Tamarind Seeds: వంటలో నిత్యం వాడే పదార్థాల్లో చింతపండు ఒకటి. చింతపండు తీసుకొని, చింత గింజలు ఎందుకు పనికిరావు అని పడేస్తుంటాము, కానీ చింత గింజలో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చింతపండు గింజల వ్యాపారులకు ప్రస్తుతం మంచి గిరాకీ ఉంది. ఈ లాభాలను చూసి ఆంధ్రప్రదేశ్, కాకినాడలో చింత గింజల ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించారు. అమెజాన్, ఫ్లిఫ్కార్ట్, ఇతర ఆన్లైన్ యాప్ లలో భారీ డిమాండ్లో ఉంది, ఇంకా కొన్ని పరిశ్రమలకు ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారు.
చింత గింజలు కిలో 5 నుంచి 8 రూపాయలు వరకు పరిశ్రమ వాళ్ళు కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేసి వాటిఫై తోలు తీసాక వాటి ధర 20 రూపాయలు కిలోకి పెరుగుతుంది. చింతపండు నుంచి గింజలను వేరు చేసి చింతపండు వ్యాపారులు ఫ్యాక్టరీలకు అమ్ముతారు. వాటిని ప్రాసెసింగ్ యూనిట్లలోని బాయిలర్‌లో 240 డిగ్రీల వేడి నీటిలో వేసి దానిపై ఉండే తొక్కను తీసి ప్యాక్ చేస్తారు. వాటిని వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళ్తారు.చింత గింజల కంటే చింత గింజల పౌడర్ ఎక్కువ విలువ ఉండటంతో కొంత మంది వ్యాపారులు చింత గింజల పౌడర్ తయారు చేస్తున్నారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాక్టరీలలో ఈ గింజలను వైట్ పౌడర్‌గా మార్చి ఏ1, ఏ2, ఏ3, ఏ4 గ్రేడ్‌లుగా విభజించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చింత గింజల పౌడర్ ధర చింతపండు కన్నా చాలా కాస్ట్‌లీ, కేజీ పౌడర్ ధర రూ.400 వరకు ఉంటుంది.
Also Read: Minister Niranjan Reddy: వ్యవసాయానికే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యం – మంత్రి నిరంజన్ రెడ్డి
మోకాళ్ల నొప్పులకు చింత గింజలు ఔషధంలాగా వాడుకుంటారు, మరికొన్ని రకాల మందుల తయారీలోనూ ఈ చింతగింజలను ఉపయోగిస్తారు. మస్కిటో కాయిల్స్ తయారీలోనూ చింతగింజలను ఉపయోగిస్తున్నారు. పట్టు వస్త్రాలు, జూట్ పరిశ్రమలో ఈ చింతగింజలను వాడుతుంటారు. చింత గింజల్లో ఫైబర్, ప్రొటీన్స్, మినరల్స్ ఉండటంతో వంటకాలో వాడుతారు.
ఒక సంవత్సరంలో 18 వేల టన్నుల చింత గింజలు ఎగుమతి అవుతున్నాయి, రూ.36 కోట్ల వాటి విలువ. చింతగింజల కొనుగోళ్లు, ఎగుమతుల ద్వారా ఏడాదికి సుమారు రూ.65 కోట్ల లాభాలు జరుగుతున్నాయి. ఒక్క కాకినాడ జిల్లాలో రోజుకు 60 టన్నుల వరకు చింత గింజలు అందుబాటులో ఉంటాయి. అందులో 20 టన్నుల వరకు ప్రాసెసింగ్ జరుగుతోంది. చింతపండు సీజనల్‌గా మాత్రమే లభిస్తుంటాయి. కోల్డ్ స్టోరేజిలలో నిల్వ ఉంచడం వల్ల ఏడాదంతా చింత గింజలు అందుబాటులో ఉండి, చింత గింజలను ప్రాసెసింగ్ చేసే ఫ్యాక్టరీలు ఏడాదంతా రన్ అవుతూనే ఉంటాయి. కాకినాడ ప్రాసెసింగ్ యూనిట్స్ లాభాల వల్ల, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, హిందూపురం, చిత్తూరు మొదలైన ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా ఆర్డర్స్ తీసుకొని కొంతమంది వ్యాపారులు ప్రాసెస్ చేసిన చింత గింజలు, చింత గింజల పొడిని వ్యాపారం చేస్తున్నారు.
Also Read: Soil pH: చౌడు నేలల సంరక్షణ చర్యలు.!