Chilli Cultivation: వాణిజ్య పంట అయినా మిర్చిని రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. గతేడాది మిర్చికి రేటు బాగా పలకడంతో అప్పులు చేసి మరీ రైతులు సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలాగైనా సరే మిర్చిని వేసి అప్పులు తీర్చాలన ఆలోచనతో రైతులు ఉన్నారు. ఎకరాకు రూ 2 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టడానికి కూడా వెనుకకు తగ్గడం లేదు. పోయిన సంవత్సరం మిరప ధర క్వింటాల్‌కు రూ.20-25వేలు పలకడమే రైతుల్ని ఆ పంట సాగు దిశగా నడుస్తున్నారు.
ఉమ్మడి గుంటూరుతో పాటు ప్రకాశం, కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున ఎర్ర బంగారం సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మిరప సాగు 7 లక్షల ఎకరాలకు పైనే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయినా సాగు అనేది గాలిలో దీపం లాంటిది. వాతావరణం అనుకూలిస్తే రైతులు ఒడ్డున పడతారు. లేకపోతే జీవితాలే తలకిందులవుతాయేం. ప్రభుత్వానికి ఇంత ఆదాయాన్ని ఇస్తున్న మిరప రైతుకు మాత్రం బీమా భరోసా కల్పించలేకపోతోంది.
మిరప సాగుపై రైతులు ఆసక్తి
మిరపసాగులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు జిల్లా మిరప సాగుకు పెట్టింది పేరు. తరువాత స్థానంలో ప్రకాశం, కృష్ణా జిల్లాలు ఉండేవి. సాగునీటి వసతి ఉండే భూముల్లో మిరప సాగుపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. నల్ల తామర పురుగు ఆశించి మిరపపంటను తీవ్రంగా నష్టపరచింది. దీంతో రైతులు రూ.లక్షకు పైగా నష్టపోయారు. వారిలో కొంత మందికి పంటల బీమా కూడా దక్కలేదు.
Also Read: Thailand Grass: థాయిలాండ్ గడ్డిపై ఆసక్తి చూపిస్తున్న రైతులు.!
రెండేళ్లుగా పురుగు మందుల పెట్టుబడులు పెరిగాయి. నల్ల తామర నివారణ పేరుతో మార్కెట్లోకి కొత్తరకం పురుగు మందులు రావడంతో కొందరు మందులకే ఎకరాకు రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తున్నారు. మిరప సాగులో 90% మంది రైతులు అప్పుల పైనే ఆధారపడతారు. పండించిన మిరపను అమ్మకానికి తెస్తామని ఒప్పందంపై.. అధికశాతం రైతులు మిర్చి వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుంటారు. రూ.లక్షల్లో అప్పులను నెత్తిన ఎత్తుకొని మిరప సాగులో నడవాల్సిందే. ఈ సంవత్సరం వాతావరణం కలిసి వచ్చి మిరప దిగుబడి వచ్చి, ధర కలిసొస్తే ఒడ్డున పడతామని కర్షకులు అంటున్నారు.
ఎకరాకు రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి
క్వింటాల్ ధర రూ.20 వేలకు పైనే పలకడంతో రైతులు మిరప సాగుపై ఆసక్తి పెంచుకున్నారు. ఎకరాకు రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి ఆవుతున్నా సరే నారును కొన్ని మరి పంటను పెంచుకుంటున్నారు. గాలిలో దీపంలా సాగు ఉన్నా కూడా బీమా భరోసా సర్కారు కల్పించడం లేదు. గతేడాది లానే ఈ ఏడాది కూడా రేటు వస్తుందని రైతులు సాగును పెంచుకున్నారు. అయితే ఎటువంటి వైరస్ ఆశించకుండా వాతావరణం అనుకూలించాలని, కాలువలకు నీరు వదలాలి అని రైతులు కోరుతున్నారు.
Also Read: Automatic Water Level Controller: రైతుల నీటి కష్టాలకు చెక్ పెట్టిన యువకుడు.!