గోధుమ గడ్డి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడే సహజసిద్ధ ఉత్పత్తుల్లో గోధుమ గడ్డి ఒకటి. దీనితో మనం అనేక సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఒక గ్లాసు గోధుమ గడ్డి రసంలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కె, బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, సోడియం ఉంటాయి. పైగా దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు.
ఒక గ్లాసు రసంలోనే 17 ఎమినో యాసిడ్స్, ఫైబర్, ఎంజైమ్స్ ఉంటాయంటే ఇది ఎంతో ఆరోగ్యం
గోధుమ గడ్డిని తీసుకోవడం వల్ల కొవ్వు శాతాన్ని కరిగించి, అధిక బరువును, పొట్టను తగ్గిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఈ చిన్న పద్ధతిని అనుసరిస్తే ఎంతో మేలు జరుగుతుంది. క్రమం తప్పకుండా గోధుమ గడ్డి రసాన్ని లేదా పొడిని తీసుకుంటే రక్తపోటు రాదు. జీర్ణకోశంలోని కొలెస్ట్రాల్ కూడా ఇది తరిమికొడుతుంది.
గోధుమ గడ్డి పొడిని లేదా గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. శిరోజాల సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. పౌడర్ ని కానీ ఆహారంగా తీసుకుంటే జుట్టు రాలడం, తెల్లబడడం కూడా తగ్గుతాయి.
గోధుమ గడ్డి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు..
Leave Your Comments