మన వ్యవసాయంవ్యవసాయ వాణిజ్యం

అధిక ఆదాయాన్ని అందించే “అగర్ వుడ్”

0
                                  అధిక ఆదాయం ఇచ్చే పంటలు పక్వానికి రావటం, ఫలసాయం అందించటం ఆలశ్యమవుతుంది. అలాంటి వాటిలో శ్రీగంధం, ఎర్ర చందనం ప్రధానమైనవి. ఇప్పుడు ‘‘అగర్‌ వుడ్‌’’ అనే చెట్లు కూడా ఆ కోవకే చెంది, రైతుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అగర్‌ వుడ్‌ విస్తీర్ణం శీగ్ర్రంగా విస్తరిస్తుంది. శ్రీగంధం, ఎర్ర చందనం వలే 20-25 ఏళ్ల వరకు వేచి చూడకుండానే నాటిన 10 ఏళ్ల నుంచి అగర్‌ వుడ్‌ ఆదాయం అందిస్తూ, రైతులను ఆర్థిక ఇబ్బందులకు లోను కాకుండా ఆదుకుంటుంది. శ్రీగంధం, ఎర్ర చందనాలకు మించి ఆదాయం కోట్లలో అందిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాలలో విస్తరిస్తున్న అగర్‌ వుడ్‌ ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు, సాగు విధానాలు గురించి తొసుకుందాం.
                                  ప్రపంచ వ్యాపితంగా అగర్‌ వుడ్‌ కర్రకు, దీనిలో ఉండే రెసిన్‌కి, ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పూజా కార్యక్రమాల్లో తప్పని సరిగా ‘అగరబత్తీలు’ వెలిగించి, దాని పొగ వెదజల్లే సువాసనకు ఆనంద పడతాము. అగర్‌ వుడ్‌ ఆధారంగానే ఆ సువాసన మెవడుతున్నట్లు నిపుణు చెపుతున్నారు. ‘అగర్‌ వుడ్‌’ ఆధారంగా తయారైంది కాబట్టే దీన్ని అగరబత్తీ అంటున్నారని కూడా వివరణ ఇస్తున్నారు. అగర్‌ వుడ్‌ చెట్టులో ‘రెసిన్‌’ అనే పదార్ధం ఏర్పడుతుంది. అది ఎన్నో ఔషధాల తయారీకి ఉపయోగపడుతుంది. ఆ రెసిన్‌ ఆధారంగా ఉత్పత్తి చేయబడిన మందులు, అతి ప్రమాదకరమైన క్యాన్సర్‌, మధుమేహం లాంటి వాటి నిరోధానికి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. అందువల్లనే అగర్‌ వుడ్‌ ద్వారా లభ్యమయ్యే రెసిన్‌ కిలో లక్షల రూపాయల ధర పలుకుతోంది. అంతేకాదు, అగర్‌ వుడ్‌ చెట్టు నుంచి రాలి వృథాగా పోయే ఆకును కూడా ‘‘టీ’’ పొడిగా మార్చి, ఆదాయం సమకూర్చుకునే అవకాశం పుష్కలంగా        ఉంది. అగర్‌ వుడ్‌ చెట్టులోని ప్రతి భాగము ఆదాయాన్ని అందించేది కావటం వల్ల దాని పెంపకం వల్ల కోట్లు సమకూర్చుకోవచ్చని మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు.
                                    అగర్‌ వుడ్‌ ఆధారంగా తయారు చేయబడిన మందులు క్యాన్సర్‌, మధుమేహం రోగాల నిరోధానికి మాత్రమే పరిమితం కావటం లేదు. కీళ్ళ నొప్పులు, నరాల బహీనత, లివర్‌, కిడ్నీ సమస్యలు, కడుపు నొప్పి, చర్మ వ్యాధులను నివారించటానికి విరివిగా ఉపయోగిస్తున్నారు. మలేషియా, ఇండోనేషియా, చైనాల్లో దీని ఆధారంగా తయారైన మందును ఎక్కువగా వాడుతున్నారు. తైవాన్‌, జపాన్‌, మధ్య ఆసియా, వియత్నాం లాంటి దేశాు అగర్‌ వుడ్‌ ద్వారా తయారైన మందు పట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అగర్‌ వుడ్‌ ఆకు ద్వారా తయారైన టీ పొడి వాడినప్పుడు శరీర రుగ్మతు తగ్గటం, మధుమేహ వ్యాధి అదుపులో ఉండటం లాంటి సుగుణాలు ఉన్నట్లు చెపుతున్నారు.
