వార్తలు

Procedures for Fish Storing: చేపలను పట్టుబడి చేసిన తరువాత నిల్వ చేయు విధానాలు.!

0
Procedures for Fish Storing
Procedures for Fish Storing

Procedures for Fish Storing: ప్రపంచ జనాభాకి అవసరమైన ఆహారాన్ని అందించడంలో చేపలు ప్రముఖపాత్రను పోషిస్తున్నాయి. మారుతున్న ఆహారపు అలవాట్లను దృష్టిలో ఉంచుకొని చేపల నుండి కూడా రకరకాలైన విలువ కలిగిన ఉత్పత్తులను, తయారు చేస్తున్నారు. కానీ చేపలు త్వరగా చెడిపోయి, వాటి నాణ్యతను కోల్పోతాయి. వాటి నాణ్యతను కాపాడడం కోసం హైజీనిక్‌ హ్యాండ్లింగ్‌ పద్ధతులతో పాటు, చేపలను వివిధరకాలైన పద్ధ్దతులలో..

Procedures for Fish Storing

Procedures for Fish Storing

సంవత్సరాల తరబడి నిల్వ చేయవచ్చును. వీటిలో ముఖ్యమైన కొన్ని పద్ధతులు:

1. శీతలీకరణ
2. అతిశీతలీకరణ
ఎ) చేపలను / రొయ్యలను విడివిడిగా అతిశీతలీకరించడం.
బి) చేపలను /రొయ్యలను బ్లాకుగా అతిశీతలీకరించడం.
3. ఉప్పు పెట్టడం
4. ఎండ పెట్టడం
5. మారినేషన్‌ /పిక్లింగ్‌
6. డబ్బాలలో నిల్వచేయడం
7. ధూమకరణం
8. ఇరేడియేషన్‌

Also Read: Jhora Fish Farming: జోరా టెక్నిక్‌తో చేపల పెంపకం

1. శీతలీకరించడం (ఐసింగ్‌):
చేపలను పట్టుబడి అనంతరం కొంతకాలం పాటు నాణ్యత కోల్పోకుండా కాపాడటంలో ఉపయోగించే పద్ధతులలో శీతలీకరణ ఒకటి. మిగిలిన పద్ధతులతో పోల్చితే ఈ ప్రక్రియ ధర తక్కువ మరియు అందరికీ అందుబాటులో ఉంటుంది. కానీ శీతలీకరించడం వల్ల చేపల శరీర ఉష్ణోగ్రత దాదాపుగా 0  వరకు తగ్గుతుంది. కావున సూక్ష్మక్రిముల, ఎంజైముల క్రియాశీలత తగ్గడం వలన కొన్నిరోజుల పాటు చేపలను తాజాగా ఉంచవచ్చు. ఈ నిల్వ పద్దతి చేపల రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కొవ్వు తక్కువ ఉన్న చేపలను 12-15 రోజులు మరియు ఎక్కువ ఉన్న చేపలను 3-5 రోజుల వరకు శీతలీకరించడం వల్ల నిల్వ ఉంచవచ్చు.

2. అతిశీతలీకరణం (ఫ్రీజింగ్‌):
ఈ పద్ధతిలో చేపల శరీర ఉష్ణోగ్రత 200 సెం. వరకు తగ్గించి అతిశీతలీకరణం చేసి, ఉష్ణ బంధక గదులలో 180 సెం. ఉంచడం వలన 6 మాసాల నుండి సంవత్సర కాలం వరకు నిల్వ చేయవచ్చును. ఈ పద్ధతిలో చేపలను రకరకాలైన విధానాలలో ప్రాసెస్‌ చేసి నిల్వ చేయవచ్చు.
1) మొత్తం చేపను కడిగిన వెంటనే అతిశీతలీకరించవచ్చు.
2) సూక్ష్మజీవులకు నెలవైన మొప్పలు, ప్రేగులను తీసివేసి అతిశీతలీకరించడం.
3) మొప్పలు, ప్రేగులతో పాఓఱ తలను కూడా వేరు చేసి ఫ్రీజ్‌ చేయడం.
4) చేపను అడ్డంగా వెన్నుపూస మీదుగా ముక్కలుగా కత్తిరించి ఫ్రీజ్‌ చేయడం
5) చేప వెన్నుపూసకు ఇరువైపులా ఉండే మాంసాన్ని కోసి ఫ్రీజ్‌ చేయడం. లేదా
6) చేప మాంసం నుండి ముళ్ళులను వేరు చేసి మాంసంను మాత్రం ముద్దగా అతిశీతలీకరించడం కావలసిన పద్ధతిని బట్టి చేపలను లేదా చేప ముక్కలను పైన చెప్పిన ప్రకారం ప్రాసెస్‌ చేసి విడివిడిగా కానీ లేదా బ్లాకు రూపంలో గానీ అతిశీతలీకరించి -180 సెం.  వద్ద నిల్వ చేయవచ్చు.

