ఆంధ్రప్రదేశ్యంత్రపరికరాలు

శుభ్రపరుస్తు గ్రేడింగ్  చేసే యంత్రం(నిమ్మ, బత్తాయి, టమాటో రైతులకు సులభంగా గ్రేడింగ్  చేసుకోడానికి తయారు చేసే యంత్రం)

0
 యంత్రంఅవసరంఎందుకు :-
ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని రైతులు పండ్లను శుభ్రపరచడం మరియు వాటిని పరిమాణం ప్రకారం వర్గీ కరించడం కోసం ఎక్కువగా కూలీలపై ఆధారపడుతున్నారు. అయితే, కూలీల కొరత మరియు పెరుగుతున్న శ్రమ వ్యయం కారణంగా, రైతులు అధిక ఖర్చును భరించాల్సి వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, సౌర శక్తి ఆధారిత శుభ్రపరిచే & గ్రేడింగ్  యంత్రాన్ని రూపొందించాలి. ఇది రైతులకు సమయం మరియు ఖర్చును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. సాధారణంగా, చిన్న స్థాయి మెకాలికల్  గ్రేడర్ గంటకు 300 – 500 కిలోలు గ్రేడ్  చేయగలదు.
యంత్రంలో ఉపయోగించిన భాగాలు :-
పనితీరు విధానం (Working Mechanism):-
• పండ్లను ఫీడ్  హావర్ లో  వేసిన వెంటనే, ఫాగ్గర్స్  సాయంతో డీసీ మోటర్  ద్వారా వాటిని శుభ్రంచేస్తుంది.
• శుభ్రం అయిన తర్వాత, పండ్లు స్టీల్   ఫైపుల పై పరవహిస్తూ ముందుకు సాగుతాయి.
• రెండు స్టీల్  బార్ల మధ్య ఖాళీలు మొదట చిన్నగా ఉండి, నెమ్మదిగా పెద్దవిగా మారుతాయి.
• చిన్న పండ్లు ముందుగా పడిపోతాయి, పెద్దవి కొంచెం ముందుకి వెళ్లి తగినపరిమాణం ఉన్న చోట పడిపోతాయి.
• స్టీల్ బార్ల క్రింద ఉన్న ఆయా పరిమాణం ప్రకారంచిన్న, మధ్యస్థ మరియు పెద్ద పరిమాణం గల పండ్లను వేరు వేరు గ్రేడ్ లుగా  వర్గీకరిసారు.
యంత్రంలో  స్పెసిఫికేషన్ :-
యంత్రంయొక్కప్రయోజనాలు:-
  •  సౌరశక్తిని ఉపయోగించడంలో విద్యుత్  ఖర్చు ఉండదు
  • రైతులకు కూలీ ఖర్చు తగ్గింపు – మనుషులు చేసేది యంత్రం వేగంగా మరియు ఖచ్చితంగా చేస్తుంది.
  • పండ్లు శుభ్రంగా మరియు హానికరం కాకుండా శభ్రపరచడం & వర్గీకరణ అవుతుంది.
  • సులభంగా తీసుకువెళ్లే విధంగా డిజైన్  చేయడం వల్ల ప్రదేశం మారినప్పుడు ఇబ్బంది ఉండదు.
  • లెమన్, ఆరంజ్, టమాటో మొదలైన గుండ్రటి ఆకారంలో ఉన్న అన్ని రకాల పండ్లకు అనుకూలం.
  • పరి.మాణం ఆధారంగా వర్గికరించడంతో మార్కెట్లో ధరలను బట్టి సరళంగా విక్రయించవచ్చు.
ముగింపు:-
ఈ సౌర శక్తి ఆధారిత శుభ్రపరిచే & గ్రేడింగ్ యంత్రం రైతులకు చాలా మేలైన పరిష్కారం. కూలీల పై ఖర్చు తగ్గించుకోవడానికి, మార్కెట్లో మంచి ధరకు అమ్మడానికి, వ్యవసాయ పనిని సులభ తరంచేసేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇది ఆదర్శంగా    నిలుస్తుంది.
ఈ యంత్రాన్నిరూ. 8000 పెట్టుబడితో సులభంగా తయారు చేసుకోవచ్చు, దీని ద్వారా తక్కువ ఖర్చు తో వ్యవసాయంలో ఆధునికతను అమలుచేయవచ్చు.
బడిపాటి చిన్న బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్, వ్యవసాయ ఇంజినీరింగ్   విభాగం, ఏ. యం. రెడ్డి మెమోరియల్ కాలేజీ హాఫ్ ఇంజనీరింగ్, నరసరావుపేట,
ఫోన్  : 8074 726 311.
Leave Your Comments

భూసార పరీక్షా ఫలితాలను తెలుసుకోవడం ఎలా ?

Previous article

You may also like