Curry Leaves Health Benefits: ఆహార పదార్ధాలకు రుచిని సువాసనను ఇవ్వడం తో పాటు శరీరానికి కరివేపాకు చేసే మేలు అంత ఇంత కాదు. కరివేపాకులో వివిధ రకాల ఔషద గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండ 4-5 కరివేపాకు ఆకులను నేరుగా తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూదాం. కరివేపాకు శరీరంలో పేరుకు పోయే కొవ్వును కరిగిస్తుంది.
బరువు తగ్గలి అనుకునే వారు కరివేపాకు ఆకులను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో బ్యాడ్ కోలేస్ట్రాల్ తగ్గించడం తో పాటు శరీర బరువును తగ్గించడంలో సహాయ పడుతుంది.మధుమేహ వ్యాధితో బాధ పడే వారి పాలిట కరివేపాకు ఒక వరంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలోను క్రమబాధికారిస్తుంది.అంతే కాకుండా కరివేపాకు నమిలి మిగడం వలన చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది.కరివేపాకు మన కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.ఇందులో విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది.
Also Read: Curry Leaf Cultivation: కరివేపాకు సాగు లో యాజమాన్య పద్ధతులు

Curry Leaves Health Benefits
కరివేపాకు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కళ్ళకు సంబంధిచిన జబ్బులను దూరం చేసుకోవచ్చు.ఇది కంటి చూపును మెరుగు పరచడం తో పాటు రేచీకటి సమస్యలను దూరం చేస్తుంది.కరివేపాకు జీర్ణ సంబంధిత సమస్య తగ్గించే గుణగణాలు మెండుగా ఉన్నాయి.ఆకలిని పెంచి జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.మలబద్ధకాన్ని నివారిస్తుంది.రోజు క్రమం తప్పకుండ కరివేపాకు ఆకుల్ని తీసుకోవడం వల్ల జుట్టు కి సంబంధించిన అన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు.
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వంటి సమస్యలను దూరం చేసి ఒత్తుగా పెరుగుతుంది. అలాగే కరివేపాకు ఒక మంచి సౌందర్య సాధన గా కూడా చెప్పవచ్చు . కరివేపాకు లో ఉండే సుగుణాలు చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇది చర్మం తాజాగా ఉంచడం తో పాటు వృధాప్యా ఛాయలు దారి చేరానివ్వదు. అలాగే కరివేపాకు రక్త హీనత సమస్యలను దూరం చేస్తుంది.అధిక రక్త పోటును నివారిస్తుంది.మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మూత్ర పిండల్లో ఏర్పడే రాళ్లను నివారిస్తుంది.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
Also Read: Wood Apple Unknown Facts: వెలగపండు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు.!