ముఖా ముఖి

Implementation of new technologies in agriculture sector : వ్యవసాయ రంగం లో నూతన టెక్నాలజీల అమలు

1

వ్యవసాయ రంగంలో నూతన టెక్నాలజీలని అమలు చేసేటప్పుడు ఆహార భద్రత అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంఛార్జి ఉప కులపతి ఎం.రఘునందనరావు, ఐ ఏ ఎస్ తెలిపారు. హరిత విప్లవం దేశంలోని అనేక రంగాలు స్వయం సంవృద్ధిని సాధించి ముందుకెళ్ళడానికి కారణమైందని వివరించారు. మొక్కల ఆరోగ్య యాజమాన్యం-ఆవిష్కరణ, సుస్థిరత అన్న అంశం పై నాలుగు రోజుల పాటు సాగే అంతర్జాతీయ సదస్సుని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సదస్సుని రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. శాస్త్రవేత్తలు ఏ అవిష్కరణ, పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినా ఆహార భద్రత అంశాన్ని మర్చిపోకూడదని ఆయన స్పష్టం చేసారు. భూసార క్షీణత, నీటి కాలుష్యం వంటి ప్రధాన సవాళ్ళని నేడు ఎదుర్కొంటున్నామని రఘునందనరావు వివరించారు. అదే విధం గా రైతులకి సరైన సమాచారం చేరకపోవడం వల్ల ఎరువులు, పురుగుమందుల వినియోగం అధికమైందని దీనిపై శాస్త్రవేత్తలు దృష్టి
పెట్టాలని సూచించారు. జీవ ఎరువులు,ప్రెసిషన్ వ్యవసాయ పద్ధతులకి ప్రాధాన్యం ఇవ్వాలని రఘునందనరావు సూచించారు.

Also Read: గోల్డెన్‌ రైస్‌ ప్రాముఖ్యత.!

వాతావరణ మార్పులు,ఎరువులు,పురుగుల మందుల అధిక వినియోగం వల్ల మానవ, మొక్కల ఆరోగ్యం పై దుష్ప్రభావం పడుతోందని ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆర్ శారద జయలక్ష్మీ దేవి అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణ కి తోడ్పడే విధానాలు,టెక్నాలజీల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని,నూతన వంగడాలని రూపొందించాలని ఆమె సూచించారు.
ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడి 50 ఏళ్ళు అయిన సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనపర్చినవారికి పురస్కారాలు అందచేసారు. ఈ కార్యక్రమం లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అదనపు డైరక్టర్ జనరల్ సునీల్ చంద్ర దూబే,ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ బి. శరత్ బాబు, ధనూక అగ్రిటెక్ లిమిటెడ్ ఛైర్మన్ ఆర్.జి.అగర్వాల్, శ్రీ బయోటెక్ ఈస్థటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీ ఈ ఓ డాక్టర్ కె.ఆర్.కె రెడ్డి, విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతులు, శాష్త్రవేత్తలు, విద్యార్థులు, పారిశ్రామిక ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

Leave Your Comments

Plant Health Management-Innovations under the auspices of PPAI. : ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (PPAI) ఆధ్వర్యం లో మొక్కల ఆరోగ్య నిర్వహణ-ఆవిష్కరణలు

Previous article

Manufacturing of Value Added Products with Tomato : ఆదివాసి గిరిజన గూడెంలలో రెట్టింపు ఆదాయం కొరకు టమాటా తో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ

Next article