భారతదేశ వ్యవసాయ రంగం లో ప్రతిష్టాత్మక శాస్త్ర పరిశోధనా సంఘమైనా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(పీ పీ ఏ ఐ) ఆధ్వర్యం లో మొక్కల ఆరోగ్య నిర్వహణ-ఆవిష్కరణలు-సుస్థిరత ప్రధానాంశం గా అంతర్జాతీయ సదస్సుని రేపటి నుండి నాలుగు రోజుల పాటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం లో నిర్వహిస్తున్నట్లు పీ పీ ఏ ఐ అధ్యక్షులు డాక్టర్ బి.శరత్ బాబు తెలుపారు.పంటల సాగులో మొక్కల ఆరోగ్య సమ్రక్షణ,నిర్వహణ అత్యంత కీలకమైన అంశమని,ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా చీడపీడలు,తెగుళ్ళు వల్ల పంట దిగుబడులు 20 నుంచి 40 శాతం తగ్గుతున్నాయని ఐక్యరాజ్యసమితి కి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక వెల్లడించిందన్నారు.వాతావరణ మార్పులు పంటల సాగు పై గణనీయమైన ప్రభావాలని చూపుతున్నాయని,చీడపీడలు,తెగుళ్ళ ఉధ్రతి పెరుగుతుండటం తో పంటలకి తీవ్ర నష్టం వాటిల్లనుందని శరత్ బాబు చెప్పారు.పంటల సాగులో చీడపీడలు,తెగుళ్ళ ప్రభావాన్ని సమర్ధవంతం గా నివారించడం,నియంత్రించడం,మొక్కల ఆరోగ్య నిర్వహణ,ఆవిష్కరణలు సుస్థిరత ప్రధానాంశం గా ఈ అంతర్జాతీయ సదస్సు రేపటి నుండి నాలుగు రోజుల పాటు జరగనుందని తెలిపారు.ఈ సదస్సుని రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి,ఇన్ ఛార్జి ఉప కులపతి ఎం.రఘునందన రావు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ శారదా జయలక్ష్మీ దేవి,భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్లాంట్ ప్రొటెక్షన్ ఏ డీ జీ డాక్టర్ సునీత్ చంద్ర దూబే,ధనూక అగ్రిటెక్ లిమిటెడ్ ఛైర్మన్ ఆర్ ఎస్ అగర్వాల్,శ్రీ బయోటెక్ ఆస్థటిక్స్ ఛైర్మన్ కే ఆర్ కే రెడ్డిలు పాల్గొంటారని ఆయన చెప్పారు.పీ పీ ఏ ఐ ఏర్పాటై 50 వసంతాలు పూర్తి అయిన సందర్భం గా ఈ వేడుకలు ఘనం గా నిర్వహిస్తున్నామని ప్రత్యేక పోస్టల్ కవర్,తపలా బిళ్ళ ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు.
Also read:టమాటా నారు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైతులారా జాగ్రత్త.!
ఈ సదస్సు లో నార్మన్ బోర్లాగ్ అవార్డు విజేత డాక్టర్ స్వాతినాయక్,ఇండోనేషియా కి చెందిన డాక్టర్ మైకేల్ తదితర్ జాతీయ,అంతర్జాతీయ నిపుణులు సుమారు 500 మంది పాల్గొంటున్నారని వివరించారు.వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనపర్చిన శాస్త్రవేత్తలకి పురస్కారాలని,ఫెలో షిప్ లని ప్రధానం చేస్తామన్నారు.ఈ సదస్సు నిర్వహణకి అంగ్రూ,పీ జే టీ ఎస్ ఏ యూ,ఎన్ ఐ పీ ఏ ఎం సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయన్నారు.ఈ మీడియా సమావేశం లో డాక్టర్ జెల్లా సత్యనారాయణ,టెక్నికల్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ సి.నరేంద్ర రెడ్డి,డాక్టర్ టీ వీ కే సింగ్,డాక్టర్ కట్టి,డాక్టర్ వై శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.