Moringa Seeds: రైతులు పండించే పంటలు నేరుగా మార్కెట్కి తీసుకొని వెళ్లి అమ్ముకుంటారు. పండించిన పంటలో కొంత భాగం విత్తనాల కోసం దాచుకుంటారు. కానీ ఏ మధ్య కాలంలో రైతులు పండించిన పంటకి మంచి ధర లేకపోతే పంట మొత్తం విత్తనాల కోసం వదిలేస్తున్నారు. ఇది నిజమే రైతులు పండించిన పంటకి తక్కువ ధర మార్కెట్లో ఉంటే, ఆ పంటని విత్తనాలు చేసి అమ్ముకుంటే రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి.
ఇదే పద్దతిలో గుంటూరు రైతులు మునగ కాయ తోటలు పెట్టారు. మునగ కాయలు ఎక్కువగా వంటలోకి వాడుతారు. వాటి ధర కిలో సుమారు 40-50 రూపాయలు ఉంటుంది. ఈ ధర మార్కెట్లో అప్పుడు ఒకేల ఉండదు. ఒక సమయంలో పెరుగుతుంది, ఇంకో సమయంలో తగ్గుతుంది.
Also Read: Vetiver Cultivation: వట్టివేరు సాగుతో రూ.లక్షల్లో ఆదాయం.!
వర్షాలు ఎక్కువ ఉంటే మునగ చెట్టు సాగు సరిగా రాదు. తక్కువ వర్షాలు ఉండే కాలంలో వేసుకోవాలి ఈ పంట. ఎక్కువ వర్షులు ఉన్న సమయంలో దిగుబడి తగ్గి మార్కెట్లో రేట్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో రైతులు వల్ల పంటకి మంచి రేట్ వస్తుంది.
రేట్ తక్కువ ఉన్న సమయంలో అంటే కిలో 15-20 రూపాయలు ఉన్నపుడు మునగ కాయలని చెట్టుకి అలాగే వదిలేస్తే విత్తనాలుగా మారుతాయి. మునగ కాయల కంటే మునగ విత్తనాలకి మార్కెట్లో మంచి ఆదాయం ఉంది. ఒక క్వింటాల్ విత్తనాలు 3000 వరకు అమ్ముతున్నారు. ఒక ఎకరం పంటని విత్తనాలుగా చేసి అమ్ముకుంటే 1. 50 -2 లక్షల వరకు రైతులకి లాభం వస్తుంది.
మార్కెట్లో మునగ కాయల రేట్ తగ్గినపుడు ఇలా చేయడం వల్ల రైతులు నష్టపోకుండా ఉంటున్నారు. రైతులకి మునగ కాయలు కిలో 40-50 రూపాయలకి అమ్ముకున్న 60-70 వేల లాభాలు వస్తాయి. దాని కంటే ఇలా విత్తనాలు చేసి అమ్ముకోవడం ద్వారా లాభాలు రేటింపుగా వస్తున్నాయి.
Also Read: Medicinal Plants: కరోనాతో ఔషధాలకు డిమాండ్..