Mahogany: రైతులు సాధారణంగా వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు వేస్తుంటారు. వాణిజ్య పంటలు చాలా తక్కువ రైతులు పండిస్తుంటారు. వాణిజ్య పంటకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఈ మధ్య కాలంలో రైతులు వాణిజ్య పంటలు వేయడం మొదలు పెట్టారు. సాధారణ పంటలు పండిస్తూ, అంతర పంటగా వాణిజ్య పంటను కూడా రైతులు పండిస్తున్నారు. అలంటి వాణిజ్య పంటలో మహోగని చెట్లు పెంచడం ఒకటి. ఈ మహోగని చెట్లుతో ఇంటిలోని వస్తువులు, ఇతర వాటికీ వాడుతారు.
ఈ మహోగని చెట్టు పెరగడానికి కొండ ప్రాంతాలు పనికిరావు. నీళ్లు నిలువ ఉండే ప్రాంతాల్లో ఈ మహోగని చెట్లు పెరగవు. ఎక్కువ గాలులు వచ్చినపుడు చెట్లు విరిగిపోతాయి. మహోగని చెట్టు వేర్లు ఎక్కువ లోతుకి వెళ్తాయి, అందువల్ల కొండ ప్రాంతాల్లో ఈ చెట్లు పెరగవు. ఈ చెట్లని సాగు చేయడానికి నేల pH 5-6 ఉండాలి. ఈ మహాగాని చెట్లకి ఎక్కువ నీరు అవసరం ఉండదు. ఈ చెట్టు 40-200 అడుగులు పెరుగుతుంది కానీ మన భారతదేశంలో కేవలం 60 అడుగులు మాత్రమే పెరుగుతుంది.
Also Read: Ridge Gourd Cultivation: బీరకాయ పంటతో రైతులకి ఒక నెలలో లక్ష రూపాయల ఆదాయం.!
మహోగని చెట్టుకి మన దేశంలోనే కాకుండా ఇతర దేశంలో కూడా మంచి డిమాండ్ ఉంది. మహోగని చెట్టు చెక్క గట్టిగా ఉండటం వల్ల ఓడలు, ఫర్నిచర్, ప్లైవుడ్, శిల్పాలు తయారు చేయడానికి వాడుతారు. ఈ చెక్క 50 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. ఈ చెక్క వర్షానికి, ఎక్కువ వేడికి చెక్కు చెదరదు. కొన్ని దేశంలో మహోగని చెట్టు చెక్కతో ఇళ్లు కట్టుకుంటారు. మహోగని చెట్టు ఆకులూ క్యాన్సర్, రక్తపోటు, ఉబ్బసం రోగాలకు వైద్యం చేయడానికి వాడుతారు. ఈ చెట్టు ఆకులూ మందులు తయారీలో కూడా వాడుతారు. శారీరక శక్తిని పెంచే ఔషధాల తయారీలో కూడా ఈ చెట్టుని ఉపయోగిస్తారు. మహోగని చెట్టు ఆకులు లేదా గింజల నుంచి వచ్చే నూనెను దోమల నివారణకు వాడుతారు.
ఈ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉండటం వల్ల ఈ చెట్టు ఖరీదు కూడా ఎక్కువ. మహోగని చెట్టు విత్తనాలు కిలో 1000 రూపాయలుగా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈ చెట్టు పూర్తిగా పెరగడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఒక సమయంలోనే ఆదాయం కావాలి అనుకునే వాళ్ళు ఈ చెట్లు పెంచుకోవాలి. ఈ చెట్టుకి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు. పొలంలో మొక్కలను వేసి వదిలేస్తే చాలు, నీళ్లు కూడా ఎక్కువ అవసరం ఉండదు.
ఒక మహోగని చెట్టుకి 20-30 వేలుతో అమ్ముకోవచ్చు. పొలంలో లేదా పొలం చుటూ వేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది. ఒక ఎకరం పొలంలో మహోగని చెట్లను నాటుకోవడానికి దాదాపు ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ చెట్లని అమ్ముకునే సమయానికి రైతుకి కోటి రూపాయలు వస్తాయి. ఈ చెట్లని పెద్ద మొత్తంలో సాగు చేస్తే ఓకే సారి భారీ లాభాలు వస్తాయి.
Also Read: Papaya Farming: బొప్పాయి పంట సాగు.. రైతులకి మంచి లాభాలు.!