Cashew Feni: మద్యం ప్రియుల కోసం కొత్త రకం మద్యం వేచి ఉంది. ఇది సాదా సీదా మద్యం కాదండోయ్!! అత్యంత ఖరీదయిన జీడిమామిడి పండుతో మాత్రమే తయారు చేస్తారు. ఈ మద్యం తయారీ కేవలం గోవాలో మాత్రమే జరుగుతుంది. దీనికి గాను 2006లో గోవా రాష్ట్రానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది. దీనిని తాగాలంటే ఖచ్చితంగా గోవా వెళ్లి తీరాల్సిందే. ఫెనిని జీడిపప్పు నుండి రసం తీసి పులియబెట్టిన తరువాత డిస్టిలేషన్ పద్దతిలో తీసే సాంప్రదాయ మద్యం. దీనిని చాలా సహజ సిద్ధంగా ఎలాంటి కృత్రిమ ఫ్లేవర్స్ కలపకుండా తయారు చేస్తారు. దీనిలో సేంద్రీయ లేదా కృత్రిమ రుచులు ఉండవు కాబట్టి త్రాగడానికి సురక్షితం. “ఫెని” అనే పేరు సంస్కృత పదం ఫెనా నుండి సంగ్రహిచబడినది,ఫెనా అంటే నురుగు అనే అర్థం వస్తుంది.
దీనికి కారణం, ఫెనిని ఒక సీసాలో కదిలించిన లేదా గాజులో పోసినప్పుడు నురుగువస్తుంది. ఫెని గత 400 సంవత్సరాల నుండి గోవా ఆహార సంప్రదాయంలో అంతర్భాగం. ఇతర మద్యంలా ఇది హ్యాంగోవర్ ఇవ్వదు. దీనికి 2009లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) , 2016లో గోవా ప్రభుత్వం దీన్ని హెరిటేజ్ డ్రింక్‌గా ప్రకటించింది.
Also Read: Gerbera Cultivation: గెర్బెరా సాగు తో నెలకు రూ. 1.5 లక్షలు సంపాదిస్తున్న ఇంజనీర్
ఇది తెలుగు రాష్ట్రాలలో సారాయి తయారు చేసే పద్దతిలోనే తయారు చేస్తారు. కానీ సారాయి చేసే చెడుని మన ఆరోగ్యానికి ఫణి చేయదు. ప్రస్తుతం ఫెనిని చాలా తక్కువ కుటుంబాలు మాత్రమే తయారు చేస్తున్నాయి. వ్యాపారం లాభసాటిగా లేకపోవడం ఇది తయారు చేసే కుటుంబాలకు కళంకంగా మారింది.
ఫెనిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇది దంతాల సమస్యలు, చిగుళ్ల సమస్యలు, వాపు మరియు కొన్ని రకాల నోటి అల్సర్లను నివారించడంలో కూడా ఉపయోగపడుతుంది. వంటల వాడిన కొవ్వు తగ్గడంలో కూడా సహాయపడుతుందని కొందరు నమ్ముతారు.ఫెనీ దగ్గు మరియు జలుబును చికిత్సలో సంప్రదాయ మూలికలతో వాడుతారు. ఇది చలి కాలంలో శరీరాన్ని వేడి చేస్తుంది మరియు శ్వాసకోశ వ్యవస్థను శుభ్రపరుచి శ్వాస సంబంధ రోగాలు రాకుండా కాపాడుతుంది.
మలబద్ధకం, ఇతర కడుపు సంబంధిత రుగ్మతల చికిత్సలో కూడా సహాయపడుతుంది.ఫెనిలో క్రిమిసంహారక గుణాలు ఉంటాయి, ఇది శరీరం పైన గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరాన్ని శుభ్రపరచడంలో, సరైన ప్రేగు కదలికను ప్రేరేపించడం వలన మల విసర్జన సమయంలో పేగుకి ఎలాంటి హాని కలగకుండా సహాయపడుతుంది.
హెచ్చరిక:ఫెనిని నిపుణుల పర్యవేక్షణలో, మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే శరీరానికి ఔషధంగా పనిచేస్తుంది.
Also Read: Sunhemp Nutrient Management: జనుప సాగు లో పోషక యాజమాన్యం