Mushrooms Cultivation: ప్రస్తుత కాలంలో చాలా మంది యువతీ యువకులు ప్రైవేటు ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇంటి దగ్గరే స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా తక్కువ పెట్టుబడి తో అధిక ఆదాయాన్ని ఇచ్చే మార్గాలను ఎంచుకుంటున్నారు. అలాంటి వ్యాపారంలో పుట్టుగొడుగుల పెంపకం ఒకటి. దీనిని ఉపాధి గా మార్చుకున్నారు కొందరు. మనం తినే పుట్టగొడుగులు అనేవి కొన్ని శిలీంధ్రాల ద్వారా ఉత్పత్తి చేయబడే పునరుత్పత్తి నిర్మాణాలు. పుట్టగొడుగులు పెంచడం అనేది మొక్కలు కంటే చాలా భిన్నంగా ఉంటుంది.. పుట్టగొడుగులు ప్రతిక్షేపణ నుండి పోషకాలను తీసుకుంటాయి. ఇంట్లో పుట్ట గొడుగులను పెంచడం సాధారణంగా అందరికీ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని వల్లన మనకు ఊహించదగిన ఫలితాలను అందిస్తుంది. అసలు ఇంట్లో పుట్టగొడుగులు ఎలా పెంచుతారు అనే సందేహం మన అందరిలో ఉంటుంది. ఈ పెంపకాన్ని చేపట్టి స్వయం ఉపాధి పొందుతున్నారు
మహిళలు కుటీర పరిశ్రమగా చేసుకుని
పుట్టగొడుగులను శాఖాహారులు అమితంగా ఇష్టపడుతున్నారు. మాంసాహారంలో ఎన్ని పోషక విలువలు ఉంటాయో అంతకంటే అదనంగా ఈ పుట్టగొడుగుల్లో పోషకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చూపుతున్నారు. పుట్టగొడుగుల లో ఉండే అమైనో ఆమ్లాలు మానవ ఎదుగుదలకు చాలా కీలకమైనవి. అన్ని వయసుల వారు ఎలాంటి పరిమితులు లేకుండా పుట్టగొడుగులను తినవచ్చు. పుట్టగొడుగులు, వాటి పోషణ కోసం, పూర్తిగా సేంద్రియ పదార్థాలపై ఆధారపడతాయి. అందుకే ఎక్కువ మంది దీనిని ఆదాయ వనరుగా ఎంచుకుంటున్నారు. పుట్టగొడుగుల పెంపకం ప్రస్తుతం లాభదాయకంగా ఉండటంతో మహిళలు కుటీర పరిశ్రమగా చేసుకుని ఆర్థిక అభివృద్ధి చెందుతున్నారు.
పుట్టగొడుగులు ఎలా పెరుగుతాయి?
పుట్టగొడుగులు బీజాంశం నుండి పెరుగుతాయి మరియు తేమతో కూడిన పరిస్థితులను ఇష్టపడతాయి. ఇంట్లో పుట్టగొడుగులను పండించడానికి సులభమైన మార్గాలలో ఉన్నాయి. బీజాంశం పుట్టగొడుగుల విత్తనాలు ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. మన కంటికి కూడా కనిపించవు. ఇది నేలలో పెరగదు. వాటి ఎదుగుదలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మనం ఇంట్లో పుట్టగొడుగులను పెంచుతున్నప్పుడు, మనం సులభంగా వరి గడ్డిని సబ్‌స్ట్రేట్‌గా ఉపయోగించవచ్చు. దీని తరువాత స్పాన్ పెరుగుతుంది ఈ థ్రెడ్ లాంటి నిర్మాణం పుట్టగొడుగులుగా పెరుగుతుంది. స్పాన్ అనేది మనం కొనుక్కుంటే సులభంగా చేసుకోవడానికి ప్రేరణగా ఉంటుంది..
Also Read: Yarsagumba Mushroom: ఈ రకం పుట్టగొడుగులు కిలో 20 లక్షలు.!
ప్లాస్టిక్ బకెట్‌లో పుట్టగొడుగుల పెంపకం
ఇంట్లో ప్లాస్టిక్ బకెట్‌లో పుట్టగొడుగుల పెంపకం ఇలా చేసుకోవాలంటే బకెట్‌లోని 2-5 గ్యాలన్‌లను ఎంచుకుని రంధ్రాలును పెట్టుకోవాలి. తద్వారా అందులో పుట్టగొడుగులు పెరుగుతాయి రంధ్రం సహాయంతో బయటకు వస్తాయి. పరాన్న జీవుల నుండి రక్షించడానికి క్రిమిసంహారక మందులను చల్లాలి. ఇంట్లో పుట్టగొడుగులు పెంచుకునే వాళ్లు ఓస్టెర్ మష్రూమ్‌కు ప్రాధాన్యత ఇస్తే రెండు వారాల్లో ఈ రకం కోతకు సిద్ధంగా ఉంటుంది. బకెట్ లోపల వరి గడ్డి మరియు స్పాన్ పుట్టగొడుగుల గింజలు వేయడం మరియు తడి లేకుండా తేమ వచ్చే వరకు నీటిని పోయడం ద్వారా సబ్‌స్ట్రేట్‌ను తేమ చేస్తుంది. ఇప్పుడు బకెట్‌ను సూర్యరశ్మి లేని తేమతో కూడిన ప్రదేశంలో ఉంచాలి.. 2-3 వారాల్లో, సుమారు 14-15 రోజులలో పుట్టగొడుగులను కోయవచ్చు. ఇంట్లో పుట్టగొడుగులను పెంచడానికి ఇది సులభమైన మార్గాలలో ఒకటి. పుట్టగొడుగులను పండించడం చాలా మంది ప్రజలు అనుకున్న దానికంటే సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇండోర్ సాగులో పెరుగుతుంది. కాంతి కూడా అవసరం లేదు.
కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు శిక్షణ
ఇరు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు ఇంట్లో పుట్టగొడుగుల పెంపకం గురించి ఉచిత శిక్షణ ఇస్తుంది. పుట్టగొడుగుల పెంపకం కోసం మదర్ స్పాన్ కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. అవకాశాన్ని అందరూ ఉపయోగించవచ్చు. ముఖ్యంగా నిర్యోదుగులకు, యువకులకు, ఇంట్లో ఉండే మహిళలు శిక్షణ పొంది పుట్టగొడుగుల సాగును ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు..
Also Read: Natural Cultivation: సహజ సాగులో 1.30 ఎకరాల్లో వైవిధ్య పంటలు.!