Areca Leaf Plates: చిన్న చిన్న హోటల్స్ నుంచి పెద్ద పెద్ద విందు భోజనాల వరకు అందరూ ఎక్కువగా పేపర్ ప్లేట్స్ వాడుతున్నారు. చిన్న చిన్న పరిశ్రమలుగా మహిళలు పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి ముందుకు వస్తున్నారు. దీని ద్వారా ఇంటిలో ఉండె మహిళలకి మంచి ఉపాధి కలుగుతుంది. ఈ పేపర్ ప్లేట్స్ డిమాండ్ మార్కెట్లో బాగా ఉండటం చూసి నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి హై వే రోడ్డు పై శ్రీ వెంకటేశ్వర ప్రొడక్ట్స్ అని పరిశ్రమ పెట్టారు. ఇందులో పేపర్ ప్లేట్స్తో పాటు అడ్డాకులతో తయారు చేసే ప్లేట్స్, అరెకనట్స్ ప్లేట్స్ కూడా తయారు చేస్తున్నారు. గ్రామంలో మహిళలు పేపర్ ప్లేట్స్ పరిశ్రమ నడిపే వాళ్ళకి ముడి సరుకు కూడా సప్లై చేస్తున్నారు.
ఈ పరిశ్రమ ప్రారంభించి సంవత్సరం అవుతుంది. పర్యావరణానికి హాని జరగకుండా ఉండటానికి అరెకనట్స్ , అడ్డాకుల ప్లేట్స్ తయారు చేయడం మొదలు పెట్టారు. ఇందులో భోజనం ప్లేట్స్తో పాటు టిఫిన్ ప్లేట్స్, ప్రసాదం ప్లేట్స్, ఇడ్లీ ప్లేట్స్, స్క్వేర్ ప్లేట్స్ అనేక సైజెలో తయారు చేస్తున్నారు.
Also Read: Vegetable Solar Dryer: ఒరుగులు తయారు చేసుకునే వాళ్ళ కోసం కొత్త పరికరం…
ప్రరిశ్రమ మొదలు పెట్టడానికి 42 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్రతి రోజు పేపర్ ప్లేట్స్ 1000-3000 తయారు చేసి అమ్ముతుంటారు. ప్రతి రోజు వీటిని తయారు చేయడానికి 1.5 లక్షల పెట్టుబడి అవసరం. పెట్టుబడి పెట్టినంత లాభాలు కూడా వస్తున్నాయి. పేపర్ ప్లేట్ మెషిన్ ద్వారా పేపర్ ప్లేట్ ముడి సరుకుని అమ్ముకుంటూ కూడా ఆదాయం చేసుకుంటున్నారు.
అరెకనట్స్ ప్లేట్స్ కోసం అరెకనట్స్ లేదా పోక చెట్టు బెరడు కర్ణాటక ప్రాంతం నుంచి దిగుబడి చేసుకుంటున్నారు. ఈ బెరడుని నీటిలో 20 నిముషాలు ఉంచి తర్వాత ప్లేట్స్ తయారీలో వాడుతారు. ప్రెస్సింగ్ ద్వారా ప్లేట్స్ తయారు చేస్తారు. అరెకనట్స్ ప్లేట్స్ ఆర్గానిక్ ప్లేట్స్ కాబట్టి వీటికి డిమాండ్, రేట్ కూడా బాగుంటుంది.
అడ్డాకుల ప్లేట్స్ లేదా విస్తరాకులు అని కూడా అంటారు. వీటిని కూడా అరెకనట్స్ ప్లేట్స్ లాగానే తయారు చేస్తారు. కానీ వీటికి అడ్డాకులను కుట్టి ప్లేట్స్ ఆకారంలో ప్రెస్ చేస్తారు. ప్రతి రోజు ఈ పరిశ్రమ వాళ్ళు దాదాపు 6 వేల వరకు ప్లేట్స్ అమ్ముతారు. ఇతర ప్రాతాలకి కూడా సప్లై చేస్తున్నారు. మీరు ఈ పరిశ్రమ లేదా ప్లేట్స్ కొనుగోలు చేయాలి అనుకుంటే ఈ 6304049133 నెంబర్ సంప్రదించండి.
Also Read: Seed Cum Fertilizer Drill: పత్తి సాగు చేసే రైతులకి ఎరువులు వేయడానికి తక్కువ ఖర్చుతో కొత్త పరికరం.!