మన వ్యవసాయంయంత్రపరికరాలు

Sowing Seeds with Tractor: ట్రాక్టరుతో విత్తనం విత్తుదాం.!

3
Sowing Seeds
Sowing Seeds

Sowing Seeds with Tractor: వ్యసాయంలో ఆధునిక పరిజ్ఞానం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, మార్కెట్లోకి ట్రాక్టర్ తో నడిచే ఆధునిక విత్తనాలు విత్తే యంత్రాలు వచ్చినప్పటికీ, కొందరు రైతులు మాత్రం పాత పద్ధతి లోనే విత్తుతున్నారు.

ట్రాక్టర్ తో నడిచే విత్తనాలు విత్తే యంత్రాలు ఉపయోగించక పోవడానికి గల కారణలు:
విత్తనం విత్తే యంత్రాల గురించి సరైన అవగాహన లేకపోవడం
యంత్రాల వాడకం, నిర్వహణ గురించి అవగాహనా లేకపోవడం
విత్తనాలు వృధా అవుతాయి అనే అపోహలో రైతులు ఉండడం.
ట్రాక్టర్ తో నడిచే విత్తనాలు విత్తే యంత్రాలు – లాభాలు
తక్కువ సమయం లో ఎక్కువ భూమిలో విత్తవచ్చు.
కూలీల ఖర్చు తగ్గుతుంది.
తేమ శేతం అధికగంగా ఉన్నప్పుడు విత్తడం వలన మొలకెత్తి శాతం పెరిగితుంది.

సీడ్ డ్రిల్ల్
సీడ్ డ్రిల్ల్ ని చిన్న విత్తనాలు విత్తడానికి ఉపయోగిస్తారు. సీడ్ డ్రిల్ వరుస మధ్య దూరం కావలిసిన రీతిలో మార్చుకోవచ్చు. యంత్రం ట్రాక్టర్ తో లాగబడుతుంన్నంత సేపు విత్తనాలు పెట్టే లోని సీడ్ మీటరింగ్ మెకానిజం ద్వారా రబ్బర్ పైపుల గుండా సాళ్ళ మధ్యలో విత్తబడతాయి. విత్తనం విత్తిన వెంటనే మట్టి కప్పుటకు యంత్రం వెనుక భాగంలో ఒక బ్లేడ్ అమర్చి ఉంటాయి. కందులు, పెసర, వరి, వంటి పంటను విత్తుటకు ఉపయోగిస్తారు. సీడ్ మీటరింగ్ మార్చడం వలన వివిధ పంటలకు ఉపయోగించవచ్చ.

Sowing Seeds with Tractor

Sowing Seeds with Tractor

Also Read: Devarakadra Check Dam: జలసిరులతో కలకలలాడుతున్న దేవరకద్ర నియోజకవర్గం.!

సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ లో రేండు రకాల పెట్టెలు ఉంటాయి. విత్తనాల పెట్టే మరియు ఫర్టిలైజర్ పెట్టెలు ముందు వెనుక క్రమంలో అమర్చి ఉంటాయి. ఈ యంత్రం వలన ఒకే సమయం లో విత్తనం మరియు ఎరువులను కూడా వెయ్యవచ్చు. జీరో కం ఫర్టిలైజర్ డ్రిల్ ని ఎక్కువగా వరి కోత అనంతరం పొలంలో విత్తనాలు వలన పొలంలో నేరుగా విత్తడానికి ఉపయోగిస్తారు.ఇది ఉపయోగిచడం వలన పొలంను దుక్కి చెయ్యాలిసిన అవసరం ఉండదు. భూమి లోపలికి పోవడానికి విలోమాట్ రకం ఫర్రో ఓపెనర్ సీడ్ డ్రిల్ గా మారుస్తారు.

సీడ్ ప్లాంటర్
సీడ్ ప్లాంటర్ని పెద్ద విత్తనాలు విత్తడానికి ఉపయోగిస్తారు. దీనిలో కూడా సీడ్ డ్రిల్ లాగే వరుసల మధ్య దూరం కావాల్సిన రీతిలో మార్చుకోవచ్చు. కానీ దీనిలో ఉపయోగిచే సీడ్ మీటరింగ్ మెకానిజం ద్వారా విత్తనాల మధ్య దూరాన్ని ప్లాంటర్ లో సమాంతర, నిలువు మరియు వలుగా ఉండే ప్లేటను ఉపయోగిస్తారు. ఒక్కో పంటకు ఒక్కో రకమైన చక్రం వాడుతారు. వివిధ పంటలకు ఉపయోగిoచి తయారీ దారులు యాత్రం తో పాటు ఇస్తారు.
ప్లాంటర్ తో వేరుశెనగ, ప్రత్తి లాంటి పంటలను విత్తవచ్చు.
ఈ మధ్య కాలంలో చిన్న ట్రాక్టర్ వాడకం పెరగడం వలన వాటి సామర్థ్యానికి సరిపడే విత్తనం విత్తే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వారి స్వంత పనులకు వాడుకోవడంతో పాటు ఇతర రైతులకు అద్దెగా ఇచ్చి దాని వలన పెట్టుబడి త్వరగా సంపాదించుకోవచ్చు.

Also Read: Backyard Gardening: పెరటి తోటల పెంపకం.!

Leave Your Comments

Devarakadra Check Dam: జలసిరులతో కలకలలాడుతున్న దేవరకద్ర నియోజకవర్గం.!

Previous article

PJTSAU Diploma 2022: డిప్లోమా కోర్సులకు ఆన్ లైన్ దరఖాస్తు గడువు పొడగింపు.!

Next article

You may also like