మన దేశంలో ముఖ్యమైన వాణిజ్య పంటలలో మిరప పంట ఒకటి. మిరప పంటకు నష్టం చేసే చీడపీడలను సకాలంలో గుర్తించి అవసరమైన నివారణ చర్యలను రైతాంగం చేపట్టినట్లయితే అధిక దిగుబడులను సాధించి మన దేశపు ఎగుమతిని మరింతగా పెంపొందించుకోవచ్చు.
ఆకుముడత పురుగు :
ఆకుముడత పురుగు మిరప పంటకు చాలా నష్టం కలుగ జేస్తుంది.వర్షాలు తక్కువగా ఉండి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే ఇవి విపరీతంగా వృద్ధి చెంది చాలానష్టాన్ని కలుగ చేస్తాయి. మిరప తోపాటు ఈ పురుగులు ఆముదము, తేయాకు, పత్తి, మామిడి మొదలగు పంటలను కూడ ఆశిస్తాయి.
దీని పెద్ద పురుగులు చాలా చిన్నవిగా, సున్నితంగా ఊదా రంగులో చీలిన రెక్కలతో ఉంటాయి. ఇవి 15-20 రోజుల్లో జీవిత చక్రాన్ని పూర్తి చేయడంవల్ల సంవత్సరానికి చాలా సంతతులు ఉత్పత్తి అవుతాయి.
పిల్ల, పెద్ద పురుగులు ఆకులను, పూమొగ్గులు మరియు కాయలను గీకి, రసాన్ని పిలుస్తాయి. అందుచేత ఆకులు మెలికులు తిరిగి పైకి ముడుచుకొని పోతాయి. ఆకులు రాలి పోవడం కూడా జరుగుతుంది. ఆశించిన పూ మొగ్గులు రాలి పోతాయి. కాయలను గీకుట వల్ల పొలుసులాగా తామర ఏర్పడుతుంది.మొక్క తొలి దశలో ఈ పురుగు ఆశించినచో మొక్కు గిడసబారి పూత సరిగా నిలవక పైరుకి అధికంగా నష్టం కలిగి పంట దిగుబడి తగ్గుతుంది.
వీటిని కార్బరిల్ 3గ్రా. లేదా ఫోసలోన్ 3 మి.లీ. డైమిధోయేట్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసి నివారించవచ్చును.
పేనుబంక :
పేనుబంక మిరప పండించే అన్ని ప్రాంతాల్లో ఆశించి నష్టం కలుగజేస్తుంది. ఈ పేలు వాతావరణం మబ్బుగా ఉన్నప్పుడు ఎక్కువగా వృద్ది చెంది వర్షాలు వచ్చినప్పుడు సాంద్రత తగ్గిపోతుంది. ఇవి ఇతర పంటలను కూడ ఆశిస్తాయి.
లేత ఆకు పచ్చ రంగులో ఉండే పిల్ల పురుగులు క్రమేపి మెరిసే నల్లని పెద్ద పురుగులవుతాయి. ఇవి లేత ఆకు అడుగు భాగం మరియు కొమ్మల నుండి రసం పీల్చుతు జీవిస్తాయి. ఈ పురుగులు విసర్జించే తీయని పదార్ధం వల్ల చీమలు చేరతాయి, మరియు ఆకు, కాండం, కాయపై మసి తెగులు వ్యాపిస్తుంది. ఇవి ఆశించిన ఆకులు మెలికలు తిరిగి మొక్క ఎదుగుద నశిస్తుంది. వీటివల్ల దిగుబడి తగ్గుతుంది. రెక్కలున్న పేనుబంక పురుగు ఒక పొలం నుండి మరొక పొలానికి త్వరగా తరలి వెళ్ళగవు.
మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా మిథైల్ డెమిటాన్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 0.75 గ్రా. లేదా డైమిధోయెట్ 2 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సహజంగా ఈ పురుగును అరికట్టే బదనికలు తగిన సంఖ్యలో ఉన్నప్పుడుపై మందును చల్లనవసరంలేదు.