3. లవణీకరణము (సాల్టింగ్‌):
ఇది ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉన్న నిల్వ చేసే విధానం. ఈ పద్ధతిలో ద్రవాభిసరణము ద్వారా చేప కణజాలంలోని నీరు తొలగించబడుటచే చేపలు నిర్జలీకరణం పొందుతాయి. లవణ ద్రావణం చేప కణజాలాలలోకి ప్రవేశించి జీవద్రవ్యగాఢతను 25 శాతానికి పెంచుట ద్వారా బ్యాక్టీరియాలు, ఎంజైములు, క్రియాశీలతను కోల్పోతాయి. లవణీకరణమును మూడు రకాలుగా జరుపవచ్చు.
ఎ) పొడి లవణీకరణము (డ్రై సాల్టింగ్‌) : ఈ పద్ధతిలో శుద్ధపరచిన ఉప్పు పొడిని కడిగిన చేపలపై రుద్దాలి. ఉదర కుహరాన్ని కూడా తగినంత ఉప్పుతో కూడిన అనంతరం పాత్రలలో చేపలను, ఉప్పును 1:3 నిష్పత్తిలో పొరలుగా అమర్చి 24 గంపప వరకు అలాగే ఉంచి తర్వాత నీడలో 2-3 రోజులు ఆరబెట్టాలి.
బి) తడి లవణీకరణం (వెట్‌ సాల్టింగ్‌) : ఈ పద్ధతిలో  శుభ్రపరిచిన చేపలను 20-30 శాతం లవణ ద్రావణంలో 10 గం. పాటు ఊరబెట్టిన తర్వాత ఎండలోగానీ, నీడలో గాని ఆరబెట్టాలి.

4. ఎండబెట్టుట (డ్రయింగ్‌):
ఈ పద్ధతిలో చేపలలోని నీరు ఆవిరై పోవడం వలన సూక్ష్మక్రిముల పెరుగుదల తగ్గిపోతుంది. చివరకు నీటిశాతం 8-10 శాతానికి తగ్గించబడుతుంది. చేపలను రెండు పద్ధతులలో ఎండ పెట్టవచ్చును.
ఎ) సాంప్రదాయ పద్దతి : చేపలను ఆరుబయట ప్రదేశాలలో చాపలపై పరిచి 2-3 రోజులపాటు ఎండలో ఆరబెట్టాలి. వినియోగానికి ముందు నీటిలో నానబెట్టాలి.
బి) సాంప్రదాయేతర పద్దతి : పట్టుబడి చేసిన చేపలను శుభ్రంగా కడిగి, తల అంతర్భాగాలను తొలగించి ఆరబెట్టే యంత్రాలలో ఉంచి నీటిని తొలగించిన తర్వాత గాలి దూరని డబ్బాలలో నిల్వచేస్తారు.

5. మారినేషన్‌ /పిక్లింగ్‌:
ఈ పద్ధతిలో చేపలను లేదా చేప ముక్కలను వెనిగర్‌, ఉప్పును మాత్రమే ఉపయోగించి, ఏ ఇతర నిల్వరసాయనాలు వాడకుండా నిల్వచేస్తారు. తయారు చేసే విధానం, ఉష్ణోగ్రతలను బట్టి ఈ పద్ధతిలో నిల్వ చేసిన చేపలను కొన్నిరోజుల నుండి సంవత్సరం వరకు నిల్వచేయవచ్చు.

