Purple Leaf Tea: సాధారణంగా మనం బ్లాక్ టీ గురించి విని ఉంటాం, గ్రీన్ టీ గురించి విని ఉంటాం కానీ పర్పుల్ టీ గురించి ఎపుడైనా విన్నారా ? ఇది అందరికి కొత్తగానే అనిపిస్తుంది. ఇది మన దేశంలో అంత ప్రాచుర్యం కాలేదు కానీ ఇతర దేశాలలో ఎక్కువగా వాడుతారు. పర్పుల్ టీ అనేది ఒక కొత్త రకమైన టీ, మరియు ఇది కొన్ని సంవత్సరాలు మాత్రమే వాణిజ్యపరంగా అందరికి అందుబాటులో ఉంది. భారతదేశంలోని అస్సాం ప్రాంతంలో ఉన్న అడవుల్లో పెరుగుతున్న ఒక అరుదైన ఊదా-ఆకులతో కూడిన టీ ప్లాంట్ నుండి ఈ టీ ని ఉత్పత్తి చేస్తారు. ఈ రోజుల్లో పర్పుల్ టీ అనేది ముఖ్యంగా కెన్యా, ఆఫ్రికాలో వంటి దేశాలలో ఉత్పత్తి చేయబడుతుంది. ఇది శరీరాన్ని తేలికగా మరియు మధురమైన రుచిని అందిస్తాయని ఫర్పల్ టీ తాగే వారు చెపుతారు. దీనిలో కెఫిన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది మరియు యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్‌లు ఎక్కువగా ఉంటాయి.
Also Read: Tea Tree Oil: అన్నిరకాల జుట్టు సమస్యలకు టీ ట్రీ ఆయిల్ పరిష్కారం
అసలు పర్పుల్ టీ ఎలా తయారవుతుంది?
సాధారణంగా ఈ పర్పుల్ టీ కూడా ఊలాంగ్ టీ మాదిరిగానే ఉత్పత్తి చేయబడుతుంది. ఆకులు కోసిన తరవాత, ఎండబెట్టి ,వాడిపోయి, ఒక ఆకారంలోకి వచ్చే ముందు అవి పార్షియల్ ఆక్సీకరణకు గురవుతాయి. బ్రేవ్ చేసిన తరువాత, పర్పుల్ టీకి లేత ఎరుపు-ఊదా రంగు వస్తుంది, దీనికి కారణం ఈ ఆకులలో ఉండే ప్రత్యేక రంగు!
పర్పుల్ టీ ఎక్కడి నుండి వచ్చింది?
నిజంగా చెప్పాలంటే పర్పుల్ టీ భారతదేశంలోని అస్సాం ప్రాంతంలోని అడవుల్లో పెరుగుతున్నట్లు కనుగొన్నారు. వారి ప్రారంభ ఆవిష్కరణ తర్వాత, ఈ ప్రత్యేకమైన తేయాకు మొక్కలు కెన్యాకు తీసుకెళ్ళారు. అక్కడ కెన్యా యొక్క టీ రీసెర్చ్ ఫౌండేషన్ వారు వాణిజ్య టీ ఉత్పత్తికి అనువైన సాగు విధానాలను రూపొందించారు. చైనా మరియు భారతదేశం తర్వాత వాణిజ్య టీ యొక్క మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారులుగా నిలిచారు. కెన్యా ఇప్పుడు పర్పుల్ టీ యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారీగా నిలబడింది. కెన్యాలోని పర్పుల్ టీలు నంది హిల్స్‌లో ఉన్న తుమోయ్ టీ గార్డెన్ నుండి వస్తాయి.
Also Read: Banana Peel Tea: అరటి తొక్క టీ ప్రయోజనాలు