Drone Pilot Training: మన దేశంలో వ్యవసాయంలో టెక్నాలజీ అందరూ వాడటం మొదలు పెట్టారు. ప్రభుత్వం కూడా ఈ టెక్నాలజీని వాడుకోవడానికి రైతులకి సబ్సిడీలతో, పథకాలతో ప్రోత్సహించడం ద్వారా రైతులకి వ్యవసాయంలో టెక్నాలజీ సులభంగా వాడుకుంటుంది. ప్రభుత్వం యంత్రాల, డ్రిప్, రోబోట్స్, డ్రోన్స్ వరకు అని వాటికీ సబ్సిడీ ఇస్తూ రైతులని వ్యవసాయంలో ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయంలో డ్రోన్స్ వాడటం ఈ మధ్య కాలంలో మొదలు అవడంతో రైతులు వారి పోలంకి మందులు పిచికారీ సులభంగా జరుగుతుంది.
ప్రభుత్వం డ్రోన్స్ రైతులందరికీ అందుబాటిలో ఉండేలా, రైతులు అందరూ వాడుకోవడానికి అనువుగా ఉండాలి అని ప్రతి జిల్లాలో డ్రోన్ పైలెట్ ఉండేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇంకో మూడు సంవత్సరాలో లక్ష మంది డ్రోన్ పైలట్ తయారు చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంది. డ్రోన్ టెక్నాలజీని అందరూ వాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికి 48 డ్రోన్ శిక్షణ పాఠశాలలు, ట్రైనింగ్న్ సెంటర్స్ కు అనుమతి ఇచ్చారు.
Also Read: Chekurmanis: పోషకాల నిలయమైన కొత్త పంట చెకుర్మనిస్ సాగు వివరాలు.!
మన దేశంలో 13 రాష్ట్రాల్లో 116 ఐటీఐలో తక్కువ సమయంలో ఈ డ్రోన్ టెక్నాలజీని నేర్చుకునే విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. రైతులకి ఖర్చు తగ్గించి ఆదాయం పెంచడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నాయి అని అందరికి తెలుసు. రైతు భరోసా కేంద్రల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకి డ్రోన్స్ అందుబాటులోకి తీసుకొని రావాలి అని చర్యలు తీసుకొస్తుంది.
ఐటీఐలో డ్రోన్స్ వినియోగించడానికి కోర్సులు నిర్వహించాలి అని కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చెయ్యడంతో ప్రస్తుతం 10 ఐటీఐలో డ్రోన్స్ శిక్షణ కోర్సులు నిర్వహించారు. కిసాన్ డ్రోన్స్ రైతులు వాడుకునేందుకు ఏప్ పీ వో బ్యాంకుకు రుణాలు ఇవ్వాలి అని నాబార్డ్ సలహాలు ఇచ్చారు.
డ్రోన్స్ వాడకం దేశంలో పెంచాలి, వాటిని మన దేశంలోనే తయారు చెయ్యాలి అని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నారు. మూడు సంవత్సరాలలో పీఏల్ఐ పథకంలో 120 కోట్లు డ్రోన్స్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. డ్రోన్స్ తయారీ, డ్రోన్స్ విడి భాగాలు కూడా మన దేశంలో జరగాలి, డ్రోన్స్ తయారీలో ఇతర దేశాలతో పోటీ పడాలి అని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
Also Read: Modern Agriculture Drones: ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ల ప్రాముఖ్యత.!