Mixed Rice – Fish Cultivation: ప్రపంచ జనాభా ఎక్కువ తీసుకునే ఆహార ధాన్యాలలో వరి ముఖ్యమైనది . వ్యవసాయం చేసే భూమిలో ఎక్కువ శాతం వరి సాగు చేస్తారు. వరి పండించడానికి నీరు ఎక్కువగా ఉండాలి. మరి అన్ని నీళ్లు వాడుతున్న వరి పంటలో వేరే అంతరపంట వేయలేము. రైతుకు అదనపు ఆదాయం, పర్యావరణానికీ మేలు చేస్తున్న నూతన వరి చేపల సాగు విధానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకొంటుంది .చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో వరి-చేపల సాగును చాల సంవత్సరాల క్రితమే మొదలు పెట్టారు.మన దేశంలో పశ్చిమబెంగాల్, ఒడిశా, ప్రాంతాల్లో వరి పంటలో మిశ్రమ పంటగా చేపలు పెంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వలు కూడా వరి చేన్లలో చేపలు పెంచడానికి ప్రోత్సహిస్తున్నారు. వరి పండించడానికి అధిక మొత్తంలో నీటిని నిల్వ చెయ్యవలసి ఉంటుంది. వరిని ఈ పద్దతిలో పండించడం వల్ల ఎక్కువ శాతం వాతావరణంలోకి మిథేన్ వాయువు విడుదలవుతుంది . మిథేన్ విడుదల అవ్వడం వల్ల భూసారం తగ్గుతుంది . వరి చేపల మిశ్రమ సాగులో మిథేన్ తక్కువ శాతంలో విడుదల అవుతుంది.
వరి మడులు పంటకాలమంతా నీటితో నింపి ఉంచాలి. వరి పంట మడిలో గట్టు చుట్టూ 3-4 అడుగుల వెడల్పు, ఒక అడుగు లోతు గుంత కాలువలు తీసుకోవాలి ( పెరెన్నియల్ ట్రెంచ్/ రెఫ్యూజ్ పాండ్). వరి సాగులో రోహు, తిలాపియా, బొచ్చె, కొరమీను, కామన్ కార్ప్ చేపల రకాలు పెరుగుతాయి. ఒక ఎకరా స్థలంలో 70 శాతం వరి, 30 శాతం చేపలు పెంచవచ్చు. ఒక ఎకరానికి 400-900 కిలోల పైగా చేపలు దిగుబడి వస్తాయి. ఒక ఎకరాకి వరి 20 వేల ఖర్చుతో, 48 వేల పంట పండించవచ్చు, అదే మిశ్రమ సాగులో 60 వేల ఖర్చుతో, 80-1.7 లక్షల వరకు ఆదాయం వస్తుంది.
Also Read:Tamarind Seeds: ఎందుకు పనికిరావు అని పడేసే చింత గింజలతో లక్షలు సంపాదించుకోవడం మీకు తెలుసా ?
ఈ సాగులో చేపల విసర్జితాలు ఎరువుగా ఉపయోగపడుతాయి , దాని వల్ల రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గి, 15-20 శాతం దిగుబడి పెరుగుతుంది. వరికి పట్టే కీటకాలు, పురుగులు, నాచు చేపలు తినడం వల్ల వరి బాగా పెరుగుతుంది, చేపలు బాగా ఎదుగుతాయి. వరి అంచులు తోవి నీళ్లు ఉండటం వల్ల ఎలకలు వరి పంటను దాడి చేయవు. వరి పంటను కోసిన తర్వాత సంవత్సరం మొత్తం చేపలు పెంచుకోవచ్చు.
వరిలో మొదటి సారి చేపలు పెంచడానికి గుంతలు తీయడానికి పెట్టుబడి అవసరం. చేపల ఆహారానికి పెట్టుబడి అవసరం ఉంటుంది. నేలని బట్టి ఏ చేపలని పెంచాలో నిపుణుల సలహాలు తీసుకోవాలి . వరదలు వచ్చే ప్రాంతాల్లో చేపలు కొట్టుకుపోయే అవకాశం ఉంది, ఇలాంటి ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలతో చేపలని పెంచాలి.
వరి -చేపలు మిశ్రమ పద్ధతిలో సాగు చేయడం వల్ల రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గింది, పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, భూసారం పెరుగుతుంది. వరి సాగు చేయడం ద్వారా మిథేన్ విడుదల అవుతుంది, దీని వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. ఈ మిశ్రమ సాగు చేయడం వల్ల 35 శాతం మిథేన్ విడుదల తగ్గుతుంది. వరి పంటలో చేపలు, పీతలు, రొయ్యలు, బాతులు మొదలైనవి పెంచుకోవచ్చు.
Also Read: Innovative Umbrella: ఎండా కాలంలో నీడలో పని చేయడానికి రైతులకు తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే పరికరం