Bucket Sprayer: పంటలను నాశనం చేసే కీటకాలు మొదలగు వాటిని నిర్మూలించుటకు కీటక నాశిని మరియు తెగుళ్ల నివారిణి అయినటువంటి రసాయన ముందులను మొక్కలపై తగినంత మోతాదులో వెదజల్లుట చాలా అవసరం. ఇందుకు గాను అనేక రసాయనిక మందులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ రసాయనిక పదార్ధములను మొక్కలపై వెదజల్లుట వలన అవి మొక్కల ఆకులు, కాండములపై పడి వాటిలోనికి క్రిములను చంపుటయేకాకుండా మొక్కలకు తెగుళ్ళు రాకుండా నిరోధిస్తాయి.
పిచికారి చేయుట: పొడి రూపంలో గాని, ద్రవ రూపంలో లభ్యమైన రసాయనిక పదార్థమును తగిన మోతాదులో నీళ్లలో కలిపి మొక్కలపై వెదజల్లె ప్రక్రియను ‘పిచికారి చేయుట’ (Spraying) అంటారు. ఈ ప్రక్రియకు ఉపయోగించే పరికరాలు పిచికారి యంత్రం లేక స్ప్రేయర్ అంటారు.
Also Read: Sowing Seeds with Tractor: ట్రాక్టరుతో విత్తనం విత్తుదాం.!
బకెట్ స్ప్రేయరు (Bucket Sprayer): ఇది లిఫ్ట్ పంపు లాగా పని చేస్తుంది. సిలిండరు లేక బారెల్ అనబడు ఒక స్థూపాకార గొట్టమును కలిగి ఉండి దానిలో పైకి, క్రిందకూ కదలెడి ముషలకo (Piston) ఉంటుంది. ముషలకo కడ్డీకి పైన అమర్చబడిన ఒక హాండిల్ను పట్టుకొని పిస్టన్ను బారెల్లో పైకి క్రిందకూ కదలించవచ్చు. ఈ పరికరం నందు పైకి మాత్రమే తెరచుకొను రెండు కవాటములు ఉంటాయి. బారెల్ అడుగు భాగమున ఒకటి, పిస్టన్ యందు మరొకటి అమర్చబడి ప్లాస్టిక్ లేదా రబ్బరు గొట్టము కలుపబ ఉండి దానికి రెండవ చివర నాజిల్ అమర్చబడి ఉంటుంది.
పనిచేయు విధానము: స్ప్రే చేయవలసిన రసాయన ద్రవమును ఒక బకెట్ లో కలుపు కొని బారెల్ పంపు అడుగుభాగాన్ని ఆ ద్రవములో మునిగేటట్లుగా బకెట్లో నిలబెట్టాలి.
సంపు హాండిల్ను పైకి లాగినప్పుడు బారెల్ అడుగును అమర్చిన కవాటముపైకి తెరచుకొని ద్రవము లోనికి ప్రవేశించును. ‘పిస్టన్లో క్రిందకు కదిలించినప్పుడు క్రింది కవాటము మూసుకొని, పిస్టన్ లో గల కవాటము తెరచుకొని ద్రవము బారెల్లో పిస్టన్ పై భాగమునకు చేరుకుంటుంది. మరల పిస్టను క్రిందకి పోయు పైకి లేచినప్పుడు పిస్టన్ పై భాగమున గల ద్రవము పై పీడనమ స్పేనాజిల్ను చేరి అక్కడ నుండి ధార గా వస్తుంది. పరికరము సాధారణముగా ఇత్తడి కలిగియుండి, తోటపనికి మరియు ఎత్తు స్ప్రే చేసుకొనుటకు ఉపయోగపడుతుంది.
Also Read: Drum Seeder: సులభంగా వరి నాట్లు వేసే అద్భుతమైన డ్రమ్ సీడర్