నల్లి :
మిరపలో నల్లి ఆంధ్ర ప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఆశిస్తుంది. ఇవి తెల్లగా, పారదర్శకంగా కంటికి కనబడనంత పరిమాణంలో ఉంటాయి. చిన్న, పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా గూడు అల్లుకొని రసాన్ని పిలుస్తాయి. ఈ పురుగు ఆశించిన ఆకులు క్రింది వైపుకు ముడుచుకొని పోయి, తిరగబడిన పడవ ఆకారంలో ఉంటాయి. ఆకులు కాడలు పొడవు సాగి లేత ఆకుల చివర్లు చీలి గుత్తులు మాదిరిగా కనిపిస్తాయి. ఆశించిన మొక్కులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఆకుల పెరుగుదల తగ్గి పూత పూయుట నిలిచి పోయి దిగుబడి తగ్గుతుంది. తీవ్ర స్దాయిలో కాయలకు కూడ ఆశించును. ఆశించిన కాయల తొక్క గట్టి బడి తెల్లని చారులు ఏర్పడును.
నీటిలో కరిగే గంధకం 3గ్రా.లేదా డైకోఫాల్ 5 మి.లీ. లేదా ఫోసలోన్ 3 మి.లీ.లీటరు నీటిలో కలిపి ఆకుల అడుగుభాగం కూడా తడిచేటుట్లు పిచికారీ చేసి ఈ నల్లిని నివారించవచ్చు.
కొమ్మ ఎండు మరియు కాయకుళ్ళు :
ఈ తెగులు సేద్యపు నీటి సౌకర్యం సమృద్ధిగా గల ప్రాంతాల్లో ఎక్కువగా కనపడుతుంది. ఇది సాధారణంగా అక్టోబర్-నవంబర్ నెలల్లో అంటే మొక్కులు పూతకు వచ్చే సమయం నుంచి కాయకోతకు వచ్చు మధ్యలో ఎప్పుడైనా కనపడవచ్చు. పైరు పూతకు వచ్చినప్పుడు పూమొగ్గలకు తెగులు ఆశించడంవల్ల పూలు కుళ్ళి రాలిపోతాయి. పండు కాయలపై గుండ్రని, నల్లని మచ్చులు ఏర్పడటం వల్ల అవి కుళ్ళి రాలిపోతాయి. ఎత్తు మచ్చల మధ్యలో నల్లని ఎతైన గుండుసూది పరిమాణంలో శిలీంద్రపు బీజ సముదాయాలు వలయాలుగా ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో తెగులు సోకిన కాయలు వాటి సహజ ఎరుపు రంగు కోల్పోయి వాటి గడ్డి రంగులోనో లేక తెల్లగానో కన్పిస్తాయి. అట్టి కాయలు ఎండిపోతాయి. దీనినే ‘‘మజ్జిగ’’ తెగులని పిలుస్తారు. ఒక్కొక్కసారి ఆరోగ్యవంతంగా కన్పించే పండు కాయలు కల్లంలో ఎండబెట్టినప్పుడు తెల్లగా మారటం కూడా జరుగుతుంది.
ఈ తెగులు కొమ్మకు, కాండం పైకి వ్యాపించటం వల్ల మొక్కలు పై నుంచి కిందికి ఎండటం జరుగుతుంది. తెగులు సోకిన కొమ్మల పైన, కాండం మీద తెల్లని పొడవాటి మచ్చలు ముదురు గోధుమ లేదా నల్లని అంచుతో ఏర్పడతాయి.ఈ తెగులు విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది. విత్తనాలను తెగులు సోకిన పొలాల నుండి మాత్రమే సేకరించాలి. విత్తనాన్ని కాప్టాన్ లేక మాంకోజెబ్ కిలోకు 3 గ్రా. వంతున కలిపి విత్తనశుద్ధి చేయాలి. పైరు పై 1.5గ్రా. కాప్టాన్ లేదా మాంకోజెబ్ 3 గ్రా. వంతున లీటరు నీటిలో కలిపి పూత వచ్చే సమయంలో అంటే అక్టోబర్-నవంబర్‌లో రెండు వారా వ్యవధిలో రెండు సార్లు చల్లాలి.
