Agri Export-Import in India 2022: ప్రపంచదేశాలలో భారతదేశం నూట నలబై కోట్లకు పైగా జనాభాతో మొదటి స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. మన ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన రంగాల్లో వ్యవసాయం రంగం ఒకటి. అతిపెద్దరంగం అయినప్పటికి మన వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. దినికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మూసపద్దతి సాగు విధానాలు, పురాతన పద్ధతులు, యంత్రాల వినియోగలేమి వంటివి. ఇలా ఉన్నప్పటికి దేశ జనభాకి ఆహారం మరియు ముడి పదార్థాల సరఫరాదారుగా ఉన్నమన సాగురంగంలో స్వాతంత్య్రానంతరం దేశ జనభాలో 70 శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. సాగులో యాంత్రీకరణ నూతన ఓరవడిని ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పాదకతలను పెంచేందుకు మూడో ప్రణాళికా కాలం నుంచే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సంవృద్ధిని సాధించడం ఈ ప్రణాళిక ముఖ్యోద్దేశం. కానీ ప్రణాళికా కాలంలో పరిశ్రమలు, సేవారంగం అభివృద్ధి చెందడంతో వ్యవసాయంపై ఆధారపడిన జనాభా శాతంతో పాటు జాతీయోత్పత్తిలో వ్యవసాయం వాటా తగ్గింది. 1960లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన శ్రామిక శక్తి శాతం 74 కాగా, అది క్రమంగా తగ్గి 2023 నాటికి 51 శాతానికి పడిపోయింది.
భారతదేశం వెన్నెముకగా కొనసాగుతున్న వ్యవసాయరంగానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం తో ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా తృణధాన్యాలు, బియ్యం, పాలు, చక్కెర, పండ్లు మరియు కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, గుడ్లు మరియు మత్స్య ఉత్పత్తులలో ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్ ఉంది. దేశీయ డిమాండ్లో వృద్ధి కంటే వ్యవసాయ-ఆహార ఉత్పత్తి వేగంగా పెరుగుతోందని మరియు ఎగుమతి కోసం మిగులు పరిమాణం వేగవంతమైన వృద్ధిని సాధిస్తోందని ఇటీవలి వృద్ధి రేట్లు చూపిస్తున్నాయి.
ప్రస్తుత దిగుమతులు ఎగుమతుల పరిస్థితులపై విశ్లేషణ
భారతదేశంలో వ్యవసాయ రంగం అతిపెద్ద జీవనాధారం. ప్రపంచంలో వ్యవసాయం మరియు ఆహార ఉత్పత్తులను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో దేశం ఒకటి. భారతదేశ జనాభాలో 58% మందికి వ్యవసాయం ప్రధాన జీవనోపాధి వనరు. భారతీయ ఆహార పరిశ్రమ భారీ వృద్ధికి సిద్ధంగా ఉంది. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆహార వాణిజ్యానికి భారత్ తన సహకారాన్ని పెంచుకుంటూ పోతుంది. ఉత్పత్తులతో పాటు విలువ జోడింపుకు అపారమైన సామర్థ్యం ఉంది. భారతదేశ వ్యవసాయ రంగ వృద్ధి రేటు 2020-21లో 3.6% ఉండగా 2021-22లో 3.9% కి చెరింది. దేశంలో బియ్యం, గోధుమలు, పప్పులు, నూనె గింజలు, కాఫీ, జనపనార, చెరకు, టీ, పొగాకు, వేరుశెనగ, పాల ఉత్పత్తులు, పండ్లు మొదలైన అనేక ప్రపంచంలో వ్యవసాయం మరియు ఆహార ఉత్పత్తులను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం ఒకటి.
