య సహాయంతో పరిశీలించి కొనాలి. రవాణా చేసేటప్పుడు పశువైద్య సహాయకుని తోడుంటే మంచిది. అలాగే రవాణాకు అవసరమైన పత్రాన్ని వెంట ఉంచుకోవాలి. వీలైనంతవరకు రాత్రి పూట రవాణా చేయాలి.
ఆవులు, గేదెలు: డెయిరీ ఫారాల్లో ఆవులు, గాని గేదెలు గాని రెండు గాని ఉంటాయి. ఏ పాలకు గిరాకీ ఉందో, ఆయా ప్రాంతాలకు ఏవి అనువైనవో తెలుసుకోవాలి. ఏ వ్యాపారానికి అయినా మార్కెటింగ్ ముఖ్యం.
గృహవసతి: పడి పశువులకు సరైన గృహ వసతి ఏర్పాటు చేయాలి. అప్పుడే అవి ఆరోగ్యంగా ఉండి పాలు బాగా ఇస్తాయి. మాములుగా ప్రతి పశువుకు 40 చ. అ. షెడ్ స్థలం,80 చ. అ యార్డు స్థలం అవసరం. పశువుల సంఖ్య 20 ఉంటే,300 చ. అ,100 ఉంటే 15000 చ. అ. స్థలం ఉండాలి. నేల స్లాప్ సరిగా ఉండాలి. పశువులకు పరిశుభ్రమైన తాగు నీరు ఎల్లప్పుడు అందేలా చూడాలి. గృహ వసతి ఎండ నుంచి , వర్షాకాలం నుంచి, శీతకాలం చాలి నుండి రక్షణ నీచ్చేల ఉండాలి.
Also Read: Irrigation Applications: నీటి పారుదల వసతులు కల్పించడం లో గల ఇబ్బందులను తెలుసుకోండి
పశు గ్రాసం, దాణా : ఫారల్లో ఖర్చు భూమి మీద , గృహ వసతి మీద, పశువుల మీద, పరికరాలు, యంత్రాల మీద దాణా దినుసులు మీద ఎక్కువగా ఉంటుంది.అలాగే పశు గ్రాసం పండించడానికి భూమి అవసరం. వీలైనంత వరకు దాణా తగ్గించి పశుగ్రాస మేపడం లాభదాయకం. పశు గ్రాసాన్ని చాఫ్ కట్టర్ తో ముక్కలుగా కత్తిరించి మేపితే మేత వృధా కాదు. ఎక్కువగా ఉన్న పశుగ్రాసాన్ని సైలేజీ లేదా నిలువ చేసుకొని తక్కువ మేత లభించే వేసవి కాలంలో మెపవచ్చు.దాణా పదార్ధాలైన జొన్న, మొక్కజొన్న, ఫారంలోనే పండించే తవుడు, నూనె చెక్క, మినరల్ మిక్చర్ కొని దాణా తయారు చేయవచ్చు. గింజలు తీయగా మిగిలిన చొప్పను ఎండు మేతగా వినియోగించవచ్చు. వాటికి సరిపడా మేత, నీటి వసతులను ఏర్పాటు చేయాలి.
లాభనష్టాలు: మోలీక సదుపాయలు ఖర్చుతో కూడుకున్నవి. వీటిపై ఖర్చు ఎంత ఆదా చేసుకుంటే అంత మంచిది. పడి పరిశ్రమల్లో మేత ఖర్చు మూడింట ఉంటుంది. ఈ ఖర్చును ఎక్కువగా పచ్చి మేత , కాయ రకం పశుగ్రాసాలతో, సైలేజి లేదా ఎండు గడ్డి తో , చాఫ్ చేసిన గడ్డి మేపడంతో తగించవచ్చును. దాణా ఖరీదు తో కూడుకున్నది. దీన్ని ఎంత తగ్గిస్తే అంత మేలు. వీలైనంత వరకు అవసరమైన పచ్చి మేత, ఎండు మేత, దాణా ఫారంలోనే ఉత్పత్తి మంచిది. బయట కొంటె ఖర్చు ఎక్కువ అవుతుంది. పశువుల్లో వట్టి పోయి ఉండే కాలం 2 నేలలు దాటారాదు. డైయిరీ ఫారంలో లాభ నష్టాలు యాజమాన్యం పై ఆధారపడతాయి. యజమాని కానీ, మేనేజర్ కానీ వీలైనంత ఎక్కువ సమయం ఫారానికి కేటాయించాలి.
Also Read: Pest Control Techniques In Groundnut Crop: వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు మరియు వేరు పురుగు నివారణ