Organic Farming by Indian Women in USA ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు పడుతున్నాయి. మసకబారుతున్న వ్యవసాయ రంగానికి సేంద్రియ వ్యవసాయం ప్రాణం పోస్తుంది. దేశ విదేశాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఆరోగ్యంతో పాటు, ఆర్ధికంగానూ నిలదొక్కుకుంటున్నారు. ఇక మన ఇండియన్స్ విదేశాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలా అమెరికాలో మన తెలుగమ్మాయి అయిన హారిక సేంద్రియ వ్యవసాయం చేస్తూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తుంది. మరి ఆమె ఎం చెప్పిందో ఇప్పుడు చూద్దాం…
హారిక గారు అసలు మీకు వ్యవసాయం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది ?
నేను గత ఎనిమిది సంవత్సరాలుగా గార్డెనింగ్ చేస్తున్నాను. కానీ ఎప్పుడు కూడా వ్యవసాయం చెయ్యాలి అని అనుకోలేదు. కరోనా సమయంలో ఎం చేయాలో తోచక వ్యవసాయాన్ని ప్రారంభించాను. అమెరికాలో జార్జియాలో ల్యాండ్ లీజుకు దొరుకుతుందని నా స్నేహితుడు శశి సలహా ఇచ్చాడు. దాంతో నేను ల్యాండ్ లీజుకి తీసుకుని వ్యవసాయాన్ని ప్రారంభించాను.
మీకు పెళ్లి అయ్యిందా? పిల్లలు ఎంత మంది ? Organic Farming by Indian Women
నాకు పెళ్లి అయి ఇద్దరు పాపలు ఉన్నారు. నేను సాఫ్త్వేర్ ఉద్యోగిని. నా భర్త పవన్ నాకు చాల సపోర్టుగా నిలుస్తున్నాడు. అందుకే ఒకవైపు సాఫ్త్వేర్ ఉద్యోగం చేస్తూ, మరోవైపు వ్యవసాయం చేస్తున్నాను. మా 7 సంవత్సరాలు, 4 సంవత్సరాల ఇద్దరు పిల్లల్ని భర్త పవన్ చూసుకుంటూ నాకు సపోర్ట్ చేస్తున్నాడు.
మీరు చేసేది అంతా ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ నా?
కంప్లీట్ గా ఆర్గానిక్ ఫార్మింగే. నేను మొదట లీజుకు తీసుకున్నప్పుడు ల్యాండ్ యజమానులు ఒక కండిషన్ పెట్టారు. ల్యాండ్ లో కేవలం ఆర్గానిక్ ఫార్మింగ్ మాత్రమే చేయాలనీ చెప్పారు.
చీడపురుగుల పరిష్కారానికి మీరేం చేస్తున్నారు?
పురుగుల కోసం ఎటువంటి మందులు చల్లట్లేదు. వాటి కోసం ట్రాప్స్ పెడుతున్నాను. అవి పెట్టడం వల్ల పురుగులు వచ్చి ఆ ట్రాప్స్ కి అతుక్కుపోతాయి. ఇక ల్యాండ్ ని లీజుకి తీసుకున్నప్పుడే ఓనర్ మనకు పొలం దున్ని ఇస్తాడు. ల్యాండ్ లీజులో అదొక పార్ట్.
విత్తనాలు ఎలా సేకరించారు ? Organic Farming by Women
విత్తనాలు నాకు చాలా వరకు ఫ్రెండ్స్ ఇచ్చారు. మన ఇండియన్ కూరగాయలు సొరకాయ. వంకాయ లాంటి కూరగాయలకు సంబంధించిన విత్తనాలు నా స్నేహితులు ఇచ్చారు. ఇక పూల మొక్కల విత్తనాలు మాత్రం నేనే కొన్నాను. మొక్కలకు నీరు పెట్టడానికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టం పనిచేస్తుంది. పైపుల ద్వారా అన్ని మొక్కలకు నీటి సౌకర్యం అందేలా పైపు లైన్లు ఏర్పాటు చేసి మొక్కల దగ్గర రంధ్రాలు ఏర్పాటు చేశాను.ఇక మొక్కల దగ్గర పిచ్చి మొక్కలు లేకుండా కిందా ప్లాస్టిక్ షీట్ వేసి సాగు చేస్తున్నాను. సో మొత్తంగా హారిక వ్యవసాయక్షేత్రంలో బాగా డిమాండ్ ఉన్న మునగాకు మొక్కలు, గోంగూర మొక్కల్ని ఎక్కువగా పెంచుతున్నారు. Organic Farming In USA