2021- 2022 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఎగుమతులు చేసిన దానికంటే 2022-2023 ఆర్ధిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో 25శాతం వృద్ది రేటు సాధించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఒక జాబితాను ఇటీవల విడుదల చేసింది. 2021-22 మధ్యకాలంలో భారతదేశ తేయాకు ఉత్పత్తి 1,344.40 మిలియన్ కిలోలుగా,కాఫీ ఉత్పత్తి 3420 లక్షల టన్నులు ఉంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాదికి కాఫీ, తేయాకు ఉత్పత్తిలో 2.39% శాతం పెరిగాయి. అలాగే నూనెగింజల ఉత్పత్తి అంచనా వేసినట్లుగా 37.15 మిలియన్ టన్నులను దాటింది. వీటితో పాటు బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, పప్పులు, ఆవాలు, చెరకు మరియు పండ్లు,కూరగాయలు వంటి ఇతర ఉత్పత్తులు రికార్డు స్థాయిలో అధిక ఉత్పత్తికి చేరుకున్నాయి.
భారతదేశంలో సారవంతమైన నెలలు, నీటి వనరులు కల్గి అత్యధిక పంటలు పండించే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్. హర్యానా. మధ్యప్రదేశ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు ఛత్తీస్గఢ్. దేశంలో అత్యధికంగా ఉత్పత్తి అయ్యే గోధుమలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ మరియు గుజరాత్ నుండి వస్తున్నాయి. చెరకు ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ 48% వాటాతో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. 2021- 2022లో భారత్ నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేసిన వ్యవసాయరంగ ఉత్పత్తుల విలువ 49.6 బిలియన్ డాలర్లకు చెరింది. 2020- 21 వ సంవత్సరంలో 41.3 బిలియన్ డాలర్లుగానే ఉండగా ఈ ఏడాది ఏకంగా 20శాతం పెరిగింది.
బియ్యం ఎగుమతుల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయ సంభదిత ఎగుమతుల్లో 19 శాతం ఈ బియ్యమే ఆక్రమిస్తున్నాయి. బియ్యం తర్వాత వరుసగా చక్కెర- 9శాతంగా, సుగంధ ద్రవ్యాలు-9 శాతంగా , మాంసం 7వ స్థానాల్లో నిలిచాయి. కాఫీ ఎగుమతుల్లో మొదటి సారిగా 1 బిలియన్ అమెరికన్ డాలర్లకు చెరింది. కాఫీ ఎగుమతులు పెరగాటానికి ముఖ్యంగా కర్ణాటక, కేరళ, మరియు తమిళనాడు రైతులే కీలకం.అలాగే సముద్ర తీర ప్రాంతాలైనా పశ్చిమబెంగాల్, ఆంద్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, కేరళ, మహరాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలనుండి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 7.7 బిలియన్ డాలర్లు దాటాయి.
భారతదేశం వివిధ రకాల సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందింది మరియు ఇది మిరియాలు, యాలకులు, జీలకర్ర, పసుపు మరియు అల్లంతో సహా అనేక రకాల సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేస్తుంది. భారతీయ సుగంధ ద్రవ్యాలకు ప్రధాన మార్కెట్లలో యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లలో చాలా డిమాండ్ ఉంది. అలాగే మామిడి, అరటి, ద్రాక్ష మరియు ఉల్లిపాయలతో సహా వివిధ రకాల పండ్లు మరియు కూరగాయలను ఎగుమతి చేస్తుంది. భారతీయ పండ్లు మరియు కూరగాయలకు ప్రధాన మార్కెట్లలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ మరియు సౌదీ అరేబియా దేశాల విపణుల్లో మంచి గిరాకి ఉంది.
అంతర్జాతీయ విపణుల్లో మన దేశ ఉప్పత్తుల స్థాయిని పెంచేందుకు మన ప్రభుత్వాలు రైతులను, రైతు సంఘాలను, ఎఫ్ పీఒలను ప్రేరేపిస్తూ,చిన్న, పెద్ద పరిశ్రమలను, వ్యాపారస్తులను అంతర్జాతీయ మార్కెట్ నాణ్యత ప్రమాణాలు తెలుసుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా ఎగుమతుల్లో B2B మార్కెట్ ను విస్తరించేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుంది. మన రైతులు, మన పంటలు, మన ఎగుమతులు గురించి వివరించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయినా APEDA (Agricultural and Processed Food Products Export Development Authority) కృషిచేస్తుంది. అలాగే భారత ప్రభుత్వం 50 రకాల వ్యవసాయ ఉత్పత్తులు కల్గిన ప్రొడాక్ట్స్ మాట్రిక్స్ ని రూపోదించి, దేశవ్యాప్తంగా ఎగుమతుల్లో ఇబ్బందులు లేకుండా ఎగుమతులకు ముందే ఉత్పత్లను పరిక్షించే విధంగా 220 ప్రోడాక్ట్ టేస్టింగ్ ల్యాబ్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
భారతదేశం ఇతర దేశాలకు ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తుల విలువ ప్రతి ఏడాది మారుతుంది. విపణి డిమాండ్, పంటల ఉత్పత్తి మరియు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు వంటి వివిధ అంశాల లెక్కల వివరాలను అపెడా విడుదల చేసింది. ఈ విడుదల చేసిన డేటా ప్రకారం, గత 5 సంవత్సరాలుగా భారతదేశ వ్యవసాయ ఎగుమతులు స్థిరంగా పెరుగుతునే ఉన్నాయి. ప్రతి ఏ డాది తన రికార్డును తనే బద్దలు కొటిన్నట్లు అంతర్జాతీయ మార్కెట్లో మన శక్తీని చూపిస్తుంది.
> 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత్ 39.7 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది.
> 2017-18 ఆర్థిక సంవత్సరం: భారతదేశం సుమారు 43 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది.ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 9.9% అధికం.
> 2018-19 ఆర్థిక సంవత్సరం: భారతదేశం సుమారు 44.1 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది, ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2.7% ఎక్కువ.
> 2019-20 ఆర్థిక సంవత్సరం: భారతదేశం సుమారు 47.5 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది, ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 6.8% అధికం.
> 2020-21 ఆర్థిక సంవత్సరం: భారతదేశం సుమారు 52 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది, ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 9.9% ఎక్కువ.
ఎక్కడెక్కడికి ఎగుమతులు
2019కి సంబంధించిన WTO ట్రేడ్ డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఎగుమతిదారులలో భారతదేశం ప్రస్తుతం పదో స్థానంలో ఉంది. మన దేశ వ్యవసాయ ఉత్పత్తులకు అతిపెద్ద దిగుమతుదారులు అమెరికా, బంగ్లాదేశ్, చైనా, యుఎఇ, ఇండోనేషియా,వియత్నాం,ఇరాన్, నేపాల్,మలేషియా సౌదీ అరేబియా లాంటి దేశాలు కలపు. 2021- 22 సంవత్సరకాలంలో అత్యధికంగా అమెరికాకు ఎగుమతి కాగా 11.5 శాతం వాటాతో 5.7 బిలియన్ డాలర్లతో అతిపెద్ద ఎగమతిదారుగా నిలిచింది. మన దేశ సముద్ర ఉత్పత్తులు ఎక్కువగా USA మరియు చైనాకు పంపిస్తున్నాము.
భారతదేశం వివిధ రకాల సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందింది మరియు ఇది మిరియాలు, యాలకులు, జీలకర్ర, పసుపు మరియు అల్లంతో సహా అనేక రకాల సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేస్తుంది. భారతీయ సుగంధ ద్రవ్యాలకు ప్రధాన మార్కెట్లలో యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లలో చాలా డిమాండ్ ఉంది. అలాగే మామిడి, అరటి, ద్రాక్ష మరియు ఉల్లిపాయలతో సహా వివిధ రకాల పండ్లు మరియు కూరగాయలను ఎగుమతి చేస్తుంది. భారతీయ పండ్లు మరియు కూరగాయలకు ప్రధాన మార్కెట్లలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ మరియు సౌదీ అరేబియా దేశాల విపణుల్లో మంచి గిరాకి ఉంది.
