Quail Farming: వ్యవసాయంపై ఆధారపడే రైతులు వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా దృష్టి సారిస్తే సాగు మరింత లాభదాయకంగా ఉంటుంది. పాడి పశువులు, కోళ్ల పరిశ్రమలతో మంచి లాభాలు పొందుతున్న రైతులే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.కరోన తర్వాత దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన మంచి పోషకాలు ఉన్న ఆహారానికి డిమాండ్ పెరగటంతో మంచి పోషక విలువలు ఉన్న కౌజు పిట్టల పెంపకాన్ని కూడా చేపట్టి మంచి లాభాలను పొందుతున్నారు రైతన్నలు. అయితే భారతీయ కౌజు పిట్టల పెంపకం పై నిషేధం అమల్లో ఉండటంతో జపనీస్ కౌజు పిట్టలను పెంచుతూ మంచి లాభాలను అర్జిస్తున్నారు. కౌజు పిట్టల పెంపకం గురించి ఈరోజు మనం ఏరువాకలో తెలుసుకుందాం…
మాంసానికి కూడా బాగా గిరాకి
కోళ్ల పెంపకం అనగానే మనకు గుర్తుకు వచ్చేది బ్రాయిలర్, లేయర్ కోళ్లు. అయితే కొంతమంది నాటుకోళ్లను కూడా పెంచుతున్నారు. నాటుకోళ్లలలో కూడా రకరకాల కోళ్లను పెంచుతూ అధిక లాభాలను పొందుతున్నారు. అయితే వీటిన్నంటికి భిన్నంగా కౌజు పిట్టలను పెంచుతూ రాణిస్తున్నారు. పశ్చిమ గోదావరి రైతులు.. కరోన తరువాత ప్రోటిన్లు ఉండే ఆహరానికి ఎక్కవ ప్రేరణ చూపిస్తున్నారు. దీంతో గ్రుడ్లు, చికన్ వినియోగం కూడా బాగా పెరిగింది. అయితే బ్రాయిలర్, లేయర్, నాటుకోళ్లు కంటే కూడా పోషకాలు కౌజుపిట్టలో ఉండటంతో వీటి పెంపకానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. నాటుకోళ్లతో పాటు వీటిని కూడా పెంచుతున్నారు. కౌజు పిట్టల మాంసానికి కూడా బాగా గిరాకి ఉంది… అందుకే వీటిని పెంచుతూ మంచి లాభాలను పొందుతున్నారు.. కౌజుపిట్టల రకాలలో జపనిస్ కోళ్లను పెంచి కాసుల వర్షం కురిపించుకుంటున్నారు..
Also Read: Lily Cultivation: లిల్లీ పంటను ఇలాంటి నేలలో వేస్తేనే దిగుబడులు వస్తాయి..

Quail Farming
పెట్టుబడి చాలా తక్కువ
కౌజు పిట్లల పెంపకానికి కొంచెం స్ధలం ఉంటే చాలు. పెట్టుబడి కూడా తక్కువగా కావటంతో పెంపకం కూడా తేలికగా ఉంటుంది. 10 చదరపు అడుగుల స్ధలంలో 100 కౌజుపిట్టలను పెంచుకోవచ్చు. నిరుద్యోగ యువకులకు వీటి పెంపకం చాలా అనుకూలంగా ఉంటుది… వీటికి వచ్చే వ్యాధులు కూడా తక్కువగానే ఉంటాయి. కోళ్ళకు అందించే దాణాతో పాటు నీరు అందిస్తే చాలు. 4నుండి 5వారాల్లో 250 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి. ప్రస్తుతం హోల్ సెల్ వ్యాపారులకు ఒక్కో కౌజు పిట్టను 50 రూపాయలకు విక్రయించవచ్చు. వీటి గ్రుడ్లను అమ్మటం ద్వారా అదాయం పొందవచ్చు.
రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో అందిస్తున్నారు..
తక్కువ కాలంలో ఎక్కవ లాభాలు సంపాదించాలనుకునే కౌజు పిట్టల పెంపకం బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్కవ ప్రొటీన్లు, ఇతర పోషకాలు లభిస్తుండటంతో మాంసానికి గిరాకీ పెరిగింది. హోటళ్ళు, రెస్టారెంట్లలో స్పెషల్ కౌజు పిట్టల మాంసం లభిస్తుండటంతో వీటి పెంపకం దారులు లాభాల బాట పడుతున్నారు. కౌజు పిట్టల బీడర్స్ హైద్రబాద్ లోని రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో అందిస్తున్నారు.
Also Read: Millets Health Benefits: చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనాలు.!