6. దూమీకరణం /పొగ పెట్టడం:
ఈ పద్ధతిలో చేపలను తాళ్ళకు వ్రేలాడదీసి, కర్ర పొగను పెట్టుట వల్ల చేపలోని నీరు పూర్తిగా ఆవిరై ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఈ నిల్వ పద్ధతిని రెండు రకాలుగా చేయవచ్చు. మొదటి విధానంలో తక్కువ ఉప్పుతో ఎండ పెట్టిన చేపలను 380 సెం.  వద్ద వేడిచేసి నిల్వ ఉంచుతారు. దీనినే శీతల ధూమీకరణము (కోల్డ్‌ స్మోకింగ్‌) అంటారు. రెండవ విధానంలో చేపలను 1300 సెం. వద్ద వేడి చేసి కర్రపొగను పెడుతారు. ఈ పద్ధతినే ఉష్ణ ధూమీకరణం అంటారు.

7. డబ్బాలలో నిల్వ చేయడం:
ఈ విధానం ఖర్చుతో కూడుకున్నది కావున ఎక్కువకాలం నిల్వచేయవలసి వచ్చినప్పుడు లేదా ఆర్ధిక ప్రాముఖ్యత గల చేపలను ఎగుమతి చేయవలసి వచ్చినప్పుడు అవలంభిస్తారు. ఈ పద్ధతిలో మొదట చేపల ముక్కలను 25 శాతం లవణ ద్రావణంలో ఉంచుట ద్వారా రక్తం తొలగించబడుతుంది మరియు మాంసమును గట్టి పరచవచ్చును. ఈ ముక్కలను వేడి ఆవిరికి గురిచేయడం ద్వారా సూక్ష్మక్రిములను నాశనం చేసి, అధిక ఒత్తిడి గల యంత్రాలలో సీలు చేస్తారు. అందువలన బయట ఉన్న సూక్ష్మజీవులు డబ్బాలోకి ప్రవేశించలేవు. లోపల ఉన్న పదార్ధాన్ని మరియు డబ్బాలను 1210 సెం.  ఉష్ణోగ్రత మరియు 15 ఐబిఎస్‌ పీడనం దగ్గర ఉడకబెట్టడం వలన చేపలను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చును.

8. ఇర్రేడియేషన్‌ (గామా కిరణాల ప్రసరణ): ఈ విధానంలో కోబాల్ట్‌-60 అనే రేడియోధార్మిక మూలకాన్ని అయనీకరణం చెందించినప్పుడు వెలువడే గామా కిరణాలను పైన ఉదహరించిన వివిధ పద్ధతులలో నిల్వచేసిన మత్స్య ఉత్పత్తులపై ప్రసరింప చేసినప్పుడు ఈ కిరణాలు బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులను నాశనం చేసి వాటి పెరుగుదలను అరికట్టడం ద్వారా ఉత్పత్తుల నాణ్యతను ఎక్కువ కాలం కాపాడుతాయి. ఈ విధానం అధికఖర్చుతో కూడినదైనప్పటికి ఆహార భద్రత విషయంలో ఉత్తమమైనది కాబట్టి మత్స్య ఉత్పత్తుల నిల్వలో కూడా గామా కిరణాలతో ఇర్రేడియేషన్‌ ప్రక్రియ కూడా ఇటీవల కాలంలో అధిక ప్రాముఖ్యతను సంతరించుకుంది.

డా.ఆర్‌. శ్రీను, యం. మోహన్‌, డా.సి హెచ్‌. భాను ప్రకాష్‌, డా.యం. కిషన్‌ కూమార్‌, మత్స్య కళాశాల, పెబ్బేరు, ఫోన్‌ : 6300 487 614

Also Read: Fish Farming: కేజ్ ఫిషింగ్ పద్దతిలో చేపల సాగు

Leave Your Comments

Seed Cleaning in Chili Crop: మిరపలో విత్తనశుద్ధి – నారుమడిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు

Previous article

Analysis on Good Prices of Dried Chillies: ఈ ఏడాది ఎండుమిర్చికి మంచి ధరలకు కారణాలు ఒక విశ్లేషణ.!

Next article

You may also like