Sugar Vs Jaggery: తియ్యని రుచితో పాటు అనేక రకాలు అయినా పోషకాలు బెల్లం లో కలిగి ఉంటాయి.చక్కెర తో పోలిస్తే బెల్లం వలన వచ్చే ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి రోజు ఏదో ఒక రూపంలో బెల్లం తీసుకోవడం ద్వారా చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బెల్లం మన జీర్ణ వ్యవస్థ ను మెరుగు పరుస్తుంది. బెల్లం తినడం ద్వారా శరీరంలో వివిధ రకాల ఎంజైమ్లు మరియు ఏసిటిక్ యాసిడ్ గా మార్చి జీర్ణ వ్యవస్థను మెరుగుపడేలా చేస్తుంది.అందువల్ల ఆహారం తేలికగా జీర్ణం అయ్యి మాలబద్దకం సమస్యను దూరం చేసుకోవచ్చు.అంతే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఈ బెల్లం ఎంతో సహాయ పడుతుంది.

Sugar
బెల్లంలో పోటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త హీనత నుండి కాపాడుతుంది.బెల్లం తరచుగా తీసుకోవడం వల్ల మహిళలో వచ్చే రక్త హీనత సమస్య ను దూరం చేసుకోవచ్చు.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి కణాజలా వ్యవస్థ ను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా కండరాలకు శక్తిని అందిస్తుంది.
Also Read: Black Sugarcane: నల్ల చెరకులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Sugar Vs Jaggery
బెల్లంలో అధికంగా ఉండే మెగ్నీషియం మరియు రక్త నాళాలు, నరాల వ్యవస్థ మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా శరీరం త్వరగా అలిసిపోకుండా కాపాడుతుంది.తరచుగా వచ్చే జలుబు, దగ్గు మరియు జ్వరాలు తగ్గించే శక్తి బెల్లం కు ఉంది. మరియు శరీరంలో రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది.ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది.
Also Read: PALM JAGGERY: ఆరోగ్యానికి తాటి బంగారం

Jaggery
శరీరంలో ఏర్పడ్డ మాలినలు బయటకు పడడంలో కీలక పాత్ర వహిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో మరియు కాలేయం తీరు మెరుగుపరచడంలో సహాయ పడుతుంది.బెల్లంలో ఇనుము అధికంగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ వృద్ధి చెందుతుంది. అంతే కాకుండా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.కంటి చూపును మెరుగు పరుస్తుంది.కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. తక్షణ శక్తిని అందిస్తుంది.ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్న బెల్లం ను రోజు తిందాం…ఆరోగ్యంగా ఉందాం.
Also Read: Jaggery Making in Sugarcane: చెఱకు నుండి బెల్లం తయారీలో మెళకువలు