ఆరోగ్యం / జీవన విధానం

వేసవికాలంలో తాగే టీ రకాలు..

0

టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు వేసవి కాలంలో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువగా తాగితే సమ్మర్ లో వేడి చేస్తుంది. మరి దీనికి ప్రత్యామ్నాయాలు వచ్చాయి. వేసవి కాలం తాగదగ్గ ఆ టాప్- 10 టీలు ఏంటో చూద్దాం..
వాటర్ మెలన్ ఐస్డ్ టీ:
వేసవిని ఎదుర్కోవాలంటే పుచ్చకాయను మించింది లేదు. దీన్ని టీలా వాడితే సరిపోతుంది. అదే వాటర్ మెలన్ ఐస్డ్ టీ. బ్లాక్ టీలో పుచ్చకాయ ముక్కలు కలిపి తయారుచేసే ఈ టీ, వేసవి కాలంలో ఎంతో ఉత్తమం. కాస్త పుదీనా, నిమ్మకాయ కూడా తగిలిస్తే ఈ టీ టేస్ట్ అద్భుతం.
కుకుంబర్ మింట్ గ్రీన్ టీ:
కీర, పుదీనా మిక్స్ ఎప్పుడైనా ట్రై చేశారు. దీంతో చేసిన టీ రుచిలోనే కాదు, పోషకాల్లో కూడా అమోఘం. ఐస్డ్ టీ రకాల్లో దీన్నిపెర్ ఫెక్ట్ కాంబినేషన్ గా చెబుతారు. మరీ ముఖ్యంగా జపనీస్ గ్రీన్ టీతో కీర – పుదీనా మిక్స్ అదిరిపోతుంది.
ఐస్డ్ లెమన్ గ్రాస్ గ్రీన్ టీ:
వేసవిలో మరో ఉత్తమమైన టీ రకం ఇది. దీన్ని తయారుచేసుకోవడం కూడా చాలా ఈజీ. మార్కెట్లో లెమన్ గ్రాస్ టీ బ్యాగ్స్ దొరుకుతాయి. దీనికి కాస్త తేనె లేదా నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
అర్నాల్డ్ పామెర్:
వేసవికాలం ఎక్కువమంది ఇష్టపడే టీ ఇదే. బ్లాక్ టీ, ఐస్ టీని మిక్స్ చేసి దీన్ని తయారుచేస్తారు. నిమ్మకాయ జ్యూస్, పుదీనా అదనం.
థాయ్ ఐస్డ్ టీ:
పేరుకు ఇది టీ అయినప్పటికీ ఓ చిన్న సైజు ఐస్ క్రీమ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది టీలా కాకుండా క్రీమ్ గా ఉంటుంది. బ్లాక్ టీ లేదా రెడ్ టీకి స్వీట్ మిల్క్ మిక్స్ చేసి దీన్ని తయారుచేశారు. ఇందులో నార్మల్, స్పైస్ రకాలుంటాయి. స్పైస్ కావాలంటే పుదీనా యాడ్ చేసుకోవచ్చు.
జాస్మిన్ ఐస్డ్ టీ:
టీ వెరైటీల్లో అన్నింటికంటే భిన్నమైంది ఇది. నీరు బదులు ఇందులో సోడాను వాడతారు. బ్లాక్ టీలో మల్లెమొగ్గలు, లెమన్ గ్రాస్ వేసి తయారుచేసే ఈ తేనీరు రుచిలో అమోఘంగా ఉంటుంది. శరీరానికి కూడా చాలా మంచిది. కొంతమంది మద్యం ప్రియులు ఈ టీలో కాస్త బ్రాందీ లేదా రమ్ మిక్స్ చేసుకుంటారు.
బ్లెండెడ్ మచ్చా గ్రీన్ టీ స్మూతీ :
ఇంతకు ముందే చెప్పుకున్నట్టు కాస్త క్రీమ్ కోరుకునే వాళ్లకు ఇది మరో ప్రత్యామ్నాయం. గ్రీన్ టీ ఆప్షన్స్ లో ఇదే బెస్ట్. మచ్చా పౌడర్ టేస్ట్ చూడని వాళ్ళు ఈ టీను ఓసారి ట్రై చేయొచ్చు. మన వ్యక్తిగత అభిరుచులకు తగ్గట్టు ఇందులో నచ్చిన ఫ్రూట్ ఫ్లేవర్ ను యాడ్ చేసుకోవచ్చు.
లెమన్ జింజర్ ఐస్డ్ టీ:
ఇంట్లో సింపుల్ గా చేసుకుంటే టీ రకం ఇది. రెగ్యులర్ గా అల్లం ఛాయ్, లెమన్ ఛాయ్ తాగేవాళ్ళు వేసవి కాలంలో ఈ రకానికి షిఫ్ట్ అవ్వొచ్చు. నిమ్మకాయ రసం, అల్లం రసం, గ్రీన్ టీ బ్యాగ్, ఐస్ క్యూబ్స్ ఉంటే చాలు.. ఈ టీ రెడీ. ఈ తేనీరుతో మరో సౌలభ్యం ఏంటంటే.. దీన్ని ఒకేసారి తయారుచేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సిప్ చేయొచ్చు.
రోజ్ వాటర్ ఐస్డ్ టీ:
ఈ వేసవిలో కాస్త స్పెషల్ గా ఉంటే టీ తాగాలనుకునేవాళ్లకు ఇది మంచి ఆప్షన్. రోజ్ వాటర్, నిమ్మకాయతో కలిపి చేసే ఈ టీ చూడ్డానికి చాలా ఎట్రాక్టివ్ గా ఉంటుంది. ఒంటికి కూడా చాలా మంచిది.
రీష్రెషింగ్ మింట్ టీ:
ఇది చేసుకోవడం చాలా ఈజీ. వేడి నీటిలో గ్రీన్ టీ, పుదీనా ఆకులు వేసి మరిగిస్తే సరిపోతుంది. దీనికి కాస్త తేనె, నిమ్మరసం కలుపుకుంటే ఇంకా మంచిది.

Leave Your Comments

కాశ్మీర్ లో తులిప్ వనం ప్రారంభం..స్వాగతం పలుకుతున్న15 లక్షల తులిప్ మొక్కలు

Previous article

రైతువేదికలు, నర్సంపేటలో మిరప పరిశోధన కేంద్రంపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు..

Next article

You may also like