బూడిద తెగులు :
బూడిద తెగులు సెప్టెంబర్ నెల నుంచి పైరుపై కన్పించవచ్చు. కాని సాధారణంగా డిసెంబర్ నుంచి మార్చి నెల వరకు పంటపై ఎక్కువగా కనపడుతుంది. ఆకులపై భాగం ఆకు పచ్చ రంగు కోల్పోతుంది. ఆకుల క్రింది భాగంలో తెల్లటి బూడిద మచ్చలేర్పడతాయి. తరువాత ఈ ప్రాంతంలో కణజాలం చనిపోయి ఆకులు తెల్లని బూడిద వంటి పొడితో కప్పబడి ఉంటాయి. ఇట్టి బూడిద వంటి శిలీంద్రపు పెరుగుదల ఆకు పైనే కాకుండ, పూత మరియు పిందెల పైన కూడా కన్పిస్తుంది. ఆకులు క్రమేపి పసుపు రంగుకు మారి రాలిపోతాయి. పూత,చిన్న కాయలకు తెగులాశించినప్పుడు అవి రాలటమో లేదా సరిగా పెరగక పోవటమో జరుగుతుంది.
గంధకం పొడి ఎకరానికి 20-25 కిలో చల్లి గానీ లేక నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేక డైనోక్యాప్ 1 మి.లీ.చొప్పున లీటరు నీటిలో కలిపి మూడు సార్లు 10-15 రోజు వ్యవధిలో పిచికారీ చేసిగాని ఈ తెగును అరికట్టవచ్చు.
సర్కో స్పోరా ఆకు మచ్చ :
మిరప ఆకుల మీద గుండ్రని గోధుమ రంగులో చిన్నవి,పెద్దవి మచ్చులు ఏర్పడతాయి. ముదురు మచ్చులు గుండ్రంగా, ముదురు గోధుమ రంగు అంచులు కలిగి ఉండి మధ్య భాగం తెల్లగా ఉంటుంది. పొడి వాతావరణ పరిస్థితుల్లో ఆకు మచ్చల మధ్యభాగం పగిలి కనపడుతుంది ఒక్కొక్కసారి ఇట్టి మచ్చలు మధ్య భాగం రాలి పోవటం జరుగుతుంది. మచ్చులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి.
ఈ తెగులు మిరపలో అక్టోబర్-నవంబర్‌లో మొదలై ఫిబ్రవరి వరకు కనపడుతుంది. సాధారణంగా తేమతో కూడిన అధిక ఉష్ణోగ్రతు ఈ తెగు వ్యాప్తికి అనుకూలం.
తెగులు ఆశించిన పైరుపై రాగి సంబంధమైన కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా. లేక ధైరాం లేక కాప్టాన్ 2 గ్రా. వంతున లీటరు నీటిలో కలిపి 15 రోజు వ్యవధిలో చల్లాలి.
బాక్టీరియా ఆకుమచ్చ :
ఈ ఆకుమచ్చ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కన్పిస్తుంది. కాని ఎక్కువగా వర్షాకాలంలో కనపడుతుంది. మొదటగా ఆకుల మీద చిన్న చిన్న నీటి మచ్చులు ఏర్పడి తర్వాత గోధుమ రంగులో పసుపు పచ్చని వలయాలతో కన్పిస్తాయి. క్రమంగా ఇవి పెద్దవిగా నల్లని రంగులో గ్రీజు మచ్చలుగా కనపడతాయి. తెగులు ఉధృతమైనప్పుడు ఆకులు దాదాపుగా పసుపు రంగుకు మారి ఎండి రాలుతాయి. ఈ తెగుళ్ళ లక్షణాలు ఆకుల తొడిమల మీద, కొమ్మల పైన మరియు పచ్చి కాయలపైన కూడ కన్పించవచ్చు. తెగులు ఆశించిన కాయలు కుళ్ళి కొమ్ము ఎండిపోతాయి.
తెగుళ్ళ లక్షణాలు కన్పించినప్పుడు ప్లాంటోమైసిస్ లేదా పోషామైసిస్ 2 గ్రా. మరియు 30 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ 10 లీ. నీటిలో కలిపి తెగులు తీవ్రతను బట్టి 15 రోజు కొకసారి 2-3 సార్లు చల్లాలి.
మొజాయిక్ తెగు :
ఈ తెగులు సోకిన మొక్కలలో రకరకాల లక్షణాలు కన్పిస్తాయి. సాధారణంగా తెగులు సోకిన మొక్కలు గిడసబారి గొడ్డు బారతాయి. ఆకులు పాలిపోయి లేత ఆకుపచ్చ రంగులోకి మారతాయి. కొన్ని సందర్భాల్లో ఆకులు సన్న బడడం, పసుపు వర్ణంలోకి మారడం, నల్లటి మచ్చ లేర్పడటం వంటి లక్షణాలను చూపిస్తాయి. కాయలపై నల్లటి వయాలేర్పడతాయి.
Leave Your Comments