“మొక్కల ఆరోగ్య నిర్వహణ ఆవిష్కరణలు – సుస్థిరత” ప్రధాన అంశంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన నాలుగు రోజుల అంతర్జాతీయ సదస్సు నేటితో ముగిసింది. ముగింపు సమావేశానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఉదయ్ సింగ్ గౌతమ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి పరిశోధనలు శ్రీకారం చుట్టాలన్నారు. ప్రధాని మోదీ ఇటీవల భారత వ్యవసాయ పరిశోధన మండలి కి దిశనిర్దేశం చేస్తూ రానున్న రోజులలో సుస్థిర వ్యవసాయ అభివృద్ధి ప్రధానాంశంగా ఉండనుందని సూచించారని, రైతుల ఆదాయం రెట్టింపు చేయాలంటే పంటల వైవిద్దీకరణ ను ప్రోత్సహించాలని, ఉద్యాన పంటలు అధిక ప్రాధాన్య నిచ్చా.రు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.
ఈ నాలుగు రోజుల సదస్సు లో పలు తీర్మానాలను ప్రతిపాదించింది. పంటలను నష్టపరిచే చీడపీడలు, తెగుళ్లపై పరిశోధనలకు నిధుల పెంపు, పబ్లిక్ – ప్రైవేట్ సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేయడం, రైతులు, రైతు సంఘాలు సంయుక్తంగా పరిశోధన చేయడం, పటిష్టమైన విస్తరణ కార్యక్రమాలను రూపొందించి రైతాంగానికి చేరువ చేయనున్నారు. శాస్త్రవేత్తలకు శిక్షణ కార్యక్రమాలు, సామర్ధ్య పెంపు కార్యక్రమాలను రూపొందించాలన్నారు.
Read more:ఈ కొత్త రకం ఆవుల పాలలో ఎక్కువ పోషక విలువలు..
ఉత్తమ పరిశోధనా పత్రాలను సమర్పించిన శాస్త్రవేత్తలకు పురస్కారాలను అందజేశారు. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఫెలోషిప్ లను 37 మంది శాస్త్రవేత్తలకు అందజేశారు. ఈ సమావేశంలో PPAI అధ్యక్షులు డాక్టర్ శరత్ బాబు, IIOR మాజీ డైరెక్టర్ డాక్టర్ K.S వరప్రసాద్, డాక్టర్ షేక్ మీరా, డాక్టర్ జెల్లా సత్యనారాయణ, డాక్టర్ TVK సింగ్, డాక్టర్ సి. నరేంద్రరెడ్డి, డాక్టర్ పరమేశ్వరి, డాక్టర్ ఎస్. జె. రెహమాన్ డాక్టర్ టి. రమేష్ బాబు పాల్గొన్నారు.