Tulsi Cultivation: ఈ మధ్య కాలంలో వాణిజ్య పంటతో రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. రైతుల పంటను కొనుగోలు చేసే కంపెనీలతో కాంట్రాక్టు చేసుకొని మార్కెటింగ్ పని లేకుండ కంపెనీ వాళ్ళకి అమ్ముతున్నారు. కొంతమంది రైతులు కంపెనీలకి కావాల్సిన పంటలు పండిస్తున్నారు. కరోనా తర్వాత కంపెనీలు ఎక్కువగా ఔషధ మొక్కలను పెంచమని రైతులకి చెపుతున్నారు. ఈ ఔషధ మొక్కలను ఆయుర్వేద మందులు, అల్లోపతి మందులో వాడుతున్నారు. ఈ పంటలను పండించడం వల్ల మంచి లాభాలతో పాటు రైతులకి మార్కెటింగ్ ఇబ్బందులు ఉండవు.
ఈ ఔషధ మొక్కలకి ఎక్కువ స్థలం కూడా అవసరం ఉండదు. మన దేశంలో ఔషధాల ఉత్పత్తులు, మార్కెట్ చాలా పెద్దది. ఈ ఔషధాల ఉత్పత్తులకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఔషధాల మొక్కల సాగు చేయడానికి కొన్ని వేల రూపాయలు పెట్టుబడి పెడితే ఆదాయం లక్షల్లో ఉంటుంది.
Also Read: Commercial Mushroom Cultivation: 6 వేల పెట్టుబడితో రెండున్నర లక్షలు ఆదాయం సంపాదించడం ఎలా ..?
తులసి, ఆర్టెమిసియా అన్నూ, లికోరైస్, అలోవెరా ఈ ఔషధ మొక్కలను చాలా రకాల ఆయుర్వేద మందులు, అల్లోపతి మందులో వాడుతాడు. ఈ ఔషధ మొక్కలను పంటల పొలాల్లో, ఖాళీ స్థలంలో, కుండీలలో పెంచుకోవచ్చు. ఈ ఔషధ మొక్కలను కొనుగోలు చేయడానికి రైతులతో ఒప్పందాలు చేసుకునే ఫార్మాస్యూటికల్ కంపెనీలు కూడా ఉన్నాయి. చాలా కార్పొరేట్ కంపెనీలు రైతులకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాయి.
మనం పవిత్రంగా పూజించే తులసి మొక్కలో యూజినాల్, మిథైల్ సిన్నమేట్ ఉన్నాయి. ఈ యూజినాల్, మిథైల్ సిన్నమేట్ క్యాన్సర్ వ్యాధులకు మందుల తయారీలో వాడుతారు. అందుకే తులసి మొక్కలకు డిమాండ్ ఎక్కువ ఉంది. ఒక ఎకరంలో తులసి సాగు చేయడానికి 15 వేలు పెట్టుబడి పెడితే, మూడు నెలలో మూడు లక్షల వరకి లాభాలు వస్తాయి.
పతంజలి, డాబర్, వైద్యనాథ్ ఆయుర్వేద ఔషధాల కంపెనీలతో ఒప్పంద వ్యవసాయం రైతులు చేసుకోవచ్చు. ఈ కంపెనీలు రైతులకి విత్తనాలు, ఫెర్టిలైజర్స్ ఇస్తారు. రైతులు పంటను సాగు చేసి ఈ కంపెనీలకి ఇవ్వాలి. ఈ కంపెనీ వాళ్ళు రైతు పండించిన పంటను తీసుకుంటారు. కంపెనీలు పంటను తీసుకోవడం వల్ల రైతులకి మార్కెటింగ్ పని తగ్గుతది. తులసి గింజలకు, నూనెకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
Also Read: Shatavari Health Benefits: శతావరి చూర్ణం తీసుకోవటం వలన స్త్రీలలో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు