10 Profitable Agricultural Business Ideas: వ్యవసాయం అంటేనే లాటరీ. లాటరీలో అయినా ఒక్కోసారి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. కాని వ్యవసాయంలో మాత్రం నష్టాలు వెంటాడుతూ ఉంటాయి. కరువు, వరదలు, చీడపీడలు తట్టుకుని దిగుబడివచ్చినా సమయానికి గిట్టుబాటు ధర లేక ఏటా దేశంలో వేలాది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే వ్యవసాయం వినూత్నంగా చేస్తే లాభాలు వస్తాయంటున్నారు…నిపుణులు. ఆ వివరాలు చూద్దాం.
1. సరుగుడు పెంపకం: నైజీరియాలో రోజురోజుకు సరుగుడు సాగు మరింత లాభదాయకంగా మారుతోంది. ఈ వ్యవసాయ పంట సాంప్రదాయకంగా జీవనోపాధి, పోషణకు సహాయపడుతుంది. 90% నైజీరియన్ కుటుంబాలు రోజూ సరుగుడు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు.
2. క్యాట్ ఫిష్: నైజీరియాలో అనేక రకాల చేపలు పెరుగుతాయి, కానీ చాలా మంది క్యాట్ ఫిష్‌ను ఎంచుకుంటారు. ఎందుకంటే దాని మాంసం చాలా రుచిగా ఉంటుంది. చిన్న చేపల పెంపకంలో వీటిని సులభంగా సాగు చేయవచ్చు. ఈ చేపలకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది.
3. సేంద్రియ ఎరువుల ఉత్పత్తి: ఇది చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. తయారీపై పూర్తి అవగాహన ఉంటే చాలు. మీరు ఈ వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించవచ్చు. వర్మికంపోస్ట్ అనేది పోషకాలు పుష్కలంగా కలిగిన సేంద్రియ ఎరువు.మార్కెట్లో అన్ని వేళలా దీనికి డిమాండ్ ఉంటుంది
4. కోళ్ల పెంపకం: నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, లాభదాయకమైన వ్యవసాయం లో కోళ్ల పెంపకం ఒకటి. గత మూడు దశాబ్దాలో పెరటి నుంచి పరిశ్రమ స్థాయికి ఎదిగింది. అనుభవం ఉంటే చాలు తక్కువ పెట్టుబడితోనే కోళ్ల పెంపకం ప్రారంభించవచ్చు.
5. పుట్టగొడుగుల పెంపకం: పుట్టగొడుగుల పెంపకం ద్వారా కొన్ని వారాల్లోనే డబ్బు సంపాదించవచ్చు. కనీస పెట్టుబడి పెడితే సరిపోతుంది. పుట్టగొడుగుల పెంపకం గురించి శిక్షణ తీసుకుంటే నష్టాల భయమే ఉండదు. ఇంట్లోనే పెంపకం ప్రారంభించవచ్చు.
6. పందుల పెంపకం: నైజీరియాలో పందుల పెంపకం చాలా ఫేమస్. పంది ఒక కాన్పులో 10 నుండి 14 పంది పిల్లలను ఇస్తుంది. ఏడాది కాలంలోనే వంద కేజీల బరువు తూగుతుంది. అందుకే మొహమాటానికి పోకుండా పెంచుకుంటే సాఫ్ట్ వేర్ ఇంజనీరు కన్నా ఎక్కువే సంపాదించవచ్చు.
7. తేనెటీగల పెంపకం వ్యాపారం: హనీ బీస్ పెంపకానికి రోజువారీ పర్యవేక్షణ అవసరం. ప్రపంచవ్యాప్తంగా తేనెకు చాలా డిమాండ్ ఉంది. వీటి పెంపకానికి చాలా సంస్థలు ఉచితంగా శిక్షణ అందిస్తున్నాయి. ఈ వ్యాపారాన్ని ఎంచుకోవడం అనేది లాభదాయకమైన పని అని చెప్పవచ్చు. పెట్టుబడి కూడా నామమాత్రంగా ఉంటుంది.
8. మొక్కజొన్న సాగు: మొక్కజొన్న అనేక దేశాల్లో ప్రధాన ఆహారపంట. ఆఫ్రికాలో ఎక్కువగా పండించే ఆహార పంటలలో ఒకటి. మొక్కజొన్నను వివిధ మార్గాల్లో పండించవచ్చు. మొక్కజొన్న నుంచి వివిధ రకాల ఉప ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. మొక్కజొన్నతో తయారు చేసే బీరుకు చాలా డిమాండ్ ఉంది. అందుకే ఈ పంట సాగు లాభదాయకం.
9. నత్తల పెంపకం: నత్తలు మానవ శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను అందిస్తుంది. తక్కువ కొవ్వు ఉంటుంది. ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే నత్తలకు యమ డిమాండ్ ఉంది.
10. వరి సాగు: ప్రపంచంలో 300 కోట్ల మందికి వరి పంట ప్రధాన ఆహార పంటగా ఉంది. అందుకే ధాన్యానికి మార్కెట్ సమస్య లేదు. సన్న బియ్యానికి యమ డిమాండ్ ఉంది. అనేక దేశాల్లో ఈ పంట పండుతుంది. భారత్ వరి సాగులో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.