Bull Driven Oil Business: వ్యవసాయం చేస్తున్న రైతులు వ్యవసాయ పంటలతోనే కాకుండా , ఆ పంటలని ప్రాసెస్ చేసి ఇంకా మంచి లాభాలు సంపాదిస్తున్నారు. రైతులు పండించిన కొన్ని పంటలు వినియోగదారులు నేరుగా వాడలేరు. ఇలా ప్రాసెస్ చేసి అమ్ముకోవడం ద్వారా వ్యాపారులు మంచి లాభాలు పొందుతున్నారు. ఈ లాభాలని చూసి ఇప్పుడు రైతులు కూడా వాళ్ళు పండించిన పంటని ఇంటి దగ్గరే చిన్న మొత్తంలో ప్రాసెస్ చేసి అమ్మడం వల్ల రైతులు కూడా మంచి లాభాలు పొందుతున్నారు. ఈ ఆలోచన ప్రకారం చిత్తూరు జిల్లా , ఎగువ తవణంపల్లి గ్రామంలో వినోద్ రెడ్డి గారు తను చేస్తున్న ఉద్యోగాని మానివేసి, ప్రస్తుతం ఇంటి దగ్గర ఉంటూ వ్యవసాయంతో పాటు ఎద్దు గానుగ ఏర్పాటు చేసుకున్నారు.
వినోద్ రెడ్డి గారు వారి పొలంలో పండించే పంటని, ఎద్దు గానుగ వాడి వాటి నుంచి నూనె తీసి అమ్మడం ద్వారా మంచి లాభాలు వస్తున్నాయి. ఎద్దు గానుగ ముందు ప్రారంభంలో ఒక ఎద్దు గానుగతో ప్రారంభించి, ఇప్పుడు మూడు ఎద్దు గానుగలు ఏర్పాటు చేసుకున్నారు. ఎద్దు గానుగల ద్వారా తీసే నూనెకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో మంచి ఆదాయం తీసుకుంటున్నారు.
Also Read: India Caps Rice Exports: బియ్యం ఎగుమతులు నిషేధం.. విదేశాల్లో ఉన్న భారతీయులకి షాక్…
ఈ ఎద్దు గానుగల ద్వారా వినోద్ రెడ్డి గారు 16 రకాల నూనెలు అమ్ముతున్నారు. ఈ ఎద్దు గానుగలో 16 కిలోల ఆముదము వేస్తే 4 నుంచి 5 కిలోల నూనె, రెండు గంటలో తీయవచ్చు. ఎద్దు గానుగ నుంచి వేరుశనగ, నువ్వులు , కొబ్బరి , వెరి నువ్వులు , కుసుమలు , అవలు , బాదం , ఫ్లెక్స్ సీడ్ , పొద్దుతిరుగుడు పువ్వు , ఆముదము , కానుగ , వేప , విప నూనెలను తీసి అమ్ముతున్నారు.
వీటి ద్వారా తీసిన నూనెని భారతదేశం మొత్తం సప్లై చేస్తున్నారు. ఒక ఎద్దు గానుగ ఏర్పాటు చేసుకోవడానికి రెండు లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. ప్రతిరోజు ఆదాయం సుమారు 1000 రూపాయల వరకు వస్తుంది. ఒకొక రకం నూనె బట్టి వాటి ధర మారుతుంది. ఆముదము నూనె ఒక లీటర్ 600 రూపాయలు, వేరుశనగ నూనె ఒక లీటర్ 400 రూపాయలు, కొబ్బరి నూనె ఒక లీటర్ 500 రూపాయలు ఉంది.
నూనె నుంచి మాత్రమే కాకుండా ఆవు పిడకలు, ఆవు ఇటుకలు తయారు చేసి ఆన్లైన్లో అమ్మడం ద్వారా కూడా మంచి లాభాలు వస్తున్నాయి. మీరు ఈ నూనె కొనుగోలు చేయెలీ అనుకున్న లేదా ఈ వ్యాపారం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే 9381321079 నెంబర్ సంప్రదించండి.
Also Read: Kitchen Essentials Price Hike: టమాట ధరతో పోటీ పడుతున్న అల్లం, చింతపండు ధరలు..