Primary Tillage: వేసవి పంట కోసిన తర్వాత (మార్చి/ఏప్రిల్) తొలకరి వానలు కురిసే వరకు (జూన్) భూమి ఖాళీ గా ఉంటుంది. 2-3 నెలలు ఏ వ్యవసాయ పనులు చేయనందున నేల గట్టి పడుతుంది. జూన్ నెలలో తొలకరి వానలు ప్రారంభం కాగానే రైతు తన అనుభవం తో తగు తేమ నేలలో ఉన్నపుడు ప్రధమం గా నేలను దున్నాలి. నేల రకాన్ని బట్టి, వేయబోయే పంట ను బట్టి నేలను ఎన్ని సార్లు దున్నాలి అన్నది నిర్ణయింప బడుతుంది. నేలను దున్నడం ముఖ్యం గా నేల గుల్ల బారి విత్తనం వేయడానికి అనువు గా తయారు చేస్తారు. నేల దున్నడం( TILLAGE) అనేది చేసే పని – దుక్కి (Tilth) అనేది దున్నడం వలన నేల ఏవిధం గా తయారయిందో తెలుపుతుంది. “మంచి దుక్కి” వచ్చింది అంటే నేల విత్తనం వేసుకోవడం కోసం అనుకూలంగా తయారు అయ్యింది అన్నమాట.
లోతుగా దున్నుట:
వేసంగి లో వర్షాలు పడిన చో రైతులు భూమిని లోతుగా దున్ని క్రింది నేలను పైకి వచ్చేటట్లు చేయడం వల్ల నేలలో హానికర కీటకాలు, కీటక గ్రుడ్లు సూర్యరశ్మి కి చనిపోతాయి. నేలను ఎంత లోతుగా దున్నాలి అనే విషయం నేల లోతు, ముందు వేయబోయే పంట కలుపు ఉధృతి ని బట్టి ఉంటుంది.
క్రింది నేల (SUB SOIL) ను దున్నుట:
ముఖ్యం గా ప్రతి సంవత్సరం ఒకేలోతు కు దుక్కి దున్నడం వలన నల్ల రేగడి భూముల్లో అడుగున గట్టి పొరలు(soil pans) ఏర్పడతాయి. ఈ గట్టి పొరల వలన వర్షపు నీరు భూమి లోనికి ఇంకకుండా చేయడమే కాక పంట వేళ్ళు నేల లోనికి లోతుగా వెళ్ళకుండా చేస్తాయి. అందువలన ఈ పొరలను విచ్చిన్నం చేయడానికి వేరే రకపు నాగలి (sub soil గా plough) ఉపయోగిస్తారు. ఈ రకం గా గట్టి పొరల విచ్చిత్తి కి 3-4 సంవత్సరముల కొకసారి దున్నిన చాలుతుంది.
Also Read: Mechanical Methods for Pest Control: యాంత్రిక పద్ధతులు ఉపయోగించి చీడ పురుగులను ఎలా అరికట్టాలి.!
సంవత్సరం పొడవునా దున్నుట: (Year Round Tillage):
పంట వేసే ముందు దున్నడమే కాకుండా పంట వేసిన తర్వాత వరుసల మధ్య పలు రకాల పనిముట్లను ఉపయోగించి పంటను కలుపు మొక్కల బారి నుండి కాపాడడమే కాకుండా, పలు మార్లు దున్నడం వల్ల నేల గుల్లగా ఉండడం వల్ల పడిన వర్షపు నీరంతా నేలలోనికి ఇంకి పంటలకు ఉపయోగపడుతుంది. ముఖ్యం గా ఈ రకపు సేద్యము బెట్ట ప్రాంతాలకు (వర్షాధారం గా పండించే పంటలు) చాలా అనుకూలo.
నేల తయారు చేయుటలో దున్నుట ను ప్రభావితం చేసే అంశాలు:
పంట రకo:
పంట రకాన్ని బట్టి దుక్కి లోతు, మెత్తటి దుక్కి ఆధారపడి ఉంటాయి. ఉదాహరణ కు వేరు లోతు గా పోవు పంటలకు లోతు దుక్కి అవసరం.(ప్రత్తి). జొన్న, చిరుదాన్యాలకు లోతు దుక్కి అవసరం లేదు. అదే విధం గా విత్తన సైజు ని బట్టి (పొగాకు, ఆవాలు, నువ్వులు, మిరప) మెత్తటి దుక్కి, అవసరం.
నేల రకం:
తేలిక నేలలను తక్కువ సార్లు దున్నినా కావలసిన దుక్కి (విత్తనం వాడుకోవడానికి సరిపడ్డ దుక్కి) వస్తుంది. బరువైన నెలలు తగు తేమ ఉన్నపుడు దున్న గలిగినపుడే మంచి దుక్కి వస్తుంది. అందువలన తేలిక నేలల్లో కంటే బరువైన నేలలు సేద్యానికి తగ్గట్టు గా తయారుచేయుట కష్టo.
శీతోష్ణ స్థితి:
వర్షాధార భూములు – తక్కువ సార్లు దున్ని తేమ నష్టాన్ని సాధ్యమైనంత వరకు అరి కట్టాలి. దీనికి తగినట్లు గా వర్షాధార పంటల ప్రాంతాల్లో దున్నే పనిముట్లు తయారు చేయ బడ్డాయి. ఉదా: ఆరు చెక్కల గొర్రు, గుంటకలు
సాగు పద్ధతి:
వర్షాధార పంటలకు తక్కువ దుక్కులతో నేలను తయారు చేయాలి. నీటి పారుదల తో పండించే పంటలను ఎక్కువ సార్లు దున్ని, కలుపు నుండి పంట ను కాపాడుకోవాలి. వరి పంటకు మడిలో నీరుంచి దమ్ము పట్టి నీరు ఇంకా కుండా చేయాలి. పంట రకాన్ని బట్టి కూడా సాగు పద్దతి మారుతుంది.
నిర్ణీత కాలం లో పండించే పంటల సంఖ్య:
సంవత్సర కాలం లో పండించే పంటల సంఖ్య ను బట్టి దుక్కుల సంఖ్య మారుతుంది.
Also Read:Ideal Tillage: మంచి విత్తన మడి కి నేలను ఎలా దున్నాలి.!