మన వ్యవసాయం

భారత వెటర్నరీ కౌన్సిల్ సభ్యునిగా డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి …

0

భారత వెటర్నరీ కౌన్సిల్ సభ్యునిగా డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి సంచాలకులు పశుసంవర్ధక శాఖ గారి నియామకం.
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు, డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి గారిని భారత ప్రభుత్వం వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ గా భారత ప్రభుత్వం సభ్యునిగా భారత ప్రభుత్వం తమ గేజిట్ నెంబర్ పార్ట్ 2 సెక్షన్-3 తేదీ 18 .12. 20 20 రోజున తెలంగాణ రాష్ట్రం నుండి నియమించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం  భారత వెటర్నరీ కౌన్సిల్ గా డాక్టర్ వి. లక్ష్మారెడ్డి గారిని పశు సంవర్ధక శాఖకు, రైతులకు చేసిన సేవలను గుర్తించి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సిఫార్సు తో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు భారత ప్రభుత్వానికి సిఫారసు చేసి వెటర్నరీ కౌన్సిల్ సభ్యుడిగా నియమించడం జరిగింది. డా. లక్ష్మా రెడ్డి గారు శాఖలో అసిస్టెంట్ సర్జన్ గా 1987 లో చేరి వివిధ హోదాలలో 33 సంవత్సరాలు పనిచేసి 23 సార్లు ఉత్తమ అధికారిగా అవార్డులు అందుకున్నారు.

ముఖ్యంగా రాష్ట్రస్థాయి అవార్డు లైన డాక్టర్ సి.కె.రావ్ ఎండోమెంట్ ట్రస్ట్ అవార్డు, రాష్ట్రస్థాయి రైతు నేస్తం అవార్డు, మరియు ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రులైన డా. వైఎస్ఆర్, శ్రీ కె.రోశయ్య గారి నుండి ఉత్తమ జిల్లా అధికారి గా అవార్డులు అందుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా రూపాయలు ఐదు వేల కోట్లతో ప్రవేశపెట్టిన భారీ గొర్రెల అభివృద్ధి పథకాన్ని రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఆయా కులాల అభివృద్ధికి మరియు రాష్ట్ర పశు సంపద పెరగడానికి ఇతోధికంగా కృషి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మారెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్య మంత్రి గారికి ధన్యవాదములు తెలిపినారు.

డా. లక్ష్మా రెడ్డి గారు తనకు దక్కిన ఈ అరుదైన గౌరవాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర రైతులకు, పశువైద్య రంగానికి సేవ చేస్తానని పశు వైద్య రంగంలో నూతన ఒరవడి తీసుకువస్తానని తెలిపినారు.ఈ సందర్భముగా పశు వైద్య అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపినారు.

Leave Your Comments

రైతులతో చర్చలు ఫలప్రదం కావాలి…..వెంకయ్యనాయుడు ఆకాంక్ష

Previous article

తొలి భారత రైతు ప్రధాని చౌదరి చరణ్‌ సింగ్‌

Next article

You may also like