వార్తలు

Horticultural Crops: ఏప్రియల్‌లో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులు

0
Horticultural Crops
Horticultural Crops
మామిడి:
మామిడిలో పిందెలు బఠాణి గింజ సైజు నుండి నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు 25 నుండి 30 రోజులకొకసారి తేలికపాటి నీటితడులిస్తే పిందెరాలడాన్ని నివారించవచ్చు. 1 శాతం యూరియాను నిమ్మకాయ సైజుదశలో ఒకసారి 20 రోజుల తరువాత రెండోసారి పిచికారీ చేసి పిందె రాలడాన్ని నివారించుకోవచ్చు. లేదా పొటాషియం నైట్రేట్‌ 10 గ్రాములు / లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మామిడి పిందెలు గోళీ సైజు దశలో ఉన్నప్పుడు లేదా కాయపుచ్చు పురుగులు వలస వెళ్లే సమయంలో డైక్లోరోవాస్‌ 1.5 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్‌ 2.5 లేదా వేపనూనె 3 మి.లీ. G క్లోరిపైరిఫాస్‌ 1 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి 5 శాతం వేప గింజల కషాయాన్ని ప్రతి పది రోజులకు ఒక సారి ఏప్రిల్‌ , మే నెల అంటే మామిడికాయల కోతకు 15 రోజుల ముందు వరకూ  పిచికారీ చేయాలి.
Horticultural Crops

Horticultural Crops

జామ:
నీటి తడులు ఆపాలి. తోటలో రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి.
అరటి:
అరటి అవసరాన్ని బట్టి నీటి తడులు సక్రమంగా ఇవ్వాలి. ఎండ పడి పాడవకుండా కొండపై రెండు అరటి చెత్తతో  కప్పాలి. ప్రతి మూడు నుండి నాలుగు రోజులకు ఒకసారి నీటితడులు తప్పనిసరిగా ఇవ్వాలి.
చీనీ, నిమ్మ:
చీనీ, నిమ్మ తోటలో సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని లేత ఆకులపై పిచికారీ చేయాలి. వేసవిలో నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. పిందె రాలుట  నివారణకు 100 లీటర్ల నీటికి ఒక గ్రాము 2,4-డి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
సీతాఫలం:
ఎండిపోయిన కొమ్మలను కత్తిరించడం వలన చెట్లు చిగురించి పూతకు వస్తాయి.
సపోటా:
సపోటాలో కలుపు లేకుండా శుభ్రత పాటించాలి
ద్రాక్ష:
పండ్ల నాణ్యతను పెంచేందుకు నీటి తడులు తగ్గించాలి. పండ్లలో రంగు, పక్వత రావడానికి ఇథóరెల్‌ను సిఫార్సు మేరకు వాడాలి.
దానిమ్మ:
దానిమ్మలో కాయ కోత సమయమిది.
పుచ్చ, దోస:
పుచ్చ మరియు దోసలో తామర పురుగు ఉనికి తెలుసుకోవడానికి పసుపు రంగు బట్టలను అమర్చాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే ఫిప్రోనిల్‌  రెండు మిల్లీ లీటర్లు లేదా స్పైనోసాడ్‌ 0.35 మిల్లీ లీటర్ల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగులు ఆశించినప్పుడు ఎమెక్టిన్‌ బెంజోయేట్‌  0.5 గ్రాములు లేదా స్పైనోసాడ్‌ 0.35 మిల్లీ లీటర్లు లేదా క్లోరాంట్రినిలిప్రోల్‌ 0.3 మిల్లీ లీటర్లు లేదా నొవాల్యురాన్‌ ఒక మిల్లీ లీటరు చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పనస:
పనసకి అవసరాన్నిబట్టి నీటి తడులు ఇవ్వాలి.
కూరగాయలు:
టమాట:
టమాటా నాటిన 30 నుండి 45 రోజులకు లీటరు నీటికి 5 గ్రా. జింక్‌ సల్ఫేట్‌ కలిపి పిచికారీ చేసినట్లయితే దిగుబడులు పెరుగుతాయి. పూత దశలో లీటరు నీటికి 20 గ్రాముల యూరియాను కలిపి పిచికారీ చేస్తే 20 శాతం దిగుబడి పెరుగుతుంది.
వంగ:
కొమ్మ, కాయతొలుచు పురుగుల నివారణకు 0.4 గ్రాముల ఫ్లూబెండమైండ్‌ లేదా 0.3 మి.ల్లీ. క్లోరాంట్రనిలిప్రోల్‌ లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. నాటిన 30వ 45 రోజున ఎకరాకు ఎకరాకు 50 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. పూత దశలో లీటరు నీటికి 5 గ్రాములు సూక్ష్మధాతు పోషక పదార్థాల మిశ్రమాన్ని పిచికారీ చేయడం వలన దిగుబడులు పెరుగుతాయి.
A
మిరప:
కాయ కుళ్ళు తెగులు నివారణకు 3 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా రెండు మిల్లీ లీటర్లు ప్రోపికొనజోల్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.  బూడిదతెగులు నివారణకు ఒక మిల్లీ లీటరు డైనోకాప్‌ లేదా ఒక మిల్లీ లీటరు అజాక్సీస్ట్రోబిన్‌ లేదా 0.4 గ్రాములు మైక్లోబ్యుటానిల్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Pandiri Kuragayalu