                          ‘‘డబ్బులు చెట్లకు కాస్తాయా?’’ అనే వ్యంగ్య వాక్యం అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. అగర్‌ వుడ్‌ గురించి విన్నాక, దాని ప్రాధ్యాన్యతు తెలుసుకున్నాక, అది వ్యంగ్యం కాదు, యదార్థమనే విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే అగర్‌ వుడ్‌ కాసులను కురిపిస్తుంది. శ్రీగంధం, ఎర్ర చందనం వలె 20, 30 ఏళ్ళు ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. 9, 10 ఏళ్ల నుంచే దాని నుంచి ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. ఎకరానికి కోట్ల రూపాయల్లో ఆదాయం సమకూర్చే శ్రీగంధం, ఎర్ర చందనం లాంటి వాటికి ఈ అవకాశం లేదు. అగర్‌ వుడ్‌ రెసిన్‌ పెరిగినట్లు అభిప్రాయపడితే ఆ చెట్లను అమ్మి ఆదాయం సమకూర్చుకొని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. అగర్‌ వుడ్‌ చెట్టులో 20 సంవత్సరముల తర్వాత రెసిన్‌ ఏర్పడుతుందని ఆ రంగంలోని  నిపుణులు చెపుతున్నారు. అలాంటి మివైన రెసిన్‌ను కృత్రిమంగా ఏర్పాటు చేయవచ్చని పరిశోధను రుజువు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అగర్‌ వుడ్‌ పంటను ప్రవేశపెట్టిన తుమ్మల వెంకటేశ్వరరావు కృత్రిమంగా ‘రెసిన్‌’ పొందుపరచేందుకు శాస్త్రవేత్తలను ఏర్పాటు చేసి, లక్షలు ఖర్చు చేసి పరిశోధను చేయిస్తున్నారు.
                         శ్రీగంధం, ఎర్ర చందనాలలో చెట్టులోపల నల్లగా మారినప్పుడు, దాన్ని చేవగా గుర్తించి దానికి ధర నిర్ణయిస్తారు. అగర్‌ వుడ్‌ అందుకు పూర్తి విరుద్ధం. అగర్‌ వుడ్‌ చెట్టు లోపలి భాగంలో గుల్ల ఏర్పడాలి. అలా గుల్ల ఏర్పడినప్పుడు ఒక విధమైన గుజ్జు (బంక) ఏర్పడుతుంది. దానినే రెసిన్‌ అంటారు. ఆ రెసిన్‌లో నాణ్యత మోతాదు ఆధారంగా ధర పుకుతుంది. ఈ రెసిన్‌ విలువ కిలో 20 వేల రూపాయలకు తగ్గకుండా ఉంటుంది. 10 ఏళ్ల వయసు చెట్టులో రెసిన్‌ చేరినట్లు గమనించినా ఒకో చెట్టుకు 3 కిలోల రెసిన్‌ సమకూరుతుంది. 10 ఏళ్ల వయసులో 100 నుంచి 125 చెట్లను నరికించి, రెసిన్‌ అమ్ముకునే అపురూప అవకాశం ఈ అగర్‌ వుడ్‌ చెట్టుకు ఉంది. ఇంతటి అపురూప అవకాశం మరే చెట్టుకు ఉన్నట్లు మనకు చరిత్రలో ఎక్కడా కనిపించదు. ఏటా 100 చెట్లు నరికించి రెసిన్‌ అమ్ముకున్నా, రూ.60,000 I 100 R 60,00,000/-లు ఆదాయం సమకూర్చుకోవచ్చు.
                         ఇంతటి విలువైన పంటను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రారంభించిన ఘనత విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరావుకు దక్కింది. 2010లో 33 మొక్కలను అస్సాం రాష్ట్రం నుంచి తెచ్చి, తన తోటలో నాటారు. వాటిని నాటటంలో కూడా ఆయన నిపుణత కనబరచారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తన 100 ఎకరాల తోటలో కొబ్బరి, టేకు, సరుగుడు, ఆయిల్‌ ఫామ్స్‌, ఎర్ర చందనం, శ్రీగంధం లాంటివి పెంచుతున్నారు. ఆ తోటలో అగర్‌ వుడ్‌ చెట్లను అంతర పంటగా నాటి పరిశీలిస్తున్నారు. అగర్‌ వుడ్‌ పెంపకం గురించిన సమాచారం తెలుగులో లేదు. కాబట్టి ఆ పెంపకంపై పరిశీన కోసం తాను తెచ్చిన 33 మొక్కల్లో 11 ఒకచోట, 22 మరొక చోట నాటి, వాటి పెరుగుదలను పరిశీలిస్తున్నారు. భూములు, వాతావరణం, నీటి అవసరా గురించి అధ్యయనం చేస్తున్నారు. వీటితో పాటు అగర్‌ వుడ్‌ చెట్టులో రెసిన్‌ పెరగటం కోసం ఆరేళ్ల వయసు నుంచి చెట్టుకు ఇంజెక్షన్ల ద్వారా ఫంగస్‌ ఎక్కిస్తున్నారు. అందుకోసం నిపుణులను కూడా ఏర్పాటు చేశారు. అగర్‌ వుడ్‌ చెట్టుకు ఇంజెక్షన్ల ద్వారా ఫంగస్‌ ఎక్కించటం వల్ల చెట్టులో త్వరితగతిన రెసిన్‌ ఏర్పడుతున్నట్లు శాస్త్రవేత్తులు నిర్థారించారు. 33 మొక్కలతో ప్రారంభమైన అగర్‌ వుడ్‌ సాగును తన తోటలో 75 వేల మొక్కలకు విస్తరించారు. రైతులకు మరో 4 లక్షల మొక్కులు అందించి, అగర్‌ వుడ్‌ సాగును విస్తరిస్తున్నారు తుమ్మల వెంకటేశ్వరరావు.
Leave Your Comments

చేపల పెంపకంలో నీటి గుణాలు ప్రాముఖ్యత యాజమాన్య పద్ధతులు

Previous article

బెండలో ఎర్రనల్లి నివారణ చర్యలు..

Next article

You may also like