మన భౌగోళిక ఉత్పత్తులకు ప్రకటనలు విదేశాల్లో
భారతదేశంలో వ్యవసాయ మరియు ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తులతో నమోదు చేయబడిన భౌగోళిక సూచికలను (GI) ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన దిగుమతి దేశాలతో వ్యవసాయ మరియు ఆహార ఉత్పత్తులపై వర్చువల్ కార్యక్రమాలను అన్ లైన్ మీటింగ్ ద్వారా నిర్వహించాలని భారత ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. ఇప్పటికే కువైట్, ఇండోనేషియా, స్విట్జర్లాండ్, బెల్జియం మరియు ఇరాన్లతో ఇప్పటివరకు 17 వర్చువల్ బయ్యర్ మరియు సెల్లర్ ల మధ్య మీటింగ్ లు నిర్వహించబడ్డాయి. కెనడా (సేంద్రీయ ఉత్పత్తులు), UAE & USA (GI ఉత్పత్తులు), జర్మనీ, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, థాయ్లాండ్, ఒమన్, భూటాన్, అజర్బైజాన్ మరియు ఖతార్ వంటి దేశాలకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు.
Also Read: Mobile Rice Milling Machine: రైతు వద్దకే రైస్ మిల్.. పొలం వద్దనే బియ్యం పట్టించుకోవచ్చు
విదేశాల్లో భారతదేశ రాయబార కార్యాలయాల్లో అగ్రి సెల్ ఏర్పాటు
వియత్నాం, అమెరికా, బంగ్లాదేశ్, నేపాల్, ఇరాన్, సౌదీ , మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, చైనా, జపాన్ మరియు అర్జెంటీనాలోని భారత రాయబార కార్యాలయాలలో మన ప్రభుత్వం పదమూడు అగ్రి-సెల్లను ఏర్పాటు చేసింది. ఈ అగ్రిసెల్ ల ప్రముఖ నినాదం వాణిజ్య మార్కెట్ వసతులను పెంపోదించడం, వ్యవసాయ అనుభంద రంగాల్లో పర్యాటకం ఏర్పాటు, నూతన సాంకేతిక పద్దతులు, అలానే పెట్టుబడులను తీసుకొచ్చే లక్ష్యం గా అగ్రి సెల్ లను కేటాయించారు.
భారతదేశం ఎగుమతులు చేస్తున్న కార్యక్రమాలు
ఎ) వ్యవసాయ ఎగుమతి విధానం 2018 (Agriculture Export Policy)
భారత ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ ఎగుమతి విధానాన్ని AEP ని ప్రవేశపెట్టింది. స్వదేశీ, సేంద్రీయ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులతో పాటు ప్రాసేసింగ్ చేసిన ఉపఉత్పత్తులను అలాగే నమ్మకమైన (ట్రాస్ఫరేన్సీ) మార్కెటింగ్ వ్యవస్థను రూపోదించడం వంటి అంశాలను పెర్కొన్నారు. సంస్థలే కాకుండా రైతులు కూడా నేరుగా విదేశీ మార్కెట్లో ఎగుమతి అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది.
మ్యాంగో ఫెస్టివల్ 2022′ కింద భారతీయ మామిడి పండ్లకు అంతర్జాతీయ మార్కెట్లను అన్వేషించడానికి అపెడా కొత్త చొరవలో బహ్రయిన్ లో తొలిసారిగా తూర్పు రాష్ట్రాలకు చెందిన 34 రకాల మామిడి పండ్లను ప్రదర్శించడం గమనార్హం. ఇంతకు ముందు దక్షిణాది రాష్ట్రాలైన అల్ఫోన్సో, కేసర్, బంగన్ పల్లి మొదలైన రకాల మామిడి పండ్లను అంతర్జాతీయ ప్రదర్శనలలో చాలా వరకు ప్రదర్శించారు.
