వ్యవసాయ వాణిజ్యం

Micro Greens: ఇంటిలో పండించుకునే పంటలతో లక్షలు సంపాదించడం ఎలా ?

2
Micro Greens Farming
Micro Greens Farming

Micro Greens: కరోనా తర్వాత చాలా మంది కార్పొరేట్ జాబ్స్ మానేసి ఇంటి దగ్గరే ఉండి వ్యవసాయం మొదలు పెట్టారు. కార్పొరేట్ జాబ్స్ కంటే వ్యవసాయంలో లక్షలు సంపాదిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తూ, ఆధునిక పద్ధతులు వాడుకుంటూ వ్యవసాయంలో అనేక కొత్త విధానాలను మొదలు పెట్టారు. వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారికి ఒక అద్భుతమైన ఐడియా, మార్కెట్‌లో డిమాండ్ బాగా ఉన్న మైక్రో గ్రీన్స్ పంటను మీ ఇంట్లోనే సాగు చేసుకోవచ్చు.

మైక్రో గ్రీన్స్ అంటే గింజలు మొలకెతిన తర్వాత వచ్చే చిన్న మొలకలు.ఈ మైక్రో గ్రీన్స్‌కు రెండు ఆకులు, ఒక చిన్న కాండం ఉంటుంది. మైక్రో గ్రీన్స్ రెండు ఆకులు ఉన్నప్పుడే చిన్న మొలకలను కోయాలి. మైక్రో గ్రీన్స్ సాగులో ముల్లంగి, ఆవాలు, పెసర్లు, మెంతులు, శనగాలు, గోధుమలు, మొక్కజొన్న గింజలు వాడుతారు. ఈ చిన్న మొలకలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. మొలకెత్తిన గింజలను తినడంలో కంటే ఈ మైక్రో గ్రీన్స్ తిన్నడం వల్ల ఎక్కువ పోషకాలు మన శరీరానికి అందుతాయి. మొలకెత్తిన గింజలు కొన్ని రోజులో చిన్న మొక్కగా మరి ఆకులు వస్తాయి, వీటినే మైక్రో గ్రీన్స్ అంటారు. మైక్రో గ్రీన్స్‌కు డిమాండ్ అధికంగా పెరగడంతో మార్కెట్లో రేటు బాగా లభించడంతో మైక్రో గ్రీన్స్ వ్యాపారులకి మంచి ఆదాయం వస్తుంది.

Micro Greens

Micro Greens

మైక్రోగ్రీన్స్ పంటను సులభంగా పండించవచ్చు, పెట్టుబడి కూడా చాలా తక్కువ. ఇంటిలో సాగు చేసుకునే వాళ్ళు కుండీ లేదా లోతైన పాత్రలో మైక్రోగ్రీన్లను పండించవచ్చు. విత్తనాలు వేసి పెరిగిన మొక్కలు ఇంటి వంటలో వాడుకోవచ్చు. వీటికి ఎలాంటి ఎరువులు అవసరం లేదు. మైక్రోగ్రీన్స్ కిచెన్ గార్డెన్, టెర్రస్‌పై , గదిలో ఎక్కడైనా సులువుగా పండించుకోవచ్చు.

ఈ మైక్రోగ్రీన్స్ మొక్కలకి సూర్యకాంతి ఎంతో అవసరం. గదిలో మైక్రోగ్రీన్స్ మొక్కలని సాగు చేసే వాళ్ళు కృత్రిమ కాంతిని ఏర్పాటు చేసుకోవాలి. మొలకెత్తిన మైక్రో గ్రీన్స్‌ని కోసి మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. ఈ మైక్రో గ్రీన్స్ బిజినెస్ ద్వారా మనదేశంలో మంచి ఆదాయం వస్తుంది.

Leave Your Comments

PJTSAU: ఘనంగా జరిగిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. సుధీర్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమం.!

Previous article

Kubota A211N Tractor: వ్యవసాయంలో బుల్లి ట్రాక్టర్ చేసే వింతలు.!

Next article

You may also like