Agriculture Machines: ఆధునిక వ్యవసాయంలో వ్యవసాయ యంత్రాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వ్యవసాయ యంత్రాలు రైతులకు వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలను సులభతరం చేశాయి. వ్యవసాయ యంత్రాలు, పరికరాల సహాయంతో సమయం ఆదా చేయడంతోపాటు ఖర్చు కూడా తగ్గుతుంది. వ్యవసాయంలో ఉపయోగించే రెండు ముఖ్యమైన వ్యవసాయ యంత్రాల గురించి చూద్దాం. ఈ వ్యవసాయ యంత్రాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ సాధనాల లక్షణాలు మరియు ప్రయోజనాలను తెలుసుకుందాం.
స్ప్రేయర్ పంప్
పంటలకు తెగుళ్లు-వ్యాధులు వచ్చే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. తెగుళ్లు, వ్యాధులు సోకి పంట నాశనమవుతుంది. కలుపు మొక్కలు మొక్కల పెరుగుదలకు కూడా హాని కలిగిస్తాయి. తెగుళ్లు, వ్యాధులు మరియు కలుపు మొక్కలను నియంత్రించడానికి వివిధ రకాల పురుగుమందులను ఉపయోగిస్తారు. ఈ పురుగు మందులు/ఎరువులను స్ప్రేయర్ పంపు సహాయంతో పంటపై పిచికారీ చేస్తారు. వివిధ పనులు చేసేందుకు మార్కెట్లో అనేక రకాల స్ప్రేయర్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ఉపయోగం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
Also Read: మేకల పెంపకం రైతులకు అందుబాటులో మొబైల్ యాప్స్
చిన్న రైతులకు స్ప్రేయర్ పంపు యంత్రాలు బాగా ఉపయోగపడతాయి. ఈ యంత్రం వివిధ రకాల ఫంక్షన్లతో వస్తుంది. ఇది బ్యాటరీ ద్వారా మరియు చేతితో రెండింటినీ ఆపరేట్ చేయవచ్చు. ఇందులో మీరు ఒకేసారి 18 లీటర్ల పురుగుమందు నింపవచ్చు. పూర్తిగా నింపిన తర్వాత 20 నుండి 25 సార్లు ఉపయోగించవచ్చు. ఈ స్ప్రేయర్ పంపును రసాయనిక, వ్యవసాయం, ఉద్యానవనం మరియు మరెన్నో కార్యకలాపాలలో ఉపయోగించవచ్చు. ఈ మెషిన్ పై 6 నెలల నుండి ఒక సంవత్సరం వరకు వారంటీ ఉంది.
డ్రిప్ ఇరిగేషన్ కిట్
పూర్తిగా ఆటోమేటిక్ డ్రిప్ ఇరిగేషన్ కిట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డ్రిప్ ఇరిగేషన్ కిట్ ఫీల్డ్ ఇన్‌స్టాలేషన్ మరియు ఆపరేషన్ కోసం అవసరమైన అన్ని భాగాలను కలిగి ఉంటుంది. ఈ కిట్‌లో రైతులకు ఎలక్ట్రానిక్ వాటర్ టైమర్, ఫీడర్ లైన్ పైపు, మెయిన్‌లైన్ కోన్ కనెక్టర్, ట్యాప్ అడాప్టర్, హోల్డింగ్ స్టిక్, డ్రిప్ హోల్ పంచర్, హోల్ ప్లగ్, మెయిన్‌లైన్ స్ట్రెయిట్ కనెక్టర్, ఫ్లెక్స్‌నెట్ పైపు, డ్రిప్‌లైన్, ఇన్‌స్టాలేషన్ మాన్యువల్ మరియు మరెన్నో లభిస్తాయి. మీరు ఇంట్లో లేకపోయినా..మీరు సెలవులో ఉన్నప్పటికీ ఇది మీ తోటను బాగా నీటితో తడుపుతుంది. బాల్కనీ గార్డెన్, టెర్రస్ గార్డెన్ నుంచి అవుట్ డోర్ వరకు ఈ డ్రిప్ ఇరిగేషన్ కిట్ అనుకూలంగా ఉంటుంది. దాని సహాయంతో మీరు మీ అవసరానికి అనుగుణంగా నీటి షెడ్యూల్ను సెట్ చేయవచ్చు
Also Read: యూకే నుంచి వచ్చి హైడ్రోపోనిక్ పద్ధతిలో కూరగాయల సాగు