Economic Survey: ఆర్థిక సర్వే ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రైతులకు రూ. 7.36 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.16.50 లక్షల కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లక్ష్యానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 2021 వరకు రూ. 7,36,589.05 కోట్లు పంపిణీ చేయబడ్డాయి అని సర్వే పేర్కొంది.

Economic Survey
Also Read: ప్రభుత్వం వ్యవసాయ R&D సేంద్రియ వ్యవసాయాన్ని పెంచాలి- ఆర్థిక సర్వే
2020-21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా రూ. 15,75,398 కోట్ల వ్యవసాయ రుణాలు పంపిణీ చేయగా ఈ సంవత్సరానికి లక్ష్యం రూ.15,00,000 కోట్లుగా పెట్టుకుంది సర్కార్. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 2.5 కోట్ల మంది రైతులకు రూ. 2 లక్షల కోట్ల రాయితీ రుణాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగానే ఈ ఏడాది జనవరి 17 నాటికి 2.70 కోట్ల మంది అర్హులైన రైతులకు బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసినట్లు సర్వే పేర్కొంది.

KISAN CREDIT CARD
ఇది కాకుండా డిసెంబర్ 17, 2021 నాటికి మత్స్యకారులు మరియు చేపల పెంపకందారులకు మొత్తం 67,581 కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేశారు. డిసెంబర్ 10, 2021 నాటికి పశుసంవర్ధక మరియు పాడి రైతులకు 14 లక్షలకు పైగా కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేశారని సర్వే పేర్కొంది.
Also Read: వ్యవసాయ రంగంపై 2021-22 ఆర్ధిక సర్వే