Sheep Farming: ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న విజయనగరం రైతు కొడుకు, తాను సొంతంగా ఒక వ్యాపారం చెయ్యాలి అని ఆలోచనతో వుండే వాడు. వ్యాపారం మొదలు పెట్టడానికి సరిపోయే డబ్బు లేక, ఆర్థిక పరిస్థితి మంచిగా నిలుపుకోవడానికి ఉద్యోగంలో చేశాడు. తనకి ఉన్న ఆలచనతో ఒక పొట్టేళ్ల కంపెనీ మొదలు పెట్టాలి అనుకున్నాడు. పొట్టేళ్ల కంపెనీ ప్రారంభించడానికి చాలా ఖర్చు అవుతుంది అని అతని స్నేహితుడితో కలిసి చిన్నగా మొదలు పెట్టారు.
ఇప్పుడు విజయనగరంలో ఈ పొట్టేళ్ల కంపెనీ షబ్బీర్ ముల్లానే మొదట ప్రారంభించాడు. ఇప్పటి వరకు అందరూ మేకలు, గొర్రెల మాత్రమే పెంచారు. పోటేళ్ల పిల్లలను వేరు వేరు ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి పెంచుతున్నారు. ఈ పోటేళ్ల పిల్లలకి క్రమంగా టీకాలు వెయ్యాలి, కాస్త ఆలస్యం అయిన రోగాల బారిన పడిపోతాయి.
Also Read: Bottle Gourd Cultivation Income: సొరకాయ సాగులో ఎక్కడి రైతులకి మంచి లాభాలు.!
పోటేళ్ల పిల్లలకి పోషక ఆహారం, పశుగ్రాసం క్రమంగా అందించాలి. పోటేళ్ల బరువు సుమారు 75-80 కిలోలు వరకు ఉండాలి. ఒక పొట్టేలు 50-60 వేల వరకు అమ్ముకోవచ్చు. ఒక పొట్టేలు పిల్ల ధర 15-18 వేల రూపాయలు ఉంటుంది. వీటిని మూడు నెలల పిల్లలని తీసుకొని 6-7 నెల వరకు పెంచాలి. ఏడు నెలలు తర్వాత వీటిని మంచి ధర వచ్చినపుడు అమ్ముకోవాలి.
పొట్టేళ్లు, గొర్రెలు, మేకలు పెంచడానికి షెడ్డు నిర్మించడానికి 2 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఈ షెడ్డులో సుమారు 100 పొట్టేళ్లు లేదా గొర్రెలు, మేకలు పెంచుకోవడానికి సరిపోతుంది. ఇక్కడ పొట్టేళ్లు, గొర్రెలు, మేకలను పెంచి బెంగుళూరు, చిత్రదుర్గ, మైసూరు, భత్కల్ ప్రాంతాలలో అమ్ముకుంటారు. ఆ ప్రాంతాల నుంచి గిరాకీ ఎక్కువ ఉండటంతో ఎక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు అని పోను సంవత్సరానికి 50 లక్షల వరకు ఆదాయం వస్తుంది.
Also Read: Prime Minister’s Employment Generation Programme: PMEGP పథకానికి అర్హులు ఎవరు..?