మన వ్యవసాయం

Aerobic Rice Cultivation: ఆరుతడి పద్ధతిలో వరి సాగు

1

Aerobic Rice Cultivation: రాష్ట్రవ్యాప్తంగా సాగుచేసే ప్రధాన ఆహార పంట వరి, దాని పెరుగుతున్న జనాభాకు ఆహారం, పశువులకు మేత మరియు గ్రామీణ ప్రజలకు ఉపాధిని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో 22 లక్షల హెక్టార్లకు పైగా సాగు చేసే ప్రధాన పంట వరి. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలు వరి పంటను ఉత్పత్తి చేస్తున్నాయి, వీటిలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం మరియు చిత్తూరు ప్రధాన ఉత్పత్తిదారులు. నిజానికి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి మరియు కృష్ణా మూడు ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా మొత్తం భారతదేశంలోనే మూడు ముఖ్యమైన వరిని ఉత్పత్తి చేసే జిల్లాలు. పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాలు ఆంధ్ర ప్రదేశ్ యొక్క రైస్ బౌల్ గా పరిగణించబడతాయి.

 

ఆరుతడి వరి:

ఎరోబిక్ వరి పద్ధతిలో వారిని మనంసాధారణంగా పండించే మొక్కజొన్న పంట వలె ఆరుతడిపరిస్థితులలో పండించడం, పంట అవసరం మేరకు నీటినిపెట్టడం ద్వారా పండించే విధానాన్ని ‘ఎరోబిక్ వరి’ అనివ్యవహరిస్తారు. ఎరోబిక్ వరిని ముఖ్యంగా మాగాణిభూముల్లో, సాధారణ పద్ధతిలో సాగు చేయడానికి నీటిలభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పండించే భూముల్లో అడపదడపా నీరు అందించే సౌకర్యం కలిగిన ప్రాంతాల్లోచెరువుల క్రింద సాగు చేసే పరిస్థితుల్లో ఈ పద్ధతి అనుకూలంగా వుంటుంది.

దమ్ము చేసి నీరు నిలగట్టవలసినఅవసరం లేదు.ఎరోబిక్ పద్ధతిలో సాగుచేయడానికి లోతైన వేరు వ్యవస్థ కలిగి, బెట్టను తట్టుకునే స్వల్ప కాలిక రకాలు అనుకూలం. యం.టి.యు 1010, ఐఆర్-64 వంటి రకాలు అనుకూలంగా వున్నట్లు పరిశోధనల్లో తేలింది.

తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకుని పలుమార్లు దున్ని, మెత్తని దుక్కి చేసి కలుపు సమస్యను లేకుండా చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ ఎరువులు వేసి కలియదున్ని బాగా చదును చేయాలి. నేల సమతలంగా, చదునుగా లేనట్లయితే తేమ సరిగ అందక మొలక సరిగా రాదు. పంట ఎదుగుదల కూడ సమానంగా వుండదు.

ఆరుతడి వారిలో నేల బాగా చదునుగా లేనట్లయితే భూమిలో తేమ వ్యత్యాసం వలన ఇనుము లోపము వంటలో బాగుగా కనబడి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. భూమిలో కావలసినంత లభ్య ఇనుము ఉన్నప్పటికి, తేమ వ్యత్యాసం వలన ఇనము లోపం వస్తుంది. నేలను సమాంతరంగ చదునుచేసి దీనిని నివారించడం చాలా ముఖ్యం. ఎకరానికి 25-30 కిలోల విత్తనము ఉపయోగించాలి. విత్తే ముందు 3 గ్రాముల కార్బండాజిమ్ కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి.

శుద్ధి చేసిన విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో 20 సెం.మీ. దూరంలో నాగటి సాలు వెనకగాని, గొర్రుతోగాని, ట్రాక్టరుతో నడిచే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసే గొర్రుతో (ఫర్టికమ్ సీడ్ డ్రిల్తో) గాని వేసుకోవచ్చు. విత్తనాన్ని పైపొరల్లో పడేటట్లుగా తక్కువ (2.5-5 సెం.మీ) లోతులో వేసుకోవాలి.

Also Read:

Leave Your Comments

Maize Health Benefits: మొక్కజొన్నలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Previous article

Pulses Crops: పప్పుధాన్యాల పంటలలో నేల మరియు సీడ్‌బెడ్ తయారీలో మెళుకువలు

Next article

You may also like