వ్యవసాయ వాణిజ్యం

Kanakambaram Farmers: శ్రావణమాసంలో లాభాలు పొందుతున్న కనకాబంరం రైతులు.!

2
Kanakambaram Farmers
Kanakambaram Farmers

Kanakambaram Farmers: సాంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతులు తక్కవకాలంలో ఆధిక దిగుబడులను ఇచ్చే పూలసాగు వైపు మళ్లారు. ప్రస్తుతం లభ్యమవుతున్న అరకొర నీటితో తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలను ఆర్జించే పంటల పూలసాగు కు శ్రీకారం చుట్టారు. కనకాబంరం పూల సాగు చేపట్టి శ్రావణమాసం, అయప్ప సీజన్ తో మంచి లాభాలను పొందుతున్నారు. పెట్టుబడులు తగట్టు దిగుబడులను పొందుతున్నారు. కనకాబంరం పూల సాగు రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది. ఇందులో భాగంగానే పూల సాగు చేపట్టిన రైతులు పెట్టిన పెట్టుబడులను రాబట్టుకుంటున్నారు.

పూలలో ఎన్నో రకాలు ఉన్నా కనకాంబరం పువ్వులకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పువ్వులను మల్లెలు, జాజులు, కాకడ మల్లెలు, చుక్కమల్లెలు వేటిలో కట్టిన కూడా మగువుల శిగలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అందుకే మార్కెట్లో కనకాంబరం పూలకు ఇతర పూల కంటే మంచి డిమాండ్ పలుకుతోంది. అంతేకాకుండా వీటి ధర కూడా ఎక్కువగా ఉంటుంది. కిలో ధర 1000 రూపాయల దాకా పలుకుతుంది.

అందుకే చాలా రైతులు తమకున్న తక్కవ విస్తీర్ణం పొలంలో కనకాంబరం పూల సాగు చేపట్టి అధిక అదాయం పొందుతున్నారు. అంతేకాకుండా అంతర పంటగా వేస్తారు. ఇంటి ఆవరణలో వేసుకుంటారు. ఎందుకంటే కనకాంబరం చాలా అందంగా ఉంటాయి. ఈసాగు చేపట్టిన రైతులు సరైన యాజమాన్య పద్దతులు అధిక పూల దిగుబడిని పొందవచ్చు. ఏడాదికి ఎకరానికి 1800 కిలోల నుంచి 2,500కిలోల వరకు దిగుబడిని పొందవచ్చు.

Also Read: Gulkhaira Farming: 10 వేల పెట్టుబడితో మంచి దిగుబడులను ఇస్తున్న గుల్ఖేరా.!

Kanakambaram Farmers

Kanakambaram Farmers

3నెలల్లోనే పూత ప్రారంభమై ఏడాది పొడవునా పూలు పూస్తాయి. జూన్ నుండి జనవరి వరకు అధిక దిగుబడి వస్తుంది. ఇది నీటి ఎద్దడిని తట్టుకునే బహువార్షిక పూలజాతి మొక్క కావటంతో రైతులకు కనకాంబరం సాగు ఉపయోగకరమని చెప్పవచ్చు. వివిధ రాష్ట్రాల్లో అలంకరణలోనూ కనకాంబరం పూలను వినియోగిస్తారు. అంతర పంటగా కనకాంబరం సాగును చేపట్టి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

కనకాంబరం పూలకు మార్కెట్ లో మంచి ధర లభిస్తుండటంతో ఇటీవల కాలంలో రైతులు కనకాంబరం సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. నారింజ, గులాబి, ఎరుపు, పసుపు, నీలి, తెలుపు రంగుల రకాలను రైతులు ఎకక్వగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలు కనకాంబరం సాగుకు అనుకూలంగా ఉంటాయి. కనకాంబరం మొగ్గలు పువ్వులుగా విచ్చుకునేందుకు రెండు రోజుల సమయం పడుతుంది. పువ్వులను రోజు ఉదయం, సాయంత్రం వేళ్ళల్లో కోయాల్సి ఉంటుంది. సొంత భూమి ఉన్న రైతులు సంవత్సరం పొడవునా అదాయం పొందాలంటే కనకాంబరం సాగు చేపట్టటం చాలా మంచిది పశువుల ఎరువులతోనే కనకాంబరం సాగును చేపట్టవచ్చు. తద్వారా ఖర్చు తగ్గి మంచి ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది.

Also Read: GPS Ear Tags for Cattle: ఇంట్లో ఉండి వేలాది పశువులను కాయవచ్చు.!

Leave Your Comments

Gulkhaira Farming: 10 వేల పెట్టుబడితో మంచి దిగుబడులను ఇస్తున్న గుల్ఖేరా.!

Previous article

Harvest Home Foods: ఇంటి పంట లోగిళ్లకి అందమే కాదు ఆరోగ్యం కూడా.!

Next article

You may also like