Pandiri Kuragayalu

Also Read:  ఆరుతడి పంటల్లో పోషక లోపాలు -నివారణ చర్యలు

పందిరి కూరగాయలు:
సొర, కాకర, బీరకాయలో పండు ఈగ నివారణకు ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. పెంకు పురుగుల నివారణకు క్లోరిపైరిఫాస్‌ 2.0 మిల్లీ లీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నివారణకు పెరుగుదల దశ నుండి పూత వచ్చే వరకూ 5 శాతం వేప గింజల కషాయాన్ని ఐదు రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి అధికంగా ఉంటే 2.0 మిల్లీ లీటర్లు డైమిథోయేట్‌ లేదా మిథైల్‌ డెమటాన్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఆకుకూరలు:
ఆకుకూరల సాగుకు పొలం తయారు చేస్తున్నప్పుడు ఆఖరి దుక్కిలో ఎకరాకు 6`8 టన్నుల పశువుల ఎరువు G రెండు టన్నుల వర్మికంపోస్టు వేసి కలియదున్నాలి. ఆఖరిదుక్కిలో 20 కిలోల నత్రజని G 15 కిలోల భాస్వరం G 20 కిలోల పొటాష్‌ నిచ్చే ఎరువులను వేయాలి. ఆకుకూరలు నాటుకున్న తరువాత ఎకరాకు 20 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం పొటాష్‌ ఎరువులు వాడాలి.
తోట పంటలు:
కొబ్బరి:
కొబ్బరిలో పది రోజులకు ఒకసారి చెట్లకు నీరు పెట్టాలి. తోటలో చెట్టు చుట్టూ చేసిన పళ్ళెంలో జనుము, జీనుగ, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచాలి. కొబ్బరిని ఆశించు నల్లి, ఆకు తేలు, గానోడెర్మా తెగులు, నల్ల మచ్చ తెగులు పరిశీలిస్తూ ఉండాలి.
ఇరియోఫిడ్‌ నల్లి:
ఆశించి రాలిపోయిన కొబ్బరి పిందెలను, కాయలను ఏరి నాశనం చేయాలి. ఒక్కో చెట్టుకు ఏడాదికి 5 నుండి 10 కిలోల వేప పిండి వేయాలి. వేపపిండితో పాటు ఇతర సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు విరివిగా వాడాలి. సారవంతమైన భూముల్లో అరటి, కంద, కోకో, పసుపు లేదా కూరగాయల వంటి అంతరపంటలు పండిరచడం ద్వారా నల్లి తాకిడిని తగ్గించవచ్చు. వేప నూనె లీటరు నీటికి 5 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి గెలలపై పిచికారీ చేయాలి. లేదా 10 మిల్లీ లీటర్లు వేప నూనె G 10 మిల్లీ లీటర్ల నీటిని మిశ్రమాన్ని వేరు ద్వారా ఎక్కించాలి. ఈ విధంగా ఒక సంవత్సరంలో మూడు సార్లు పెట్టాలి.
తమలపాకు:
మొదటి, రెండో సంవత్సరం తమలపాకు తోటల్లో ఫైటోప్తోరా  తెగులు నివారణకు ఒక శాతం బోర్డు మిశ్రమాన్ని పాదుల్లో పూర్తిగా ఒక నిలువు మీటరుకు  లీటరు చొప్పున తడిచే విధంగా పోయాలి. రెండో సంవత్సరం తోటల్లో ఆకులను ప్రతి నెలలో ఒకసారి కోయాలి. దాంతోపాటు తీగలను దింపకం చేయాలి.
జీడి మామిడి:
జీడిమామిడిలో  కొమ్మ పుష్పగుచ్ఛాలను తొలిచే పురుగు, కాయ, గింజ తినే పురుగులు ఆశిస్తాయి. అవసరాన్ని బట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మూడోదఫాగా ప్రొఫెనోఫాస్‌ ఒక మి.లీటరు / లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పూల తోటలు:
మల్లె:
మల్లెలో కలుపు తీసి పై పాటుగా ఎరువులను వేయాలి. లేత మొగ్గలను తొలిచే పురుగు నివారణకు మలాథిóయాన్‌ లేదా క్వినాల్‌ఫాస్‌ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కనకాంబరం:
కనకాంబరంలో వచ్చే పిండి పురుగు, పొలుసుల పురుగుల నివారణకు ఒక గ్రాము ఎసిఫేట్‌ లేదా రెండు మిల్లీ  లీటర్ల డైమిథోయేట్‌ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Leave Your Comments

Farm Mechanization: TAFE నుండి హెవీ హౌలేజ్ ట్రాక్టర్ విడుదల

Previous article

Cattle Management in Summer: వేసవిలో జీవాల యాజమాన్యం

Next article

You may also like