మన వ్యవసాయం

రైతు రక్షణతోనే సామాజిక భధ్రత అసెంబ్లీలో ఏపిసీఎం జగన్ ప్రకటన

0

దేశంలో ఎక్కడా లేని విధంగా కనీ వినీ పధకాలతో నివర్ తుఫాన్ బాధితులను ఆదుకొంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పంటలు నష్టపోయిన రైతులను దేశంలో ఎక్కడా లేని విధంగా నెల తిరక్కముందే తగు విధంగా సహాయం చేసి ఆదుకుంటామని సిఎం తన ప్రసంగం లో హామీ ఇచ్చారు ఏ సీజన్లో రైతులు పంట నష్టపోయారో అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీలు చెల్లిస్తున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రంగు మారిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైతన్నలకు ఊరట కల్గి స్తామని సభాముఖంగా వెల్లడించారు.

శాసన సభ ద్వారా రైతులకు భరోసా కల్గించే కార్యక్రమాలను వెల్లడిస్తుంటే ప్రతి పక్షం అడ్డుపడుతుందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలలకాలంలో రైతులకు అన్ని వర్గాల ప్రజలకు మేలుచేయడమే కర్తవ్యంగా ముందుకు వెళుతున్నామని జగన్ గుర్తుచేశారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో రైతాంగం సర్వతోముఖాభివ్రధ్ధే లక్ష్యంగా పనిచేయడం కర్తవ్యంగా నడుచుకుంటామని స్పష్టం చేశారు జగన్.

గత పదేళ్ళుగా క్షామంతో అల్లాడుతున్న రాష్ట్రం ఇప్పుడు సుభిక్షంగా ఉండటం చూస్తున్నామని జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రకృతి కరుణించడంతో ఏనాడూ లేనంతగా జలాశయాలు నిండుకుండలా మరాయని, భూగర్భ జలాల మట్టాలు పెరిగాయని ఆనందం వ్యక్తంచేశారు. అయితే గత రెండు నెలలుగా అడపా దడపా భారీ వర్షాలకు రైతన్నలు కొన్నిచోట్ల నష్టపోయారని వారిని ఆదుకునేందుకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తున్నామని జగన్ వివరించారు. పత్రికలు రాసాయనో ప్రతిపక్షాల విమర్శలకు జడిసో నేను ఇవన్నీ చేయనని రైతులకు తనకున్న ఆత్మీయానుబంధాలతోనే కార్యక్రమాలుంటాయని అన్నారు. ఖరీఫ్ లోపంట నష్టపోయిన రైతులకు అకాలవర్షాలు, తుఫాన్లు, వరదలు, అనావృష్టి మరేదైనా విపత్తుతో పంట నష్టపోతే ఆదుకోవడం చరిత్రలో ఇదే ప్రథమ మని ఈఏడాది అలా రైతులకు143 కోట్లరూపాయలు అందించి ఆదుకోవడం ప్రారంభించామని తెలిపారు నివార్ తుపాన్ వలన నష్టపోయిన వారికి కూడా ఆరకంగా చెల్లింపులు ఉంటాయని జగన్ ప్రకటించారు.

గత ప్రభుత్వాలు చేసిన విధంగా సహాయం అందించడంలో జాప్యంజరుగదని పంటల భీమాకు ప్రభుత్వమే ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లించడంతోపాటు సకాలంలో భీమామొత్తాన్ని రైతులు పొందేలా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని హామీ ఇచ్చారు. సహాయం అందించడంలో కులం, మతం, ప్రాంతం చూడమని అరకోటి మంది రైతులకు రైతుభరోసా ద్వార సహాయపడుతున్నామని వివరించారు. రైతు దుక్కిదున్ని విత్తనం నాటిన దశనుండి పండించిన పంట అమ్ముకునేవరకూ అన్నిదశల్లోనూ సహాయం చేయడానికి పదివేల ఆరువందల నలభై రైతు భరోసా కేంద్రాలను స్ధాపించామని వివరించారు. రైతులను సాంకేతికంగా పరిపుష్టం చేసేందుకు పదమూడు జిల్లాల్లో 147 సమగ్రపరిశోధనాశాలలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎరువులు, పురుగుమందులు , విత్తనాల నాణ్యతా ప్రమాణాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం ప్రసంగంలో పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను విశదీకరించారు.

దేశంలోనే పేరెన్నికగన్న పాలవిప్లవ పరిమళం అమూల్ సేవలను వినియోగించుకునేందుకు నిర్ణయించుకున్నామని జగన్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేట్ డైరీలకంటే పాల సేకరణహెచ్చుధరలు ఉండే విధంగా ఒప్పందం కుదిరిందని వివరించారు. త్వరలో ఎపిలో 9898 బల్క మిల్క్ సెంటర్లు ప్రారంభమవుతాయని రైతుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి భరోసా కల్పిస్తోందని విద్యుత్ యూనిట్ కు1.50 రూ.కే అందించడంతో రైతులకు ఊరట లభిస్తోందని సిఎం తన సుదీర్ఘ ప్రకటనలో వివరించారు.

Leave Your Comments

అవరోధాలను అధిగమించి ప్రగతి పధంలోకి అడుగు లేస్తున్న అనంత రైతు

Previous article

రైతులతో చర్చలు ఫలప్రదం కావాలి…..వెంకయ్యనాయుడు ఆకాంక్ష

Next article

You may also like