Floriculture: పూవులు ఎక్కువగా పండగ రోజులో, శుభకార్యంల్లో అలంకరణకు వాడుతారు. వాణిజ్య పంటలు పండిస్తూ రైతులు మంచి లాభాలని పొందుతున్నారు. వరి , గోధుమల పంటలు బదులుగా వాణిజ్య పంటలని ఎంచుకొని వ్యవసాయం లాభకరం అని రైతులు నిరూపించారు. ప్రస్తుతం పువ్వుల సాగులో రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. చాలా రకాల పువ్వులతో సుగంధ ద్రవ్యాలు, అగరుబత్తీలు, గులాల్ , నూనె తయారు చేసి వ్యాపారులు కూడా మంచి లాభాలు పొందుతున్నారు.
మన దేశంలో రైతులు వరి, గోధుమ లాంటి సాంప్రదాయ పంటలను పండించడం ద్వారా మాత్రమే మంచి ఆదాయాన్ని పొందవచ్చు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు వరి, గోధుమ పంటలతో మాత్రమే కాకుండా పూల పెంపకంతో కూడా మంచి లాభాలు పొందుతున్నారు. నిజానికి పువ్వుల పెంపకంలో రైతులకి రోజు వారీగా ఆదాయం వస్తుంది.
Also Read: Plant Nutrition: మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే పోషక పదార్థాలు ఎన్ని ఉన్నాయి?
పువ్వుల సాగు ద్వారా ఎరువులు, నీటిపారుదల ఖర్చు కూడా తగ్గుతుంది. వరి, గోధుమ పంటలకి ఎరువులు, నీటిపారుదల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సంప్రదాయ పంటలకి చీడ పీడల దాడి ఎక్కువ ఉంటుంది. పువ్వుల పంటలకి చీడ పీడల దాడి తక్కువగా ఉంటుంది. దాని వల్ల రైతులు పురుగుల మందులు వాడడం కూడా తగ్గుతుంది. దాని వల్ల రైతులకి చాలా వరకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి.
ప్రస్తుతం మన దేశం వ్యాప్తంగా రైతులు పువ్వుల ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు. అంతే కాకుండా మార్కెట్లో పువ్వులకి మంచి డిమాండ్ ఉంది. వ్యాపారులు కూడా రైతులతో కాంట్రాక్ట్ పద్దతిలో పువ్వులను సాగు చూపిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. రైతు సోదరులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం లభించే పువ్వుల సాగు ఎంపిక చేసుకోవచ్చు.
Also Read: Irrigation System: నీటి పారుదల పద్దతులతో నీటిని ఎలా ఆదా చేసుకోవచ్చు.!