బి) ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ (ఎఫ్ఏఎస్)
APEDA ద్వారా వ్యవసాయ పంటల ఎగుమతులకు ప్రోత్సహం కల్పించే పథకమే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్. ఎగుమతి మౌలిక సదుపాయాల అభివృద్ధి పరచడం, క్వాలిటి డెవలప్మేంట్ చేయడం, మౌలిక సౌకర్యాలతో మార్కెట్లను ఏర్పాటు చేయడం, నాణ్యమైన ఉప్పత్తులను ఎగుమతులు చేసేలా వ్యాపారాలకు సహాయపడటం ఈ పథకం యొక్క లక్ష్యం . అపేడా ఈ స్కీమ్ ద్వారా 2021-22 నుండి 2025- 2026 వరకు 5 లక్షల నుండి 5 కోట్ల వరకు ఫైనాన్షియల్ సపోర్టు ఇవ్వనుండి
సి) మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ స్కీమ్
వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వాణిజ్య విభాగం కూడా ఎగుమతులను ప్రోత్సహించడం కొరకుTrade Infrastructure for Export Scheme, Market Access Initiatives వంటి ఫథకాలకు శ్రీకారం చుట్టింది మన సర్కారు. . అపెడా, మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ (MPEDA), టొబాకో బోర్డు, టీ బోర్డు, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డు, స్పైసెస్ బోర్డు, ఇంకా, తేనె ఎగుమతులను పెంచడానికి మన దేశం న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ పరీక్షని తప్పనిసరి చేసింది. దీంతో ఎగుమతులు చేశాక రిటర్న్ వంటివి లేకుండా ఉండేందుకు ఇలాంటి ల్యాబ్ ను ఏర్పాటు చేస్తూ మన దేశ ఎగుమతుల శాతాలను పెంచుతున్నాయి.
ఎగుమతుల విషయాన్ని పక్కన పెడితే మన వ్యవసాయ పంటల్లో గరిష్థ దిగుడులు సాధించినప్పటికి పంట కొతల తర్వాత త్వరగా చెడిపోయే పండ్లు, కూరగాయాల పంటల్లో స్టోరేజ్, ప్రాసేసింగ్ వంటి మౌలిక వసతులు లేక దాదాపు 46 శాతం వరకు వ్యవసాయ ఉత్పత్తులకు నష్టం జరుగుతుంది. ఈ నష్టం విలువ దాదాపు 92వేల కోట్లు ఉంటుందని అంచనా. దీనికి చాలా కారణాలు ఉన్నప్పటికి ముఖ్యంగా ఉపఉత్పత్తుల తయారి వ్యవస్థ, క్వాలిటి సమస్యలు, రవాణా వసతులు, మార్కెట్ లింకేజీల సమస్యలు వంటి వసతులు తక్కుగా ఉండటమే. మన దేశం పండించిన తక్కువ లైఫ్ ఉండే పంటలో కనీసం 10 శాతం కూడా ప్రాసేసింగ్ చేసే కేపాసిటిలేకపోవడం చాలా భాదకరం. అదే అభివృద్ది చెందిన అమెరికాలో దాదాపు 80 శాతం వరకు నష్టాలు లేకుండా పలు జాగ్రత్తాలు, ప్రాసేసింగ్ లు చెస్తున్నాయి. మన రైతుల ఆధాయం రానున్న రోజుల్లోనైనా రెట్టింపు అవాలంటే క్షేత్రస్థాయిలో యంత్రాల వినియోగం విరివిగా పెరగాలి. సాంకేతికతను అడుగడుగునా వినియోగించాలి. వంగడాల నుండి నూర్పిడి, మార్కెట్ల వరకు మరిన్ని పరిశోధనలు జరగాల్సిందే.